AALO REMBAAVAAY-24

పాశురమునకు పోట్రి, ********************** " మాయావుల మదమదచిన పాదములకు పల్లాండ్లు మా యానగ నీదరిచేరలేవు మాధవ కడగండ్లు" సుతుడనుచు దశరథుడు-హితుడనుచు సౌమిత్రి క్షితినాథుడనుచు భూపతులు కొలిచిరిగాని అని త్యాగరాజుచే కీర్తించబడిన రామావతార విశేషములను "అన్రు" అని-కృష్ణావతార విశేషములను "ఇన్రు" అంటూ భగవంతునితో-భాగవతులుగా వారికున్న సంబంధజ్ఞానమును సంకేతిస్తూ,శ్రీవైష్ణవ సంప్రదాయానుసారముగా స్వామికి మంగళాశాసనములను అందించుటయే మహద్భాగ్యమనుచున్న గోదమ్మకు అనేకానేక దాసోహములను సమర్పించుకుంటూ,అనుగ్రహించినంతమేరకు "పోత్తి" పాశురమును అనుసంధానము చేసుకునే ప్రయత్నమును చేద్దాము. ఇరువది నాలుగవ పాశురం ************************* అన్రు ఇవ్వులగం అళందాయ్ !అడిపోట్రి శెన్రంగు త్తెన్నిలింగై శెట్రాయ్! తిరల్ పోట్రి పొన్ర చ్చగడం ఉదైత్తాయ్! పుగళ్ పోట్రి కన్రు కుణిలా ఎరిందాయ్! కళల్ పోట్రి కున్రు కుడైయా ఎడుత్తాయ్! గుణం పోట్రి వెన్రు పగై కెడుక్కుం నిన్ కైయల్ వేల్ పోట్రి ఎన్రెన్రు ఉన్ శేవగమే ఏ తిప్పరై కొళివాన్ ఇన్రుయాం వ...