Thursday, February 8, 2018

SIVA SANKALPAMU-73

నీకు పూజచేస్తే పున్నెమని విన్నానురా,భక్తితో
అర్ఘ్య పాద్య జలములడుగ  కస్సుమన్నదిర గంగ
స్నానమెట్లుచేయిస్తు సముదాయించర గంగను

ఆసనమీయ చూదగ తుర్రుమన్నదిర పులి
కట్టుకోను  బట్తలన్నకనుమరుగైనద్ కరి

జందెమైన ఇద్దమన్న  చరచర పాకింది పాము
నైవేద్యముచేయ బోవ విషజంతువులన్ని మాయం

అక్కజమేమున్నదిలే నీ  అక్కర తీరినదేమో
ఒక్కటైనకలిసిరాదు నీకు చక్కనైన పూజసేయ

మాయ తొలిగిపోయె నేడు మానసపూజ ఉందిగ
దిక్కులే ధరియించిన ఓ చక్కని శంకరా!


SIVA SANKALPAMU-72


  గుర్తించిన శ్రీ కరి పాములకు గుడినే  కట్టించావు
  గుడిగోపురమునుచూసిన పాపనాశనమే  అన్నావు

  గుడ్డితనమును పోగొట్టి చూపునిస్తుంటావు
  గుర్తించువారికి   భక్తి గుళికలూందిస్తావు

  గురువుగా మారి వారిని  తరియింపచేస్తావు
  గుడిలో కూర్చుని గురుతర  పూజలందుకుంటావు

  గుహునితండ్రిగా నీవు అహమును తొలిగిస్తావు
  గుగ్గిల నాయనారు భక్తిని గుబాళింప చేసావు


  గుణనిధిని కరుణించి గుండెలో దాచుకున్నావు
  గుచ్చిన  బాణముచూపి  పాశుపతమునుఈచ్చావు

  గుక్క తిప్పుకోకుంద ఎక్కిఎక్కి ఏడ్చు నన్ను,నీ
  అక్కున  చేర్చుకోవేమిరా ఓ తిక్క శంకరా!

SIVA SANKALPAMU-66 .

 కన్నులు నిప్పులు రాల్చ కరుణాకటాక్షము ఎట్లు అగునురా
  కరము పుర్రెను దాల్చ వరద హస్తము ఎట్లు అగునురా

  గళమున గరళమున్న మంగళము ఎట్లు అగునురా
  పాములు నగలుగ నున్న సామి ఎట్లు అగునురా


  గంగ నెత్తిన ఉన్న తీరిన బెంగ ఎట్లు అగునురా
  విషమ రూపము ఉన్న అనిమిషుడు ఎట్లు అగునురా

  అసుర భయముతో ఉన్నవాడు శూరుడు ఎట్లు అగునురా
  తాండవములో నున్న దుష్ట తాడనము ఎట్లు అగునురా

  కనులు తెరిచిన కదనము కనులు మూసిన ప్రణవము ఐతే
  కనుల పండుగ ఏదిమాకు కనులు కాయలు కాచినా అని

  తనకు తోచిన తీరే కాని మమ్ము తరియింపగ చూడడేమిరా అన
  దిక్కు తోచక ఉన్నానురా ఓ తిక్క శంకరా.

SIVA SANKALPAMU-65

కంటినీటి పూసలు నీకు కలిమిని అందీయగలవా
 సిగపూవగు గంగమ్మ నీకు సిరులను అందీయగలదా

 కట్టుకున్న గజచర్మము నీకు పట్టుపుట్టములు అందీయగలదా
 నమ్ముకున్న ఎద్దు నీకు సొమ్ములను అందీయగలదా

 అలదుకున్న విబూతి నీకు వైభవమును అందీయగలదా
 కరముననున్న శూలము నీకు వరములను అందీయగలదా

 పట్టుకున్న పాములు నీకు పసిడిని అందీయగలవా
 కరుగుచున్న నగము నీకు నగలను అందీయగలదా

 కదలలేని చంద్రుడు నీకు ఇంద్రపదవి ఈయగలడా
 కాల్చుచున్న కన్ను నీకు రత్నరాశులను అందీయ గలదా

 "ఓం దారిద్ర్య దు:ఖ దహనాయ" అనగానే నువు ఔనంటే విని
 ఒక్కరైన నమ్మరురా ఓ తిక్క శంకరా
.................
 శివుడు ధరించిన విబూది,రుద్రాక్షలు,ఎద్దు,శూలము,కరిచర్మం,పా(ప)ములు,గంగ(పాలు)మూడో కన్ను(నాశనం) దరిద్ర్యమును తొలగించునని పొగడుట,శివుడు దానిని అంగీకరించుట హాస్యాస్పదము-నింద.




