AMARANEETI NAYANARU
అమరనీతి నాయనారు ***************** [03:20, 11/11/2021] విమల: ఇష్టవస్తు ముఖ్యదాన హేతవే నమః శివాయ దుష్ట దైత్య వంశ ధూమకేతవే నమః శివాయ సృష్టి రక్షణాయ ధర్మ సేతవే నమః శివాయ అష్టమూర్తయే వృషేంద్ర కేతవే నమః శివాయ ఋషివందిత ఋషభవాహనునకు దండాలు శివా ధర్మపు వంతెన సృష్టిరక్షకునకు దండాలు శివా దుష్టుల శిక్షించు ధూమకేతనునకు దండాలు శివా ఇష్టవస్తు ప్రదాత అష్టమూర్తికి దండాలు శివా. అశాశ్వత ఉపాధిని నడిపించుచున్న శాశ్వత /అమర శక్తివి నీవే అని పరమాత్మ తత్త్వమును తెలిసిన సార్థక నామధేయుడు అమరనీతి నాయనారు. వృత్తి-ప్రవృత్తులు విరుధ్ధములైనప్పటికిని ,వాటిని తన సంస్కారముతో సమర్థవంతములుగా మలచుకొనిన వాడు.పళైయర్ లో వైశ్యకులములో జన్మించిన అమరనీతి ఇహమునకు సంబంధించిన భోగలాలసను పెంపొందించు పట్టు వస్త్రములను.సువర్ణ-నవరత్నములను కులవృత్తిగా విక్రయించుచున్నప్పటికిని,బురద తాకని తామరవలె,వైరాగ్య సంపన్నుడై అత్యంత భక్తి శ్రధ్ధలతో నటరాజ భక్తులైన శివయోగులకు ,వైరాగ్య సంకేతమైన కౌపీనములను దానము చేయు దీక్షాపరుడిగా శివార్చనలను చేయుచుండెడి వాడు. తన సంపాదనతో శివభక్తుల వసతికై ఎన్నో మఠములను ...