TIRUPALLIELUCHCHI-05
తిరుపళ్ళి ఎళుచ్చి-05 ***************** "కృపా సముద్రం సుముఖం త్రినేత్రం జటాధరం పార్వతీ వామభాగం సదాశివం రుద్రం అనంతరూపం చిదంబరేశం హృది భావయామి." సందర్భము ********* ఎందరో మహానుభావులు స్వామి అవ్యాజ అనుగ్రహముతో వారి మనోఫలకములలో స్వామి రూప-గుణ-విభవములను దర్శిస్తూ-పులకరిరిస్తున్నారు.విచిత్రము వారిలో దాగి స్వామి కూడా నర్తిస్తున్నాడు.అదే కుండలినిని జాగృత పరుస్తూ వారికి సహస్రా సహస్ర దివ్యకాంతులను పరిచయము చేస్తున్నాడు.ఆనంద భాష్పములు స్రవిస్తుండగా వారు మైమరచి స్వామి వైభవమును కీర్తిస్తున్నారు.వారిలో దాగిన స్వామి వారితో పాటుగా అనిశము నాదమై నినదిస్తున్నాడు.అజపామంత్రమునుచ్చరిస్తూ ఆదిదేవుడు వారికి ఆలంబనగా నిలిచి ఆశీర్వదిస్తున్నాడు.పంచభూతతత్త్వమును పరిచయము చేస్తున్నాడు.అదియే పూదంగళ్ అని మాణిక్య వాచగరు ప్రారంభించిన ఎళుచ్చి ప్రారంభ పదము.వారిని దర్శించిన మన శివనోము నోచుకుంటున్న కన్నియలు మనకు ఆ లీలా విశేషములను అందిస్తున్నారు. ఎళుచ్చి. ****** పూదంగ తోరున్ నిన్రాన్ ఎనిన్ ఆళ్ళాళ్ పొక్కిలన్ వరవిలన్ ఎ...