0004

ధ్యాయేత్ ఈప్సిత సిధ్ధయేత్-04 ****************************** ఆలోచనలలో మునిగియున్న నన్ను మరొక సందేహము ముందర నిలిచి,సతమతము చేస్తున్నది నా దినచర్యను ఒక సిధ్ధాంతముగా మారుస్తు. వాటి సంగతి సరే.మరి నా సంగతి ఏమిటి? నిన్న రాళ్ళ ఉప్పు పట్టుకుని వస్తున్నప్పుడు నా ఇంద్రియములైన కళ్ళు-స్పర్శ దానిని ఉప్పుగా గుర్తించి నాకు చెప్పినవి. మిగిలిన మూడు ఇంద్రియములు తటస్థముగా నునాయి. అదే ఉప్పును నేను నీళ్ళగిన్నెలో వేసి పది నిమ్షములు చిన్నపని చేసుకుని వచ్చాను. ఈ మధ్య మతిమరుపు మరీ ఎక్కువైపోతున్నది నాకు.ఇంతకీ ఉప్పును నీళ్ళగిన్నెలోవేసానా/లేదా? ఎలా తెలుస్తుంది నాకు? నాకు సహాయపడిన కళ్ళు-స్పర్శ నే తిరిగి సహాయమడుగుతాను అంటు...... కాని విచిత్రము.అవి నిస్సహాయములుగా మారినవి. నా కళ్ళు ఉప్పును చూడలేమంటున్నవి.నా స్పర్శ కూడా ఆ నీళ్ళలో ఉప్పు ఉన్నదో/లేదో తాను చెప్పలేనంటున్నది. మరొక విచిత్రము.ఇవి చేయలేని పనిని మరొక ఇంద్రియము తాను చేసిపెడతానన్నది.అదే అదే.. గమ్మత్తుగ.. నా జిహ్వ నేను చెప్పగలను అం...