Wednesday, May 15, 2019

NAH PRAYACHCHAMTI SAUKHYAM-27


  నః ప్రయచ్చంతి సౌఖ్యం-27
  *************************

  భగవంతుడు ఆదియోగి-భక్తుడు ఋషభ యును యోగియే.


 " యోగేశ్వరాయ మహాదేవాయ-త్రయంబకాయ త్రిపురాంతకాయ
   వికలాగ్ని కాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ
   సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః.'

       ఈశ్వరుడు యోగి యోగమే  తానైన వాడు మహాదేవుడు.మూడుకన్నులతో ముజ్జగములను కాపాడువాడు.ప్రళయకాలమునజగములనులీనముచేసుకొనువాడు,యమునుజయించునవాడు,సర్వులను రక్షించు ప్రభువు,ఎల్లప్పుడు శుభములను వర్షించువాడు అయిన రుద్రునకు అనేకానేక నమస్కారములు.
 హిమాలయములందు సంచరించు యోగి దేవుడని,తనకు తానే సృజించుకొని సంచరించువాడని కొందరు,కొందరు సామాన్య మానవుడని కైలాసము (కైవల్యమునకు నిలయము) నందు నిరంతర ధ్యానములో తనలో తాను రమించువాడని మరికొందరు అభిప్రాయ పడినను " దైవం మానుషరూపేణా" ధర్మమును పరిరక్షిస్తాడను వాదమును కాదనలేము కనుక పరమేశ్వరుడు అనగా పరమును ప్రసాదించువాడు ( ఇహముతో పాటు) ,శివుడు అనగా తాను తప్ప అన్యము లేనివాడు అయిన రుద్రుడు జగద్గురువు.

  "మంగళాయతనం దేవం యువానమతిసుందరం
   ధ్యాయేద్వన చరాకారం ఆగచ్చంతుం పినాకినం."


   సర్వమంగళను కూడిన శుభప్రదుడు.ఎందరో భవబంధములనుండి విడివడి భవచరణములను పొందవలెనని నిష్కళంక భక్తి యోగిని ధ్యానింపవలెనని తలచి,స్వామి అనుగ్రహించువరకు వేచియుండలేక నిష్క్రమించిరి.కాని ఏడుగురు మాత్రము అన్యము చింతించక స్వామి పాదపద్మములను కొలుస్తూనే ఉన్నారు.కాలము తనపని తాను చేసుకుంటున్నది.కాలాతీతుడు కన్ను తెరిచి తన ముందున్న ఏడుగురు సాధువులకు యోగమును తెలియచేసి,ఆత్మ సంయమనమును అనుగ్రహించెను.ఇహ-పర సమన్య మార్గమును బహుళ ప్రచారమునకు తెచ్చుటలో అగస్త్య ముని చాలా వరకు కృతకృత్యుడు కాగలిగినాడు

" నమః శంభవేచ-మయోభవేచ"

 ఇహపరములను ప్రసాదించు రుద్రునకు నమస్కారములు.

  హిమాలయ పర్వతముపై నందినాథుడను యోగి తన ఎనిమిది మంది శిష్యులను ధర్మ సంస్థాపనకై పంపించెనన్న వాదమును కలదు.

  '" నమో పూర్వజాయచ-పరజాయచ"


   పరమార్థమును బోధించిన పరమేశ్వరుడు తన అంశలతో భూలోకమున ఎందరో యోగులను ప్రసాదించినాడు.వారి దర్శనము స్మరణము సర్వపాపహరమనుటకు ఋషయోగి మందరుడు-పింగళను పునీతులను చేసిన విధము పరమేశ్వర సంకల్పము.

    ' ప్రపంచముతో బంధము మోహము-పరమాత్మతో బంధము మోక్షము."

