Monday, July 15, 2019

DASAMAHAVIDYA-DHOOMAVATI


    శ్రీమాత్రే నమః
    **************
 " కాళీ తారా మహావిద్యా షోడశీ భువనేశ్వరీ
   భైరవీ ఛిన్నమస్తా చ విద్యా ధూమవతీ తథా
   బగళా సిధ్ధవిద్యా చ మాతంగీ,కమలాత్మికా
   ఏతా ఏవ మహావిద్యాః సిధ్ధవిద్యా ప్రకీర్తితాః."

    నమామి  మహాశక్తిం నిరంతరం.

శార్దూలము.. ధూమవతి వర్ణన..

వైధవ్యంబు నిరాశ నిస్పృహ సహా వార్ధక్య ధూమం రుచిమ్
వ్యాధిగ్రస్త కురూపి కాకి రధమున్ వాసం శ్మశానంబునున్
బాధా రూపము తానె దాల్చు బహుధా బ్రహ్మాండ మంతంబునన్
బోధంజేసెడి బుద్ధి సిద్ధి శుభదం భోక్తవ్య భూరిన్నిలన్!

భావము: ముదుసలి విధవరాలి రూపము, పొగ రంగు, నిరాశా నిస్పృహలతో వ్యాధులతో కురూపిగా కాకి రథముగా శ్మశానంలో నివసిస్తుంది. లయకాలములో సర్వ బాధలు తాననుభవించి బ్రహ్మాండాన్ని లయజేసుకొని తనలో దాచుకుంటుంది. బుద్ధి సిద్ధిని ఇలలో అనుభవప్రద అర్హత ఉన్నవారికి ఎంతో ప్రసాదిస్తుంది ఆ తల్లి!!




















  ఆవిర్భావ కారణము
********************
     పార్వతీదేవికి కలిగిన విపరీతమైన ఆకలి.దానిని తట్టుకొనలేక ఆహారమునిమ్మని శివుని మూడుసార్లు అడిగి,ఆహారము లభించనందువలన పరమశివుని భక్షించుట.

   ఆవిర్భావ విధానము
***********************
   తల్లిజఠరాగ్నికి పరమేశుడు ఆహారము కాగా,తల్లి శరీరము నుండి దట్టమైన పొగలు(ధూమము) వ్యాపించి ఈ శక్తిని ధూమవర్ణిగా,పురుషశక్తి సంపర్కములేని స్త్రీ శక్తిగా ఆవిర్భవించినది.


 రూపము
***********ధూమవతి కాళికులమునకు చెందిన ఘోరశక్తి.ముడుతలు పడిన దేహముతో మురికి గుడ్డలు చుట్టుకొని ఉంటుంది.కోపిష్టి.విధవ.కాకధ్వజము కల రథము మీద కూర్చుని ఉంటుంది.చేతిలో చేట పట్టుకొని ఉంటుంది.మూలబిందువు నుండి ఆగ్నేయ మూలకు విస్తరించి యుంటుంది.పొగతో కప్పబడి ప్రకాశవంతముగా గోచరించదు.అసురుల పచ్చి మాంసభక్షణము చేస్తుంటుంది.ఆదిమ తమస్సు,జ్యేష్ఠ,రాత్రి,అంతరాయిని ఇతర నామములు.

 ఆయుధములు
 **********
గొడ్డలి-కత్తి-చేట

 స్వభావము
 *********
 ఆకలి దప్పులతో వ్యాకులపడుతుంటుంది.జీవి పుట్టుకకు మునుపు,మరణము తరువాత గల అవ్యక్త దశయే ధూమవతి.గుర్రము లేనిబందిపై కూర్చుని ఉంటుంది.ఘోరకర్మలలో సిధ్ధహస్తురాలు.అంతతా వ్యాపించి యుంటుంది.అంతర్ధానముచేయగలుగు స్వభావము కలది.శుక్లపక్ష-కృష్ణపక్ష గతులలో వికృతశక్తిగా చెప్పబడినది.వామనావతారముగ పరిగణిస్తారు.ఆవరణ-నిక్షేపక ( ఉన్నదానిని కప్పివేయడము-కప్పివేసిన దానిని తిరిగి చూపించదము) రెండు తానైనది ధూమవతి.నిద్ర-మరపు-దుఃఖము మూర్ఛ లాంటి రూపములలో సంసారులలో నున్నది ధూమవతి శక్తియే.


 అంతరార్థము
 ************
కసర్గడ్లో ధూమవతి తల్లి దేవాలయము కలదు.అంతే కాక అస్సాంలోని కామాఖ్య గుడి దగ్గర కూడ తల్లి మనిదర్ము కలదు.నిర్మలదేవతగా పిప్పలాదిమహర్షి తల్లిని దర్శిమ్హి ధన్యతనొందెను.

హృదయములోని దహరాకాశము అమ్మ నివాసస్థానము.

 
 దారుణ రాత్రియైన ధూమవతి కాలభైరవుడను శివశక్తిని కలుపుకొని పరిపూర్ణమవుతుందని. మరికొందరి అభిప్రాయము.దక్షయజ్ఞములో సతీదేవి నిజోత్పన్న యాగాగ్నిలోభస్మైనపుడు,ఆ ధూమాగ్నినుండిఈ శక్తి ఆవిర్భవించినదని స్వతంత్ర తంత్ర గ్రంధము చెబుతున్నది.ప్రళయ కాలములో ధూమవతి యోగనిద్ర.ముక్తపురుషులకు నిత్యానంద నిద్ర.కాలానికి-కాలాతీతానికి,ప్రణానికి-ప్రాణాతీత అనుభవానికి ప్రతీక కనుక తల్లిని వృధ్ధకాళి అనికూడ అంటారు.నిర్మలమైన కళ్ళుకలిగిన దేవిగా పిప్పలాద మహర్షికి దర్శనమిచ్చిన ధూమవతి పాదపద్మములకు సభక్తితో సమర్పిస్తూ,

 ఫలసిధ్ధి
 *******



 " ధూమోరాత్రి స్తథా కృష్ణః షణ్మాసా దక్షిణాయనం
   తత్ర చాంద్రమసం జ్యోతిః యోగీ ప్రాప్య నివర్తతే"

  యాదేవీ సర్వభూతానాం ధూమవతిరూపేణ  సంస్థితాం,
  నమస్తస్త్యై నమస్తస్త్యై నమస్తస్త్యై నమోనమః

" యదక్షర పద భ్రష్టం మాత్రాహీనంతు యద్భవేత్
  తత్సర్వం క్షమ్యతాం దేవి శ్రీమాతానమో స్తుతే.

  అపరాధసహస్రాణి క్రియంతే అహర్నిశం మమ
  దాసో యమితి మాతా క్షమస్వ పరమేశ్వరి.

https://www.youtube.com/watch?v=d4L4Gc_mRvU&feature=youtu.be



No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...