 సంపద,భద్రత,ధర్మము,పవిత్రత,విఘ్న నివారణము,త్రికాల జ్ఞానము కలిగిన శివుడు అనేక విధములైన దారిద్ర్యములను తొలగించగల మహా దేవుడు-స్తుతి.

SIVA SANKALPAMU-64

     
 మౌనము మాటాడునట మాయేదో చేసావులే
 మేథా దక్షిణా మూర్తిగా బోధించేది మాయేలే

 మూగయు మాటాడునట మాయేదో చేసావులే
 మూక పంచశతిగా కీర్తించేది మాయేలే

 కాళ్ళకింద పద్మాలట మాయేదో చేసావులే
 పద్మపాదుడు అతడట గురుభక్తి మాయేలే

 పూవులే పళ్లట మాయేదో చేసావులే
 పుష్పదంతుడు అతడట పుణ్యాల మాయేలే

 బోడిగుండు శివుడట మాయేదో చేసావులే
 శంకర భగవత్పాదుడట శంక లేనే లేదులే

 మాయా సతిని చూసి అమ్మయ్య అని నీవు మోస్తుంటే,నే
 బిక్కచచ్చి పోయానురా ఓ తిక్క శంకరా.


...................................................................................................................................................................................................... శివుని మౌన వ్యాఖ్య,మూక పంచశతి,పద్మపాదుడైన సునందుని స్తుతి పుస్పదంతుని భక్తి,సాక్షాత్ శివ స్వరూపమైన ఆది శంకరుని స్తోత్రములు శివుని పూజనీయుడిని చేస్తున్నాయని స్తుతి.శివుడు మాయామోహ పూరితుడై దక్షయజ్ఞ కుండమునుండి తిరిగి వచ్చిన మాయా సతిని ,తన భార్య అనుకుని మోసుకెళ్లాడని నింద 

.అలా శివుడు మాయ నటించినది అష్టాదశపీఠ ఆవిర్భావమునకు అని స్తుతి.

SIVA SANKALPAMU-62


 అసత్యమాడు బ్రహ్మ పుర్రె అంతగా  నచ్చిందా
 ఆభరణముగా చేసి అలంకరించుకున్నావు

 హింసకు గురిచూసే  ఆ బోయకన్నునచ్చిందా
 రక్తాశ్రువులను  రాల్చ అనురక్తినిచూపావు

 అమ్మ దగ్గర ఉండనన్న అర్భకునివాక్కు నచ్చిందా
 అమృతధారగ మారి ఆర్ద్రతనందించావు

 స్వార్థమే నింపుకున్న కరి ఉదరము నచ్చిందా
 ఉదారతను చూపిస్తు ఒదిగిఒదిగి పోయావు

 పృష్ట భాగమున పూజలందు ఆవుచెవి నచ్చిందా
 లంకకు నేరానంటు గోకర్ణమున నిలిచావు

 పెంపును అందించుతావో  పంపు అని చంపుతావో
 పెక్కుమాటలేలరా  ఓ తిక్క శంకరా 

SIVA SANKALPAMU-61


    ఓం నమ: శివాయ-37

  నీ పాదము పట్టుకుందమన్న  చిందులేస్తు  అందకుంది
  నీ నడుమును  వేడుకుందామన్న పులితోలు  అలిగింది

  నీ హృదయము దరిచేరదమన్న  కుదరదు అని అంటోంది
  నీ చెవికి చెబుదామన్న  చెడ్డ  పుర్రె అడ్డుకుంది

  నీ చుబుకము  పట్టుకుందామన్న  విషము సెగలు కక్కుతుంది
  నీ కన్నుకు  కనిపిద్దామన్న  కొంచమైన  తెరువకుంది

