ఓం నమః శివాయ-03
***************
చక్కదనపు నలుగునిడి స్నానము చేయిద్దామనుకుంటే
పుక్కిలింత నీళ్ళతో సొక్కిపోయి ఉంటావు
పట్టుపుట్టాలు నీకు కట్టాలనుకుంటేను
గట్టిగా విడువనంటు చుట్టుకుంది పులితోలు
కనకభూషణములను కంఠమున వేయాలనుకుంటేను
కాలకూటవిషపు పాము కౌగలించుకుందాయె
ప్రేమతో పరమాన్నమును తినిపిద్దామనుకుంటేను
పచ్చిమాంసపుముక్క పచ్చి అనక ఉందాయె
పక్కింటి వాళ్ళతో ఆడుకోమంటేను
నాకు పక్కిల్లే లేదని వెక్కివెక్కి ఏడుస్తావు
ఎవరు నీకులేరనువారికి ఎరుకచేయి నిజమును
అక్కను నేనున్నానని ! ఓ తిక్క శంకరా!.
శివుడు (కన్నప్ప) నీళ్ళను పుక్కిలించి ఇదే అభిషేకముగా స్వీకరించమంటే సరేనన్నాడు.పచ్చిమాంసమును సమర్పిస్తే నైవేద్యముగా స్వీకరించాడు.బూదిపూతలతో పులితోలును వస్త్రముగా కట్టుకుని ఉంటాడు.ఇల్లు-వాకిలి లేనివానికి పక్క ఇల్లు ఎక్కడినుండి వస్తుంది? మొత్తము మీద శివుడు పధ్ధతి లేనివాడు- నింద.
కర్ణాటక లోని ఉడుతడి గ్రామములో సుమతి-నిర్మలశెట్టి దంపతులకు పార్వతీదేవి అంశతో జన్మించినది మహాదేవి.పరిశుధ్ధయోగిని.మహేశ్వర తత్త్వమును మథించిన మహాదేవి. తన కేశములతో దేహమును కప్పుకొని జీవించిన మహాసాధ్వి.బసవేశ్వరుడు-తక్కిన శివభక్తులు ఆమెను గౌరవముతో అక్క అని భావించి,పూజించెడివారు.స్వామి శ్రీశైల మల్లిఖార్జునునిగా కదళీవనములో నున్న జ్యోతిర్లింగములో ఆమెను ఐక్యము చేసి,తరింపచేసినాడు-కరుణాంతరంగు డు.- స్తుతి.
ఏకబిల్వం శివార్పణం.
***************
చక్కదనపు నలుగునిడి స్నానము చేయిద్దామనుకుంటే
పుక్కిలింత నీళ్ళతో సొక్కిపోయి ఉంటావు
పట్టుపుట్టాలు నీకు కట్టాలనుకుంటేను
గట్టిగా విడువనంటు చుట్టుకుంది పులితోలు
కనకభూషణములను కంఠమున వేయాలనుకుంటేను
కాలకూటవిషపు పాము కౌగలించుకుందాయె
ప్రేమతో పరమాన్నమును తినిపిద్దామనుకుంటేను
పచ్చిమాంసపుముక్క పచ్చి అనక ఉందాయె
పక్కింటి వాళ్ళతో ఆడుకోమంటేను
నాకు పక్కిల్లే లేదని వెక్కివెక్కి ఏడుస్తావు
ఎవరు నీకులేరనువారికి ఎరుకచేయి నిజమును
అక్కను నేనున్నానని ! ఓ తిక్క శంకరా!.
శివుడు (కన్నప్ప) నీళ్ళను పుక్కిలించి ఇదే అభిషేకముగా స్వీకరించమంటే సరేనన్నాడు.పచ్చిమాంసమును సమర్పిస్తే నైవేద్యముగా స్వీకరించాడు.బూదిపూతలతో పులితోలును వస్త్రముగా కట్టుకుని ఉంటాడు.ఇల్లు-వాకిలి లేనివానికి పక్క ఇల్లు ఎక్కడినుండి వస్తుంది? మొత్తము మీద శివుడు పధ్ధతి లేనివాడు- నింద.
కర్ణాటక లోని ఉడుతడి గ్రామములో సుమతి-నిర్మలశెట్టి దంపతులకు పార్వతీదేవి అంశతో జన్మించినది మహాదేవి.పరిశుధ్ధయోగిని.మహేశ్వర తత్త్వమును మథించిన మహాదేవి. తన కేశములతో దేహమును కప్పుకొని జీవించిన మహాసాధ్వి.బసవేశ్వరుడు-తక్కిన శివభక్తులు ఆమెను గౌరవముతో అక్క అని భావించి,పూజించెడివారు.స్వామి శ్రీశైల మల్లిఖార్జునునిగా కదళీవనములో నున్న జ్యోతిర్లింగములో ఆమెను ఐక్యము చేసి,తరింపచేసినాడు-కరుణాంతరంగు
ఏకబిల్వం శివార్పణం.