SIVA SANKALPAMU-99
చిక్కులున్న జటలతో చెలిమి చేస్తున్నందులకేమో
మాకు చిక్కులెన్ని వచ్చినా చక్కదిద్దుతుంటావు
వల్లకాడులో ఎపుడు తిరుగాడుతున్నందులకేమో
వల్లకాదు అనలేక కాపాడుతు ఉంటావు
తెల్లనైనకొండమీద తేలియాడుట వలనేనో
తెల్లవార్లు అందరికి రక్షణగా ఉంటావు
కరుగుచున్న కొందమీద కాపురముంటున్నందులకేమో
కరుగుచున్న మనసుతో మొరలు ఆలకిస్తావు
చల్లనైన కొందమీద చక్కగ ఉంటున్నదందులకేమో
చల్లగా అందరిని దీవిస్తూ ఉంటావు
చక్కనైన శాంభవితో చెరిసగమైనందులకేమో
చెక్కుచెదరని కరుణారా ఓ తిక్క సంకరా!
Comments
Post a Comment