  నీ  ముక్కుకు  చెబుదామంటే  మూసి జపము చేస్తున్నది
  నీ జటకు  ఉటంకిద్దామంటే  గంగవెర్రులెత్తుతోంది

  నన్ను రానీయక నీవు తమ సొంతమంటు  గంతులేస్తున్నవి
  సుంతయైన  కనికరమే చూపించలేమంటున్నవి

  నీ దరి  సేదతీరుతూ ఆదరమునే మరచిన వాటి
  టక్కరితనమును చూడరా  ఓ తిక్క శంకరా.   

SIVA SANKALPAMU-60

   శివ సంకల్పము-74

 నవ విధ భక్తుల కొలువగ నారాయణుడివి కావు
 నవ రత్నముల కొలువగ నారాయణివి కావు

 నవరాత్రులు కొలువగ నగజాతవు కావు
 నవనీతముతో కొలువగ నగధరుడివి కావు

 నవధాన్యముల కొలువ నవ గ్రహములు కావు
 నవ కలశమున కొలువగ దివ్య జలమువు కావు

 నవమినాడు కొలువగ నవమి పుట్టినవాడవు కావు
 నవనాడుల కొలువగ ఆత్మారాముడివి కావు

 నవమాసములు కొలువగ కన్నకొడుకివి కావు
 ఎవరివో ఏమో నీవు ఎన్నలేముగ మేము

 ముక్కంటివి అంటుంటే ముక్కోటి అంటూంటే నాలో
 పెక్కు ప్రశ్నలేనురా ఓ తిక్క శంకరా.

SIVA SANKALPAMU-59


    ఓం నమ: శివాయ-37

  నీ పాదము పట్టుకుందమన్న  చిందులేస్తు  అందకుంది
  నీ నడుమును  వేడుకుందామన్న పులితోలు  అలిగింది

  నీ హృదయము దరిచేరదమన్న  కుదరదు అని అంటోంది
  నీ చెవికి చెబుదామన్న  చెడ్డ  పుర్రె అడ్డుకుంది

  నీ చుబుకము  పట్టుకుందామన్న  విషము సెగలు కక్కుతుంది
  నీ కన్నుకు  కనిపిద్దామన్న  కొంచమైన  తెరువకుంది

  నీ  ముక్కుకు  చెబుదామంటే  మూసి జపము చేస్తున్నది
  నీ జటకు  ఉటంకిద్దామంటే  గంగవెర్రులెత్తుతోంది

  నన్ను రానీయక నీవు తమ సొంతమంటు  గంతులేస్తున్నవి
  సుంతయైన  కనికరమే చూపించలేమంటున్నవి

  నీ దరి  సేదతీరుతూ ఆదరమునే మరచిన వాటి
  టక్కరితనమును చూడరా  ఓ తిక్క శంకరా.   

SIVA SANKALPAMU- 58


      ఓం నమ: శివాయ-14

    ఉదారతను చాటగ  ఆ అసురుని  ఉదరములో నుంటివి
    గంగిరెద్దు మేళము నిన్ను కాపాడినది  ఆనాడు

    కరుణామయుడవన్న ఆ అసురుని హస్తమున అగ్గినిస్తివి
    మోహిని  ఆకారము నిన్ను  కాపాడినది ఆనాడు

    భోళాతనమును చాటగ రావణునికి ఆలినిస్తివి
    నారద వాక్యము నిన్ను కాపాడినది  ఆనాడు

    ఆత్మీయత అనుపేర ఆత్మలింగము నిస్తివి
    గణపతి చతురత నిన్ను కాపాడినది  ఆనాడు

    భ్రష్టులైన వారిని నీ భక్తులు అని అంటావు
    రుసరుసలాడగలేవు,కసురుకొనవు  అసురతను

    మ్రొక్కారని రక్కసులకు గ్రక్కున వరములనిస్తే
    పిక్క బలము చూపాలిరా ఓ తిక్క శంకరా.

