Sunday, September 9, 2018

SIVA PAMCHAAKSHARI NAKSHATRAMAALAA STOTRAMU.

 శివ పంచాక్షరి నక్షత్రమాల స్తోత్రము శ్రీ శంకరాచార్యకృతము.
 ******************************
 1.శుభలక్షణమైన ఆత్మస్వరూపమునకు దండాలు శివా
   చిన్ని కాంతి సూర్యుడైన చిత్ప్రకాశమునకు దండాలు శివా
   సంతాపనాశకమైన చిదానందమునకు దండాలు శివా
   భవతారకమైన భక్త బాంధవునకు దండాలు శివా.

 2.బాలుని రక్షించిన కాలకాలునకు దండాలు శివా
  దక్షుని శిక్షించిన వీరభద్రునకుదండాలు శివా
  కార్య-కారణముల మూలకారణునకు దండాలు శివా
  నన్ను పాలించు దయాలవాలమునకు దండాలు శివా

3..ఋషివందిత ఋషభవాహనునకు దండాలు శివా
  ధర్మపు వంతెన సృష్టిరక్షకునకు దండాలు శివా
  దుష్టుల శిక్షించు ధూమకేతనునకు దండాలు శివా
  ఇష్టవస్తు ప్రదాత అష్టమూర్తికి దండాలు శివా.

4. ఆపదలు నశింపచేయు ఆయుధునకు దండాలు శివా
   పాపములు నశింపచేయు గంగాధరునకు దండాలు శివా
   శాపములు తొలగచేయు భక్తవశంకరునకు దండాలు శివా
   దండాలు స్వీకరించు దయాసింధువునకు దండాలు శివా.

5.ఆశాపాశమునకు అందనివానికి దండాలు శివా
  ఆకాశము కేశములైన వానికి దండాలు శివా
  పర్వతమును విల్లుగ మలచిన వానికి దండాలు శివా
  పాపములు దహించు స్మరణనామికి దండాలు శివా

6.ఆదిశేషువే కుండలములైన వానికి దండాలు శివా
  ఆ కాలునే కాలదన్నినవానికి దండాలు శివా
  వేదములే శిరములైన వానికి దండాలు శివా
  వేదార్థములే తానైన వానికి దండాలు శివా.

7. కందర్పుని భస్మముచేసిన వానికి దండాలు శివా
   కరిచర్మము వస్త్రమైన వానికి దండాలు శివా
   కనకకాంతి కవచమైన వానికి దండాలు శివా
   సామగానము ప్రియమైన వానికి దండాలు శివా

8.ముట్టడించిన మన్మథుని గుట్టువిప్పిన వానికి దండాలు శివా
  పుట్టుట-గిట్టుటను మట్టుపెట్టువానికి దండాలు శివా
  బెట్టుసేయక వరములిచ్చే పట్టుకొమ్మకు  దండాలు శివా
  గుట్టుగా  నాలోన దాగిన గుట్టదొరకు దండాలు శివా

9.అండజవాహన  (హరి) హృదయవాసికి దండాలు శివా
  అంగుడిలోనవేదములు దాచినవానికి దండాలు శివా
  అరచేతిలో అగ్నిపాత్ర కలవానికి దండాలు శివా
  కుబేర బంధువునకు  ముక్కంటికి దండాలు శివా

10.కృపాకటాక్ష అక్షర స్వరూపునకు దండాలు శివా
   ప్రకటిత ప్రకాశ యజ్ఞదీక్షితునకు దండాలు శివా
   నందివాహనుడు చిదానందమునకు దండాలు శివా
   సద్గతి ప్రసాదక భక్త మందారకునకు దండాలు శివా

11.శిశుశశిరేఖా ప్రకాశములవానికి దండాలు శివా
   సుందరంబగు దరహాసంబులవానికి దండాలు శివా
   వెండికొండ  చరియలందుండు వానికి దండాలు శివా
   మెండుగ కరుణించు పశుపతినాధునకు దండాలు శివా

12. దీనుల రక్షించు కామధేనువునకు దండాలు శివా
     కాముని శిక్షించిన వైశ్వానరునకు దండాలు శివా
     అసురత తొలగించు  ప్రకాశమునకు దండాలు శివా
     భక్తరక్షణగిరీశ మేరువునకు దండాలు శివా.

13.
    ఏక బిల్వమునకు సంతసించు వానికి దండాలు శివా
    అనేకజన్మ పాపములు హరించువానికి దండాలు శివా
    తేట తేనెలొలుకు పలుకు వానికి దండాలు శివా
    సాటిలేని కరుణ చిలుకు సామికి దండాలు శివా.

14.తేట తేనెలొలుకు ధర్మ భాషణములకు దండాలు శివా
   తేట తెల్లపరచు దయా భూషణములకు దండాలు శివా
   పాప పంకిలమును హరించు పాదములకు దండాలు శివా
   ఏక బిల్వ దానముతో పులకించు మదికి దండాలు శివా.

