SAUNDARYA LAHARI-51
సౌందర్య లహరి-50 పరమపావనమైన నీ పాదరజకణము పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము అధిష్ఠాన దేవునిగా ఆ రుద్రుడుండగా వ్యాధినిరోధకత్వమైన అతి సున్నితచక్రముగా పంచభూతములలోని వాయు తత్త్వముగా పంచాక్షరి నామములోని "న" కారముగ నీవు మారి క-ఖ-గ-ఘ-ఙ-చ-ఛ-జ-ఝ-ఞ-ట-ఠ అను అక్షరములు పన్నెండింటిని పన్నెండు దళములుగల పద్మములో ప్రకటించుచు హృదయములో నెలకొనిన బీజశక్తి రూపముగా అనాహత చక్రములో నిన్ను చూచుచున్న వేళ,నీ మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా మానస విహారి ! ఓ సౌందర్య లహరి. " చింతామణి గృహాంతస్థా" గా అమ్మవారు కీర్తింపబడేది ఈ అనాహతచక్రమే.అనాహత చక్రమునే అనంత చక్రము-నిరంతర చక్రము అని కూడ అంటారు.లేతనీలిరంగు పన్నెండు దళములతో ప్రకాశించు అనాహతము అజపామంత్ర స్థానము.సో-హం అను నిరంతర చింతనతో,శాంతి-సహనము.క్షమ-దయ-ప్రేమ-సంతోషముతో అలరారుతు భక్తుని యొక్క పరిపక్వతకు తగినంత స్థానమును కలిపిస్తుంది.యోగిహృద్యాన గమ్యం అయిన పరమాత్మ దర్శన పరిశోధన పటిష్ఠమై,అవ్యక్తాన...