SIVA SANKALPAMU-57


 కన్న తండ్రిని చూడగ నేను కాశిపోవ కానరాడు
 దేవత మోహమడచ మొదలు చివర కానరాడు

 చిదంబరము పోయి చూడచిన్నగానుకానరాడు
 అటుచూడను,ఇటు చూదని ఆటలెన్నో ఆడతాడు

 నింగిలోన  సాగుతాడు-నీటిలోన దాగుతాడు
 అగ్గినంటి ఉంటాడు-గాలి నేనే అంటాడు

 జ్యోతిని నేనంటాడు ప్రీతిని నీకంటాడు
 ఈ వలసలు ఎందుకంతే చిద్విలాసమంటాడు

 రూపివా-అరూపివా-అపురూపివా  శివా
 ఓంకార రూపుద ఇవి నీ ఆకారపు లీలలుగ

 జంగమదేవర నీవు లింగముగా మారి నీ
 చక్కదనము చూపవేర? ఓ తిక్క శంకరా! 

SIVA SANKALPAMU-56


 నిన్ను చూపించే ఈ కన్ను కన్ను మిన్ను కానకుంది
 మళ్ళీ చూపించమంటే  మళ్ళలేను అంటోంది

 నీ పేరును వినిపించే చెవి నన్ను చెవితి అని అంటోంది
 మళ్ళీ వినిపించమంటే  శంఖనాదమే  అంటోంది

 నీ పేరును పలికిన వాక్కు సన్నగా నొక్కుతోంది
 మళ్ళి పలికించమంటే కిక్కురుమనకంటుంది

 నీ దరి చేర్చిన కాలు నాపై కారాలు నూరుతోంది
 మళ్ళి నడిపించమంటె ఒంటికాలిపై లేస్తోంది

 నీకై వంచిన తల నన్ను అతలాకుతము చేస్తున్నది
 మళ్ళి వంచమంటే నన్ను అవతలకు పొమ్మంది

 శివుడికి నీవేమిచేసావని  చీకాకు పెడుతున్నవి
 కొక్కిరాయి పనులొద్దని చెప్పరా గట్టిగ ఓ తిక్క శంకరా!

SIVA SANKALPAMU-55


 గంగాధర అని పిలువగ  గంగ తొంగిచూస్తుంది
 ముక్కంటి అని పిలువగ  తిక్క కన్ను పలుకుతుంది

 శశిశేఖర అని పిలువగ జాబిలి ఊ అంటుంది
 కపర్ది అని పికువగానే  కచభారము కదులుతుంది

 నందివాహన అనగానే  ఎద్దు సద్దుచేయకంది
 జంగమ దేవర అంటే లింగము పలుకలేనంది

 నాగేశ్వర అనగానే  పాము ఆగమంటుంది
 అర్థనారీశ్వర అనగానే అమ్మమిన్నకున్నది

 పశుపతి అని పిలువగానే  పాశము ఏమిటంటోంది
 ఏక నామధారివి కావని ఎకసక్కెము చేస్తున్నవి

 "శివోహం" అను జపమునాపి  నిన్ను నేను పిలుచుటకు
  ఒక్క పేరు చెప్పవేర ఓ తిక్క శంకరా!

SIVA SANKALPAMU-54


 నీ మహన్యాసము నన్ను అపహాస్యము చేస్తున్నది
 నీ  అంగ కరన్యాసములు అర్థముగాకున్నవి

 నీ రుద్ర నమక-చమకములు నన్ను మొద్దు అంటున్నవి
 నీ సహస్రనామములు పలుకగ సహాయము గాకున్నవి

 నీ శత ఎనిమిది నమములు నన్ను సతమతము చేస్తున్నవి
 నీ దండకములు అసలు అండ కానేకానంటున్నవి

 నీ అష్టకములు  నావాక్కు స్పష్టము కాదంటున్నవి
 నీ  షడక్షరీ మంత్రము నన్ను నిర్లక్ష్యము చేస్తున్నది

 శివ ప్రబంధములు పెద్ద ప్రతిబంధకమగుచున్నవి
 నీ  పంచాక్షరి మంత్రము మించిపోలేదు అంటున్నది

 గుక్కతిప్పుకోలేని నాకు "శివ" యను చక్కని
 ఒక్క మాట చాలనవేరస ఓ తిక్క శంకరా!

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...