16

. తిరువెంబావాయ్-16 ************** మున్ని కడలై చురుక్కి ఎళుందియాల్ ఎన్నతిగళ్ దెమ్మై ఆరుదైయాళ్ ఇత్తడియన్ మిన్ని పొళిందెం పిరాట్టి తిరువడిమేర్ పొన్న చిలంబిర్ చిలంబిత్ తిరుప్పురవం ఎన్నచ్ శిలైకులవి నాందమ్మై ఆళుడియాళ్ తన్నీర్ పిరవిళా ఎణ్కోమణ్ అంబర్కు మున్ని అవళ్ నమక్కు మున్ శురుక్కుం ఇన్నరుళే ఎన్న పొళియాయ్ మళయేలో రెంబావాయ్. శ్యామలా తాయియే పోట్రి **************** తిరుమాణిక్యవాచగరు మనౌ ఈ పాశురములో ఒక సామాన్యమును విశేషముతో-విశేషమును సామాన్యముతో అన్వయిస్తు అద్భుతావిష్కరణమును చేస్తున్నారు. అమ్మతో పోల్చబడిన నల్లని మేఘమా తరియించినదమ్మా నీ ఉపాధి. సముద్రమా-సాటిలేనిదమ్మా నీ సహాయగుణము. సంక్షిప్తపరచబడి తల్లితో పోల్చబడి తరించినావు. కుదించిన సముద్రమే కదా ఆ నీలిమేఘము. అది విస్తరించినచో సముద్రమేకదా! మనకు దర్శనీయములైన సముద్రము-మేఘము-మెరుపు-ఉరుము-హరివిల్లు-మడుగు తల్లి స్వరూప-స్వభావములకు ఉపమానములై సన్మానమునందుచున్నవి. ఏ విధముగా మన కామాక్షి తాయి మనకు రక్షణగా నుండి కాపాడుచ...