AMBA VANDANAM-07
అంబ వందనం-07 *************** "ధ్యాయేయాం రత్నపీఠే శుకకల పఠితం శృణ్వతీం శ్యామలాంగీం న్యస్తైకాంఘ్రి సరోజే శశిశకలధరాం వల్లకీ వాదయంతీం కహ్లార/కళార మాలాం నియమిత విలసత్ చోలికాం రక్తవస్త్రాం మాతంగీం శంఖపాత్రాం మథుర మథుమదాం చిత్రకోత్ భాసిభాలాం. చంద్రరేఖను,అమరిన వస్త్రములను కలువమాలలను మథుకలశమును ధరించి, తన పెంపుడు చిలుక పలుకులను వినుచు,వీణాధరియై-నవరత్న ఖచిత సింహాసనముపై,శ్యామలాంగముతో ప్రకాశిస్తున్న మాతంగి నామ పరమేశ్వరిని నేను సేవించుచున్నాను. " బాలసూర్య ప్రతీకాశాం బంధుక ప్రసవారుణాం విధి విష్ణు శివస్తుత్యాం దేవగంధర్వ సేవితాం రక్తారవింద సంకాశం సర్వాభరణ భూషితాం "శివదూతీం" నమస్యామి రత్నసింహాసన స్థితాం" ఉదయభానుని ప్రకాశముతో ఎర్రని అరవింద పుష్పముల ప్రభలుకలిగిన ఆభరణములతో అనవరతము బ్రహ్మ-విష్ణు-రుద్రాదులచే ,దేవ-గంధర్వులాదులచే స్తుతింపబడుతు రత్నసింహాసనమున ఆసీనురాలైన శివదూతి మాత మనలను అనుగ్రహించుగాక. శివదూతి నమోస్తుతే. ఇక్కడ రక్తబీజుడు అనురక్తితో తన శరీరమునుండి కారుచు నేలపై బడుచున్న రక్తబిందువులచే అనేకానేక రక్తబీజులను వరప్రభావముత...