ఆదిత్యహృదయం-శ్లోకము-26
*******************
ప్రార్థన
*****
" జయతు జయతు సూర్యం సప్తలోకైక దీపం
తిమిర హరణ పాప ద్వేష దుఃఖస్య నాశం
అరుణకిరణ గమ్యం ఆదిం ఆదిత్యమూర్తిం
సకలభువనవంద్యం భాస్కరం తం నమామి."
పూర్వ రంగము
********** యుద్ధ భూమిలో,చింతాక్రాంతుడై యున్న రామచండ్రునికి కర్తవ్యమును ఉపదేశించి,ఆత్మశక్తిని ప్రేరేపించి ,విజయమును ఆశీర్వదించి,తిరిగి యథాస్థానమునకు వెళ్ళిపోయినాడు.
తత్ఫలితముగా రాముని రాముడు నష్టశోకుడై యుద్ధమునకు సన్నధ్ధుడైనాడు.
సీతమ్మ ఇంకా రావణాసురుని చెరలోనేఉన్నాది.రావనాసురుడు ఇంకా జీవించియే యున్నాడు.
యుద్ధము ఇంకా జరుగవలసియున్నది.అగస్త్య భగవానుడు వెళ్ళిపోయినాడు.
అయినప్పటికిని రాముని శోకము నశించిపోయినది.
సమరేచింతయాశ్రితుడైన రాముడు ప్రియమైన మనసును కలిగి,తేజస్సుతో వెలిగిపోతున్నాడట.
తేజసామపి తేజస్వి గా పూర్వ శ్లోకము సూర్యభగవానుని కీర్తిస్తే,ప్రస్తుత శ్లోకము రాంచంద్రుని "మహా తేజః"అని విశ్లేషిస్తున్నది.
శ్లోకము
*****
ఏతత్ శృత్వా మహాతేజాః నష్టశోకో భవత్తదా
ధారయామాస సుప్రీతో రాఘవః ప్రియతాత్నవాన్"
పరమపావనమైన ఆదిత్యస్తోత్ర జపకారనముగా,
రాముడు,
1.మనసులోనిచీకటి తొలగి తేజోవంతుడైనాడు.ఆ తేజము సామాన్యమైనదికాదు.మహాతేజము.దానినిమించినతేజస్సులేదు.
2.నష్టశోకో-శోకము నశించిపోయినది.
తాత్కాలికముగా కాదు.శాశ్వతముగా.
రాముడుఇంద్రియ బంధవిముక్తుడైనాడు.
అందువలనే,
3,సుప్రీత-
ప్రియమైన మనసుకలవాడైనాడు.
బంధ మోహనం -ఉపాధి
బంధ నాశనము-దానిలో దాగిన పరమాత్మ.
కనుక రామునికి కలిగినప్రియము ధారయామాస అనవరత లక్షణము కలది.
రాముడు సుఖ-దుఃఖములు అను ద్వంద్వములను వీడినాడు.
యుద్ధమునకు కారనము-యుద్ధమును చేయుచున్నదు-యుద్ధ ఫలితమును అనుభవించునది నానా రూపములలో నున్న ఒకేఒక ఈశ్వర చైతన్యమని గ్రహించిన తత్క్షణమే,యుద్ధమునకు ఉపక్రమిస్తున్నాడు.
రాముడు కథనము. చేతనులు మథనము.ఉపాధికి/ఇంద్రియములకు కట్టుబడి యున్నంతకాలము చింతాశోకములు వీడవు.
అందుకేనేమో త్యాగరాజు,
ఓ మరకత అంగ-ఓ నీలమేఘశ్యామ
ఓ మాన రక్షక-ఓ ధర్మ రక్షక,
నా మనసులోని మర్మమును తెలుసుకో అని ఆలపించాడు.
మునుపు ప్రేమగలదొరవై సదా నేలుట గొప్పకాదయ్యా అని దెప్పిపొడుస్తున్నట్లుగా అంటూనే,
ఓ ఇంకులాప్త నీవే కాని వేరేవరు లేరు,
కనికరంబు తో నా కరముపట్టి,
మనసులోని మర్మమును తెలుసుకో మంటున్న సమయమున,
తం సూర్యం ప్రణమామ్యహం.