Monday, July 15, 2019

DASAMAHAVIDYA-BAGALAAMUKHI


    శ్రీమాత్రే నమః
    **************
 " కాళీ తారా మహావిద్యా షోడశీ భువనేశ్వరీ
   భైరవీ ఛిన్నమస్తా చ విద్యా ధూమవతీ తథా
   బగళా సిధ్ధవిద్యా చ మాతంగీ,కమలాత్మికా
   ఏతా ఏవ మహావిద్యాః సిధ్ధవిద్యా ప్రకీర్తితాః."

 నమామి బగళాముఖిదేవి మహాశక్తిం నిరంతరం.

.. బగలాముఖి వర్ణన.

గంభీరాసన కర్కరాటుక మహా కర్బూర పీతాంబరీమ్
కుంభీపాక విదారకాగ్నివిరళీమ్  క్రూరాకృతిమ్ భంజనీమ్
స్తంభీకార విజృంభ లంఘన కరీమ్ సంరంభ విస్త్రాణినీమ్
అంభోజశ్రిత పాదపద్మ యుగళీమ్  ఆధ్యాత్మికాసాగరీమ్!

భావము: కర్కరాటుక (కొంగ) వాహని, కర్బూర (బంగారు) వన్నెతో పసుపు బట్టలు ధరించునది. కుంభీపాక నరకములో లాగా చీల్చే అగ్నిని విశాలముగా విసిరి క్రూరాకృతి (దానవులను) చంపుతుంది. వేగంగా విజృంభించి లంఘించి విస్త్రాణము (పెరలైజ్) చేస్తుంది. ఆ తల్లి కమలములు వంటి పాదయుగళము ఆధ్యాత్మికా సాగరము.





















    శ్రీ మాత్రే నమః.
  ****************

  " మధ్యే సుధాబ్ధి మణిమండప రత్నవేదీ
    సింహాసనోపరిగతాం పరిపీత వర్ణాం
    పీతాంబరాభరణ మాల్య విభూషితాంగీం
    దేవీం స్మరామి ధృతముద్గర వైరి జిహ్వాం."

 బగళా  అంటే తాడు.నోటికి పగ్గమువేసే శక్తి బగళాముఖి.

 ఆవిర్భావ కారణము.
 ******************
అసురసంహారము.దైవకార్య సంస్థాపనము.

ఆవిర్భావ విధానము
********************
 దుర్గముడను అసురునితో దేవి ఘోరయుధ్ధము చేయుచున్నప్పుడు,ఏకానేక స్వరూప ధారణను క్రీడగా ధరించు తల్లి సంకల్పముచే,శస్త్రాస్త్రములను ధరించిన అనేక శక్తులు తల్లి శరీరము నుండి ఆవిర్భవించినాయి. శత్రువు నాలుకను పట్టిలాగి,వాని వాక్కును స్తంభింపచేసి గదతో వాని నెత్తిన మొత్తి,సంహరించుటకు,అహంకారమునకు బధ్ధశత్రువు యోధినీదేవత యైన బగళా ముఖిని,దేవి తన   శరీరమునుండి ఆవిర్భవింపచేసి,సైన్యాధికారిని చేసినది.

 రూపము
 *******
  "సౌవర్ణాసన సంస్థితాం త్రినయనాం పీతాంశుకోలాసినీం
   హేమాభాంగరుచిం శశాంకముకుటాం సచ్చంపకస్రగ్యుతాం
   హస్తైముద్గర పాశవజ్ర రసనాః సంభిభ్రతీం భీషణైః
   వ్యాప్తాంగీం భగళా ముఖీం త్రిజగతాం సంస్తంభినీం చింతయే.

   చేతిలో పసుపు కమలముతో అర్థచంద్రాకార ముకుటముతో,చంపకమాలాధారియై సముద్రమధ్యములో స్వర్ణసింహాసనమును అధిష్ఠించి యుంటుంది.చేతిలో పాశాంకుశములతో పాటు కుడి చేతిలో గదను ధరించి,ఎడమచేతితో శత్రువు నాలుకను బయటకు లాగి ధర్మపాలనచేస్తుంటుంది తల్లి.  మేని పసిమి కాంతితో,య-ర-ల-వ-శ-ష-స-హ-ళ- అను పసుపురంగును సూచించు అక్షర సంకేతముతో ప్రకాశిస్తూ,ఎర్రతామరలు చుట్టబడిన స్వర్ణసింహాసనము అధిష్ఠించి,భక్తులను అనుగ్రహిస్తుంటుంది.


