Posts

Showing posts from February 10, 2026

ADITYAHRDAYAMU-23

Image
 ప్రార్థన ******* "జయతు జయతు సూర్యం సప్తలోకైక దీపం కిరణ సమిత పాప ద్వేష దుఃఖస్యనాశం అరుణకిరణ గమ్యం ఆదిం ఆదిత్య మూర్తిం సకలభువనవంద్యం భాస్కరం తం నమామి." పూర్వరంగము *********** పరమాత్మ నాశయత్వేవ వైభూతం తదేవ సృజతి అంటూ ప్రలయము తదుపరి సృష్టి,సృష్టి తదుపరి ప్రళయనిర్వహణమును ఏ విధముగా జరిపిస్తారో వివరించిన అగస్త్య భగవానుడు,ప్రస్తుత శ్లోకములో రెండు ముఖ్య అనుగ్రహములను 1.సుషుప్తావస్థ నందు పరమాత్మ చైతన్యమును గురించి,అగ్నిహోత్రునిగా -అగ్నిహోత్ర ఫలముగా స్వామి ఉనికిని సంస్తుతిస్తున్నారు. శ్లోకము ****** "ఏష సుప్తేషు జాగ్రత్తి భూతేషు పరినిష్ఠతః  ఏష ఏవాగ్నిహోత్రంచ ఫలంచ ఏవాగ్ని హోత్రిణాం."   అగస్త్యభగవానుడు సుషుప్తి-జాగ్రుతి అన్న రెండు అవస్థలను సూచిస్తున్నారు. ఎవరు సుషుప్తిదశలో నున్నది?ఏది సుషుప్తి దశలోనున్న స్థూలములో జాగృతముగా సూక్ష్మముగా నున్నది అన్నది ప్రస్తుతము. ఈ విషయమును అర్థము చేసుకోవాలంటే మనము, పరమాత్మ-ప్రపంచము అన్న రెండింటి మధ్యనున్న, స్థూల శరీరము- సూక్ష్మశరీరము-కారణ శరీరము-మహాకారణ శరీరముల గురించి తెలుసుకునే ప్రయత్నమునుచేద్దాము. 1.పంచభూతములకలయికచే ఏర్పడినది స్థూలశరీరము.ఇది దృ...