   అవంతీపురములోని మందారుడు సకలశాస్త్రపారంగతుడు.పింగళ అను వేశ్యాలోలుడు.ఒకరోజు వారి ఇంటికి అతిథిగా ఋషభముని వెడలెను. ఋషభయోగి స్కాంధపురాణములోని బ్రహ్మోత్తరఖండమునందు ప్రస్తావింపబడినాడు.అతిథిసేవా సౌభాగ్యమును అందించాలనుకున్నాడు ఆ మూడు కన్నులవాడు.వారిద్దరు యోగిని పరమ శివునిగా భావించి,అత్యంత భక్తిశ్రధ్ధలతో ఆరాధించి,ఆశీర్వాదనుగ్రహమును పొందకలిగినారు.

   " నమః శంకరాయచ-మయస్కరాయచ."

    కాలగర్భములో కలిసిన మందారుడు  పుణ్యఫలమునందుకొనుటకై దశార్ణమహారాజునకు వజ్రబాహు నామముతో జన్మించెను.కథలో మలుపులు తిప్పి కాగల పనినిచేయుటయే కరుణాంతరంగుని లీల.వజ్రబాహు జననము ఇష్టములేని మిగిలినరాణులు సుమతిపై విషప్రయోగమునుచేసిరి.గరళకంఠుని ఘనత చాటక విషము వారిని తీవ్ర అనారోగ్యవంతులను చేసినది.దశార్నమహారాజు వారిని అరణ్యములో వదిలివేయమని ఆజ్ఞాపించెను.

  " నమో నిచేరవే పరిచరాయారణ్యానాం పతయే నమః."

    అరణ్యములలో దాగి వేచియుండి వారి పాపములను దోచుకొనవలెననుకొన్నాడు ఆ దొంగలకు దొంగ.నమస్కారములు.

  " నమో మంత్రిణే వాణిజాయ కక్షాణాం పతయే నమః." ధనిక వైశ్యునిగా వారి వారిని తన దగ్గరకు తెచ్చుకున్నాడు.ఘోరము-అఘోరము రెండును తానైన స్వామి వారి పూర్వపాప క్షయమునకు కొడుకును కాలముచే కబళించచేసినాడు.కన్నతల్లి కన్నీరు మున్నీరుగా మారినది.దీనముతో దిక్కుతోచక నున్న సుమతిని సమీపించాడు ఋషభముని." ఆరాత్తే గోఘ్నా స్వామి నీ ఘోరరూపమును మాకు దూరముగానుంచుదవుగాక అని పరిపరివిధముల యోగిని ప్రార్థించినది పరమసాధ్విసుమతి.మృత్యుంజయుడైన స్వామి ఋషభయోగి బాలుని మృత్యుంజయుడిని చేసెను.

  " నమోబృహతేచ-వర్షీయతేచ".
 అకారముచే గొప్పవాడును గుణ్ములచే సుసంపన్నుడును అయిన రుద్రుడు బాలునికి "శ్రీ శివకవచ స్తోత్రమును" ఉపదేశించి,ఆయుధములనొసగి ఆశీర్వదించి,లోక రక్షణకు సాగిపోయెను.

"అస్య శ్రీ శివకవచ స్తోత్రమహామంత్రస్య ఋషభయోగీశ్వర ఋషిః |
అనుష్టుప్ ఛందః |
శ్రీసాంబసదాశివో దేవతా |
ఓం బీజమ్ |
నమః శక్తిః |
శివాయేతి కీలకమ్ |
మమ సాంబసదాశివప్రీత్యర్థే జపే వినియోగః ||"

 అంబేశివమయముగా,భస్మీలంకృతుడైన భద్రాయువు  మగధరాజునకు బందీయైన తన తండ్రిని బంధవిముక్తుని చేసి,తాను భవబంధ విముక్తుడై భవుని ఆరాధనలో తరించెను.

   యోగిరూపుడైన త్రిలోచనుడు భద్రాయువును రక్షించినట్లు మనలనందరిని రక్షించునుగాక.

 స్వామి బిల్వార్చనకు రేపు కలుసుకుందాము.

   ( ఏక బిల్వం శివార్పణం)

   ( ఏక బిల్వం శివార్పణం.)










  




TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...