 స్వభావము
************

  " మాతర్ భంజయ మద్విపక్షవదనం జిహ్వాంచ సంకీలయ
    బ్రహ్మీ యస్త్రయముద్రయా సుదిషణాం ఉగ్రాంగతిం స్తంభయ
    శత్రూం చూర్ణయ చూర్ణయాశు గదయా గౌరాంగి పెతాంబరే
    విఘ్నౌఘం బగళే హరప్రణమతాం కారుణ్య పూర్ణేక్షణే,

  సమ్మోహన-స్తంభన అను విరుధ్ధ శక్తులను తన అధీనములో నుంచుకొని మనలను అనుగ్రహిస్తున్న తల్లి బగళాముఖి.మన విరుధ్ధశక్తులను తల్లి తన కటాక్షముతో సహాయక శక్తులుగా మారుస్తుంది.మనలకు మాయ కమ్ముకునే స్థితిని నివారిస్తుంది.మన క్షుద్ర శక్తులను స్తభింపచేసి,సత్యమువైపు మనలను సమ్మోహితులను చేస్తుంది.అహంకారమునకు బధ్ధ్శత్రువును నిర్మూలించే తల్లిని కొంగ ఏ విధముగా నీటిలోని ఎరను పట్టుకొనునపుడు బురద తగలనీయదో,అదే విధముగా తల్లి తన లోచూపుతో మనలను కర్తవ్య సుముఖులను చేస్తుంది.



   బగళాముఖి మూలబిందువు నుండి దక్షిణదిశకు తన శక్తిని విస్తరింపచేస్తుంది.వీరరాత్రియైన ఈ తల్లి ఏకరుద్ర మహావక్త్ర శివశక్తిని కలుపుకొని పరిపూర్ణమవుతుంది.వైశాఖ శుక్ల  అష్టమి

ప్రీతిపాత్రమైన  తిథి.మాయను నివారించే స్వభావము కలది.వాణికి ప్రతిరూపమైన ఈ శక్తి పరోక్ష ప్రీతిదాయిని.బగళాముఖిని ధ్యానించే సాధకుడు వామహస్తములో నాలుకని,దక్షిణ హస్తములో గదను భావించవలెను.కూర్మావతారముగ పరిగణించబడుతోంది.

ఆయుధములు
 *******
మాయకు-అవిద్యకు ప్రతీకయైన పాశమును,జ్ఞానము విద్యకు సంకేతమైన అంకుశమునుధరించి యుంటుంది.కుడిచేతిలో గద ఉంటుంది.సంమోహన-సం స్తంభన శక్తులు గల బగళదేవి మహాదేవిసైన్యమును రక్షిస్తుంటుంది.

  నివాసస్థానములు
 ******************
  సూక్ష్మ నివాసము కొండనాలుక.(ఇంద్రయోని) స్థూల నివాసము వాక్కు అనే సుధా సముద్రము.

" బ్రహ్మాస్త్ర స్వరూపిణీదేవీ మాతా శ్రీబగళాముఖీ
  ఛిఛ్చక్తిః జ్ఞానరూపా చ బ్రహ్మానంద ప్రదాయినీ

  స్తంభరూపా స్తంభనీచదుష్టస్తంభనకారిణీ
 భక్తప్రియ మహాభోగాశ్రీవిద్యాం లలితాంబికాం.

   దేవాలయములు
   ************
 ఛత్తెస్ఘడ్ లో బగలాముఖి ఆలయముకలదు.శ్రీ సూర్య మంగళ అద్వైతవేదపీఠము వారు తమిళనాడు లోని పప్పంకులం గ్రామములో నిర్మించడానికి పూనుకున్నారు.







