Posts

Showing posts from October 17, 2026

AMBAVANDANAM-08

Image
    అంబ వందనం-08   **************  ధ్యాయేత్ కాళీం మహామాయాం త్రినేత్రాం బహురూపిణీం  చతుర్భుజాం లలజ్జిహ్వం పూర్ణచంద్రనిభాననాం  నీలోత్పలదళ శ్యామాం శత్రుసంఘవిదారిణీం  నరముండం తథాఖడ్గం కమలంచ వరంతథా." అంటు సుమేథ మహర్షి సురథ-సమాథులకు ఈ విధముగా చెప్పసాగెను. " ఏభిఃహతైజగదుపైతి సుఖం తథైతే   కుర్వంతునామ నరకాయ చిరాయ పాపం   సంగ్రామ మృత్యుమధిగమ్య దివం ప్రయాంతు   మత్వేతి సూనమహితాన్ వినిహంసి దేవి" అసురులందరు పాపములను చేయుచు ఫలితముగా నరకమునకు పోవలసిన వారలే అయినను తల్లి వారిని తన కరుణతో పుణ్యలోకప్రాప్తిని కలిగించుటకా యన్నట్లు, ఆ రణభూమిలో బ్రహ్మాణి తన కమండలములోని జలమునుచల్లు చున్నది.రాక్షసబలమును/రాక్షస గణములను/గుణములను తగ్గించుచున్నది. మాహేశ్వరి త్రిశూలముతోను,వైష్ణవి చక్రముతోను,కౌమారి శక్తితోను,ఐంద్రి వజ్రాయుధముతోను,తమ విధులను నిర్వర్తించుచుండగా, "ప్రక్షిప్తము-నిక్షిప్తము తన కనుసన్నలైన" అంబిక రక్తబీజుని వెటకారమునకు సమాధానముగా సప్తమాతృకలను నిక్షిప్తము చేసుకొనినది. అనేకానేక రక్తబీజులను యుద్ధరంగమున గమనించిన దేవతలు ఖిన్నులైనారు.వారిని చూసి చండిక, " ఉవాచ  క...