SIVA SANKALPAMU-101
తామరలున్న కొలనులో తిరుగాడు కప్పను నేననుకో తామసమడచి ఆ కప్పను తుమ్మెదగా మార్చరాదో మధురసమున్న పాత్రలో తిరుగాడు తెడ్డుననుకో మేధను అనుగ్రహించి తెడ్డును జిహ్వగ మార్చరాదో కొమ్మకు చుట్టుకుని తిరిగాడు గాలిపటము నేననుకో ఇమ్ముగ జాలిచూపి దానిని చుక్కల పక్కకు చేర్చరాదో వాన నీరు వృధాచేయు సంద్రమునునేననుకో పన్నీరై క్షుథతీర్చు పంటబీడు చేయరాదో శివుడెంత అని అన్న గర్వపు గంగను నేననుకో శివపాదమే తనకు సర్వమన్న గంగగా చేయరాదో ఇన్ని మార్పు చేర్పులకు కూర్పువైన నిన్ను ఎన్న తరము కదురా నా కన్నతండ్రి శంకరా.