 అంతరార్థము
*************
  నాలుకను మడిచి కొండనాలుకను తాకే విధానము హఠయోగ సాధన.
.కొండనాలుక మీద ధ్యానాన్ని కేంద్రీకరిస్తే భూతప్రపంచము మీద ఆధిక్యత లభిస్తుంది.మనలోని క్షుద్రభావములను మనదరిచేరనీయనిబగళావిద్యా బంగారుపాదములకు భక్తిప్రపత్తులతో సమర్పిస్తూ,
"గదాహస్తా సాదుపాతు ముఖమే మోక్షదాయిని
 వైరిజిహ్వ ధరాపాలు కంఠమ్మే బగళాముఖి.""

" యదక్షర పద భ్రష్టం మాత్రాహీనంతు యద్భవేత్
  తత్సర్వం క్షమ్యతాం దేవి శ్రీమాతానమో స్తుతే.

  అపరాధసహస్రాణి క్రియంతే అహర్నిశం మమ
  దాసో యమితి మాతా క్షమస్వ పరమేశ్వరి.

https://www.youtube.com/watch?v=ZOm19zDUk68&feature=youtu.be
  యాదేవీ సర్వభూతానాం బగళాముఖిరూపేణ  సంస్థితాం,
 నమస్తస్త్యై నమస్తస్త్యై నమస్తస్త్యై నమో నమః.



DASAMAHAVIDYA-DHOOMAVATI


    శ్రీమాత్రే నమః
    **************
 " కాళీ తారా మహావిద్యా షోడశీ భువనేశ్వరీ
   భైరవీ ఛిన్నమస్తా చ విద్యా ధూమవతీ తథా
   బగళా సిధ్ధవిద్యా చ మాతంగీ,కమలాత్మికా
   ఏతా ఏవ మహావిద్యాః సిధ్ధవిద్యా ప్రకీర్తితాః."

    నమామి  మహాశక్తిం నిరంతరం.

శార్దూలము.. ధూమవతి వర్ణన..

వైధవ్యంబు నిరాశ నిస్పృహ సహా వార్ధక్య ధూమం రుచిమ్
వ్యాధిగ్రస్త కురూపి కాకి రధమున్ వాసం శ్మశానంబునున్
బాధా రూపము తానె దాల్చు బహుధా బ్రహ్మాండ మంతంబునన్
బోధంజేసెడి బుద్ధి సిద్ధి శుభదం భోక్తవ్య భూరిన్నిలన్!

భావము: ముదుసలి విధవరాలి రూపము, పొగ రంగు, నిరాశా నిస్పృహలతో వ్యాధులతో కురూపిగా కాకి రథముగా శ్మశానంలో నివసిస్తుంది. లయకాలములో సర్వ బాధలు తాననుభవించి బ్రహ్మాండాన్ని లయజేసుకొని తనలో దాచుకుంటుంది. బుద్ధి సిద్ధిని ఇలలో అనుభవప్రద అర్హత ఉన్నవారికి ఎంతో ప్రసాదిస్తుంది ఆ తల్లి!!




















  ఆవిర్భావ కారణము
********************
     పార్వతీదేవికి కలిగిన విపరీతమైన ఆకలి.దానిని తట్టుకొనలేక ఆహారమునిమ్మని శివుని మూడుసార్లు అడిగి,ఆహారము లభించనందువలన పరమశివుని భక్షించుట.

   ఆవిర్భావ విధానము
***********************
   తల్లిజఠరాగ్నికి పరమేశుడు ఆహారము కాగా,తల్లి శరీరము నుండి దట్టమైన పొగలు(ధూమము) వ్యాపించి ఈ శక్తిని ధూమవర్ణిగా,పురుషశక్తి సంపర్కములేని స్త్రీ శక్తిగా ఆవిర్భవించినది.


