Monday, March 12, 2018

SAUNDARYA LAHARI-41

 పరమపావనమైన నీపాదరజకణము
 పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము

 అతిచమత్కారముగా నీ కరుణ ఆవిష్కారముతో
 నా అహంకారము చిటికెలో "ఓంకారము" అయినది

 సాటిలేనిదైన నీకరుణ సహకారముతో
 నా వెటకారము చిటికెలో " ఐంకారముగా" మారినది

 మమ్ములను మన్నించు నీదైన మమకారముతో
 నా హుంకారము చిటికెలో "హ్రీంకారముగా" మారినది

 నీపై భక్తి శ్రీకారమే చిత్రముగా "శ్రీంకారముగా" మారినది

 సంస్కారపు సాధన నీ బీజాక్షరములగుచున్న వేళ

 నీ మ్రోలనే నున్న నాకేలు విడనాడకమ్మా
 నా మానస విహారి! ఓ సౌందర్య లహరి.


 "హ్రీంకారి హ్రీమతి హృద్యా హేయోపాదేయ  వర్జితా' అని బ్రహ్మాందపురణములోని  లలితా సహస్ర నామ స్తోత్రము అమ్మను కీర్తించుచున్నది.లలిత అను పదమునకు క్రీడించునది అను అర్థమును అలంకారికులు తెలియచేసిరి.అమ్మ ఒకే అక్షర్ముగా శబ్దిస్తూ అనేక అర్థములను వివరించే బీజాక్షరములలో క్రీడిస్తు( ఆడుకుంటు ) మనలనందరిని రక్షిస్తుంటుంది.శ్రీ మాత్రే  నమః.బీజము అనగా మూలము లేదా  విత్తనము బాహ్యార్థము.కానిలోతుగ ఆలోచిస్తే సకలచరాచర జగతికి మూలమైన అమ్మ తత్త్వమును,అనుగ్రహమును వివరించేవి బీజాక్షరములు (ముఖ్యముగా) నాలుగు గురించి తెలుసుకొనుటకు అమ్మ అనుగ్రహముతో ప్రయత్నిద్దాం. అవి,

1."ఓం" బీజాక్షరము.. దీనినే " ప్రణవము" అని కూడా అంటారు.హృదయ పద్మమును వికసింపచేసి సాధకునకు సహాయకారి అవుతుంది.

2."ఐం" బీజాక్షరము శివమునకు శక్తి కలిసిన తత్త్వము.సరస్వతీ రూపము.సాధనను మరికొంత పై స్థాయికి తీసుకు వెళుతుంది. 
3" .హ్రీం" బీజాక్షరము శక్తి సృష్టి-స్థితి-లయ తత్త్వమును తెలియచేయునది.
4. " శ్రీం" భౌతిక-ఆధ్యాత్మిక లక్ష్మీతత్త్వ సుసంపన్నమైనది.సాధకునకు సర్వలక్షణ శోభితమైన "సర్వేశ్వరి" అనుగ్రహమును ప్రసాదించునది.

 "పరా-పశ్యంతి-మధ్యమా-వైఖరి " అను నాలుగు విధముల శక్తులు భక్తులమనసులో,హృదయములో,కంఠములో,పెదవులపై పరిపరి విధముల నిన్ను ప్రస్తుతించు సమయమున చెంతనే నున్న నాచేతిని విడిచిపెట్టకమ్మా.అనేక నమస్కారములు.  

SAUNDARYA LAHARI-40

  సౌందర్య లహరి-39

  పరమపావనమైన నీపాదరజ కణము
  పతిత పాలకమైన పరమాత్మ స్వరూపం

  గురుభక్తిని చాటలేని గుణహీనపు చంద్రుడు
  గణపతిని గేలిచేసి శాపమొందిన చంద్రుడు

  చవితిని అపనిందల పేర్మోసిన చంద్రుడు
  చంచలమగు మనసుతో పోల్చబడు చంద్రుడు

  పున్నమియైన గ్రహణమున కానరాని చంద్రుడు
  వంకరలు అన్నితొలగి స్థిరమగు అష్టమి కళతో

  అమ్మ సిగను అతిశయముగ ఆరాధ్యతను పొందుతు
  పరిపరి విధములుగా పూజలను   అందుకొనుచున్న వేళ

  నీ మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా
  మానస విహారి  ఓ సౌందర్య లహరి.

" అష్టమీ చంద్రవిభ్రాజ దళికస్థల శోభితా" అమ్మ వారి నుదురు అష్టమిచంద్ర కళతో ఎప్పుడు కరుణ అను కౌముదిని (వెన్నెలను) వెదజల్లుతుంటుంది.అయ్యవారు ధరించిన చంద్రుని అర్థనారీశ్వరి ఆనందముగా అనుగ్రహించింది.అసలు చంద్రునికివచ్చిన కష్టము మామయైన దక్షప్రజాపతి ఇచ్చిన శాపమని పెద్దలు చెబుతారు.అనసూయదేవి సుతుడైన చంద్రుడు దక్షుని27 కుమార్తెలను (నక్షత్రములను) వివాహము చేసికొని,వారిపై సమాన ప్రేమతో వ్యవహరిస్తానని మాట ఇచ్చెను.కాని పెద్ద భార్యయైన రోహిణి పై అమితప్రేమను కనబరచుచు,తక్కిన వారిని నిర్లక్ష్యము చేయసాగెను.హెచ్చరికలను లెక్క చేయలేదు.మానవుల మనసును శాసించగల చంద్రుడు తన మనసునుస్వాధీనము చేసుకోలేక పోయాడు.ఫలితముగా  శక్తిని-కాంతిని క్రమముగా కోల్పోవు శాపమును పొందినాడు.చంద్రుని అమృత ధారలు లేకపోతే జగమంత అస్తవ్యస్తమవుతుంది.ఔషధములు లభించవు.సముద్రములపరిస్థితి తారుమారవుతుంది.కనుక జగత్కళ్యానమునకై పరమేశుడు శాపమును కొంత సడలించి కళలలో  మార్పు-చేర్పులను అనుగ్రహించి,శిరోభూషణముగా అలంకరించుకొని అనుగ్రహించెను.

 " శరత్జ్యోత్స్నాం శుద్ధాం శశియుత జటాజూట మకుటాం' అను స్తుతులు నినుచేరు సమయమున చెంతనేనున్న నా చేతిని విడిచిపెట్టకమ్మా.అనేక నమస్కారములు.

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...