Wednesday, October 5, 2022

NA RUDRO RUDRAMARCHAYAET-INTRODUCTION. (SIVAANAMDALAHARI)


పరమపావనమైన పార్వతీపరమేశ్వర తత్త్వమును ప్రసాదించిన,శ్రీశైలక్షేత్రమునజగద్గురువులైన శ్రీ శంకరభగవత్పాదుల చే ప్రస్తావించబడిన "శివానంద-లహరి స్తోత్రమును"  పరిచయము చేసుకునే ప్రయత్నము ఇది.అనందము అదియును అనవరతము.దేనిగురించి తెలుసుకునే ప్రయత్నము లో సంభవించుచున్నది,దేని అనుగ్రహముగా కటాక్షించుచున్నది అన్న సందేహమునకు
"పరస్పర తపః ఫలాభ్యాం" అంటున్నారు ఆదిశంకరులు.
 తపము వలన లభించిన ఫలము ఎంతవరకు వ్యాపిస్తున్నది అనుకుంటే "అస్తోకాం" అంటున్నారు.
 నిశ్శేషముగా/సంపూర్ణముగా సమస్తమును అనుగ్రహిస్తుంది అంటున్నారు.
  సంపూర్ణముగా మాత్రమే కాదు
 పునః భవాబ్యాం-అంటున్నారు
 ఒక్కసారి మాత్రమే కాదు పునః పునః తిరిగి/తిరిగి నిరంతరము అనుగ్రహిస్తూనే ఉంటుందట.
 ఆ కరుణనే మనము ప్రేమతో శివాభ్యాం అంటున్నాము.
 అంటే శివ-పార్వతి రూపములో నున్న ప్రకృతి-పురుషులు.
  వారి స్మరనము వలన మనకు
"ఆనంద స్పురణము అనుభవాభ్యాం" ఆనందము అనుభవములోనికి వస్తుంది.మనము దానిని ఆస్వాదిస్తూనే ఉంటామట.
 ఇంకెందుకు ఆలస్యము?
 కొంతైన ఆవిష్కరించుకోవటానికి వారి అనుగ్రహముతో.
   సర్వం శివాభ్యాం 

.పాదార్పణమస్తు

 విచిత్రము ఎచరైనా ఏదైనా నేర్చుకోవాలనా/దానిని అమలుపరచాలన్నా ముందర వారికున్న అర్హతలు పరిశీలించబడతాయి.కాని అద్భుతము.శివానమౌను అనుభవించాలంటే నీకున్న అర్హతలేవి? అని మీరు నన్ను అడుగవచ్చును.
 కాని నాకున్నవన్నియును అవలక్షణములే.వానిని సంస్కరించవలసినది ఆ శుభలక్షణుడే కనుక నీవు ముందు బ్రహ్మకు సృష్టి కార్యనిర్వహణకై నీ శక్తిని రెండుగా విభజించి అమ్మను మాకొదిలి నీవు అంతర్ధానమయ్యవని విన్నాను.అట్టి నీ అనుగ్రహము ముందు నా అభ్యర్థనము ఎంత?
  

 శివము-ఆనందము-లహరులు అను మూడు విశేషములతో నిండిన పరమేశ్వరానుగ్రహ స్తోత్రము "శివానందలహరి" అను జగద్గురువులు మనకు అందించిన స్తోత్రరాజము.మన భాషలో చెప్పలంటే ఒక దీనుడు తన దురవస్థను తెలిసికొనినవాడై,దానిని సమూలముగా నిర్మూలించగలిగిన పరతత్త్వమును పదేపదే స్తోత్రము చేయుట.
  ఒక విధముగా చెప్పాలంటే తన పరిష్తితిని ప్రత్యక్షముగా వినతిచేసుకొనుట.ప్రక్షాలనము కావించుకొనుట.తన కున్న అవలక్షణములే భక్తరక్షణాదాక్షిణ్యములకు అర్హతలనుట.
 అనుగ్రహావిష్కఋఅనము ఆది నుండి అంతము వరకు అంచలంచలుగా ఆవిష్కరింపబడుతూనే ఉంటుంది.ఆ ఆదిదంపతుల ఒడిచేరుటకు మెట్లను పరుస్తూనే ఉంటుంది.ఒక్కొక్క మెట్టు ముక్కంటి కరుణను ఆలంబనము చేసుకోమని అన్యాపదేశము చేస్తూనే ఉంటుంది.
  ముడులను విప్పేస్తుంది.నీ ఉపాధి ఏదైనా సరే నీలకంఠుని కరుణను నిరోధించలేదు.
 ఉపాధి ఏ దశలోనున్న సరే నిన్నాపలేదు అంటూ ఎన్నో ఉదాహరణములను చూపిస్తూ ఉత్సాహ పరుస్తుంది.
 నీవు ఉన్న ప్రదేశము సైతము నిన్ను అడ్డుకోలేదని నిన్ను ఒడ్డు చేరుస్తుంది.
  వారు లేరా/వీరులేరా కనుక నీకెందులకు విచారము అంటూ,నిన్ను నీవు మార్చుకునేందుకు వెన్నుతట్టుతుంది.
 నిన్ను నడిపిస్తుంది.దాని వెంట నడవడటమే మనము చేయవలసిన పని.
ఫలితము దానంతట అదే వస్తుందనుట నిస్సందేహము.
 సర్వం శివాభ్యాం పాదారవిందార్పణమస్తు.


 

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...