 రూపము
***********ధూమవతి కాళికులమునకు చెందిన ఘోరశక్తి.ముడుతలు పడిన దేహముతో మురికి గుడ్డలు చుట్టుకొని ఉంటుంది.కోపిష్టి.విధవ.కాకధ్వజము కల రథము మీద కూర్చుని ఉంటుంది.చేతిలో చేట పట్టుకొని ఉంటుంది.మూలబిందువు నుండి ఆగ్నేయ మూలకు విస్తరించి యుంటుంది.పొగతో కప్పబడి ప్రకాశవంతముగా గోచరించదు.అసురుల పచ్చి మాంసభక్షణము చేస్తుంటుంది.ఆదిమ తమస్సు,జ్యేష్ఠ,రాత్రి,అంతరాయిని ఇతర నామములు.

 ఆయుధములు
 **********
గొడ్డలి-కత్తి-చేట

 స్వభావము
 *********
 ఆకలి దప్పులతో వ్యాకులపడుతుంటుంది.జీవి పుట్టుకకు మునుపు,మరణము తరువాత గల అవ్యక్త దశయే ధూమవతి.గుర్రము లేనిబందిపై కూర్చుని ఉంటుంది.ఘోరకర్మలలో సిధ్ధహస్తురాలు.అంతతా వ్యాపించి యుంటుంది.అంతర్ధానముచేయగలుగు స్వభావము కలది.శుక్లపక్ష-కృష్ణపక్ష గతులలో వికృతశక్తిగా చెప్పబడినది.వామనావతారముగ పరిగణిస్తారు.ఆవరణ-నిక్షేపక ( ఉన్నదానిని కప్పివేయడము-కప్పివేసిన దానిని తిరిగి చూపించదము) రెండు తానైనది ధూమవతి.నిద్ర-మరపు-దుఃఖము మూర్ఛ లాంటి రూపములలో సంసారులలో నున్నది ధూమవతి శక్తియే.


 అంతరార్థము
 ************
కసర్గడ్లో ధూమవతి తల్లి దేవాలయము కలదు.అంతే కాక అస్సాంలోని కామాఖ్య గుడి దగ్గర కూడ తల్లి మనిదర్ము కలదు.నిర్మలదేవతగా పిప్పలాదిమహర్షి తల్లిని దర్శిమ్హి ధన్యతనొందెను.

హృదయములోని దహరాకాశము అమ్మ నివాసస్థానము.

 
 దారుణ రాత్రియైన ధూమవతి కాలభైరవుడను శివశక్తిని కలుపుకొని పరిపూర్ణమవుతుందని. మరికొందరి అభిప్రాయము.దక్షయజ్ఞములో సతీదేవి నిజోత్పన్న యాగాగ్నిలోభస్మైనపుడు,ఆ ధూమాగ్నినుండిఈ శక్తి ఆవిర్భవించినదని స్వతంత్ర తంత్ర గ్రంధము చెబుతున్నది.ప్రళయ కాలములో ధూమవతి యోగనిద్ర.ముక్తపురుషులకు నిత్యానంద నిద్ర.కాలానికి-కాలాతీతానికి,ప్రణానికి-ప్రాణాతీత అనుభవానికి ప్రతీక కనుక తల్లిని వృధ్ధకాళి అనికూడ అంటారు.నిర్మలమైన కళ్ళుకలిగిన దేవిగా పిప్పలాద మహర్షికి దర్శనమిచ్చిన ధూమవతి పాదపద్మములకు సభక్తితో సమర్పిస్తూ,

 ఫలసిధ్ధి
 *******



 " ధూమోరాత్రి స్తథా కృష్ణః షణ్మాసా దక్షిణాయనం
   తత్ర చాంద్రమసం జ్యోతిః యోగీ ప్రాప్య నివర్తతే"

  యాదేవీ సర్వభూతానాం ధూమవతిరూపేణ  సంస్థితాం,
  నమస్తస్త్యై నమస్తస్త్యై నమస్తస్త్యై నమోనమః

" యదక్షర పద భ్రష్టం మాత్రాహీనంతు యద్భవేత్
  తత్సర్వం క్షమ్యతాం దేవి శ్రీమాతానమో స్తుతే.

  అపరాధసహస్రాణి క్రియంతే అహర్నిశం మమ
  దాసో యమితి మాతా క్షమస్వ పరమేశ్వరి.

https://www.youtube.com/watch?v=d4L4Gc_mRvU&feature=youtu.be



TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...