Friday, February 5, 2021

TIRUCHITRAMBALAM.

 


 తిరుచిట్రంబలం

 *************


  శంభుపాదాశ్రితుడు-శివజ్ఞానవతుల పుణ్యఫలము మనకు  తిరువాచకమును అందించిన మహనీయుడు.వడగూరుకు చెందినవాడు కనుక ఆయనను ప్రజలు తిరువడగూరార్ అని సంబోధించేవారు.సాక్షాత్తు జగదంబ అందించిన జ్ఞానక్షీరమును పానము చేసిన మహానుభావుడు.పరమేశుని గురించి పరవశిస్తూ పాడుకునేవాడే కాని పదిమంది కోసము వాటిని భద్రపరచవలెనన్న తలపును కూడ దరిచేరనీయని తన్మయత్వముతో తరించువాడు.


  భగవంతుని లీలలు బహువిచిత్రములు.భావనాతీతములు.తాను వ్రాయసగాడుగా మారాలనుకున్నాడు ఆ మీనాక్షిసుందరేశుడు.అతిథిగా వచ్చి వ్రాసే అవకాశమును,సొంతము చేసుకున్నాడు.

   ఆగని అమృతధారలను ఆస్వాదిస్తూ అతి పదిలముగా భద్రపరుస్తున్నాడు ఆదిదేవుడు.అసలేమి జరుగుతోందో కూడా అవసరములేని అంతర్ముఖము ను ఆశీర్వదిస్తు,నీ మాటలు మాణిక్యములు.మరేవియును వాటిసాటిరావు అని," మాణిక్యవాచగర్" అను నామకరణమును చేశాడు వాత్సల్యముతో.కన్నులు తెరిచి చూస్తే అక్కడ అతిథిలేడు.


  ఆదిదేవుని కరుణ ఆఖరి వాక్యముగా వడగూరన్ చెప్పగా అంబల్వన్ వ్రాసినట్లుగాను,సంతకము

 "తిరు చిట్రంబలం" గా దీవిస్తున్నది.


అంబే శివే తిరు వడిగళే శరణం.



TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...