15. చల్లనైన చంద్రరేఖను ధరించిన వానికి దండాలు శివా
    కుటిలమైన దైత్యమాయను ఖండించిన వానికి దండాలు శివా
    సగమైన తల్లి పార్వతీ ప్రభువైన వానికి దండాలు శివా
    సర్వ జీవులను రక్షించు మహాదేవునికి దండాలు శివా.

16. కనికరించు కామ సంహారునకు కోటి దండాలు శివా
    మైమరపించు మోహనాకారునకు దండాలు శివ
    వరములిచ్చు వెండికొండ నిలయునకు దండాలు శివా
    ఉమ కొలుచు మనోహర దేహునకు దండాలు శివా.

17.శిరమున  గంగాతరంగముల వానికి దండాలు శివా
   సంగరమున  భంగపరచు వానికి దండాలు శివా
   అభంగముల  కురంగమున్న (లేడి) వానికి దండాలు శివా
   మంగళముల నొసగు మహేశునికి దండాలు శివా

18.రజత కాంతి ధిక్కరించు తేజమునకు దండాలు శివా
   రయమున కనికరించు  నైజమునకు దండాలు శివాయ
   కోరిన క్షణమున కోర్కె తీర్చువానికి దండాలు శివా
   సంసార దుఃఖమును దహించువేయువానికి దండాలు శివా

 19.సూర్య-చంద్ర-వహ్ని నయనములకు దండాలు శివా
   శూరునకు దక్షయజ్ఞ శూన్యునకు దండాలు శివా
   కూరిమి సత్కృపాకటాక్షములకు దండాలు శివా
   శరణాగత లోక రక్షకునకు దండాలు శివా
20.వేడుకొనే కింకరపాలితునికి దండాలు శివా
   వేదములే (జింక) చేతనున్నవానికి దండాలు శివా
   వేదనలనే సంకటనాశనునికి దండాలు శివా
   వేడుకనే లోకరక్షణైన వానికి దండాలు శివా.
21.జన్మకర్మ పాశనాశనునికి దండాలు శివా
   జన్న భస్మధారి ఈశ్వరునికి దండాలు శివా
   సర్వసంగ పరిత్యాగ సన్నిహితునికి దండాలు శివా
   సర్వ సంపద్ప్రదాత హరివందితుని దండాలు శివా.
22. శిష్టాచార హృదయమందిరములకు దండాలు శివా
    ఇష్టమైనదాత్మయన్న స్పష్టకు దండాలు శివా
    కష్టములను తొలగచేయు కరుణకు దండాలు శివా
    సత్యం-శివం-సుందరమైన స్వామికి దండాలు శివా
23.తరలివచ్చి బాలుని కాచిన వానికి దండాలు శివా
   తనదైన ప్రకాశము కలవానికి దండాలు శివా
   తనను అర్థము చేసుకోలేని వానికి దండాలు శివా
   తానే జగమంతా నిండిన వానికి దండాలు శివా.
24.
   సంతతము మూసియుంచు ఫాలనేత్రమునకు దండాలు శివా
   సంచితము తొలగించు ప్రసాదత్వమునకు దండాలు శివా
   సంకటములు తొలగించు శంకరునికి దండాలు శివా
   సంతసములు కలిగించు దేవదేవునికి దండాలు శివా.

25. యోగివంద్య భక్తదుఃఖ హరునకు దండాలు శివా
    యోగి పూజ్య భుక్తి ముక్తి ప్రదాతకు దండాలు శివా
    యోగి హృదయ కమల వాసునకు దండాలు శివా
    యోగీంద్రుడు జగతి సృష్టికర్తకు దండాలు శివా

26. యమునికి యముడై బాలకుని కాచిన వానికి దండాలు శివా
   కరిని కనికరించిన చర్మాంబరునికి దండాలు శివా
   జంతుతతికి స్వాంతన ప్రదాతకు దండాలు శివా
   సంతతాశ్రితుల చింతమాపు వానికి దండాలు శివా.

27. చెదిరియున్న వెర్రి బ్రహ్మ పుర్రెలకు దండాలు శివా
    కుదిరియున్న విరించి తుండ మాలకు దండాలు శివా
    చేత నున్న శూలము-కపాలమునకు దండాలు శివా
    శరణని చేరిన నీ చరణములకు దండాలు శివా.


      " శివ పంచాక్షరి" విలక్షిత అక్షరములకు దండాలు శివా
       శుభలక్షిత" నక్షత్రమాల"స్తోత్రమునకు  దండాలు శివా
       త్రినేత్ర స్తుతుల త్రికాల పఠనమునకు దండాలు శివా
       సాక్షాత్ శివస్వరూప ప్రసాదమునకు దండాలు శివా.
 
       (ఏక బిల్వం శివార్పణం.)

   ఏ మాత్రము పట్టులేని నా చేతిని పట్టుకొని సదాశివుడు తనకు తానుగా వ్రాసుకొనిన స్తోత్రములో తప్పులు దొర్లిన దానికి కారణము కేవలము నా అహంకారము.శివ స్వరూపులు పెద్ద మనసుతో నన్ను క్షమించి,ఆశీర్వదించెదరు గాక.శివానుగ్రహము మనలకందరకు కలుగుగాక.

   ఓం తత్ సత్.

 
    .

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...