Posts

Showing posts from July 6, 2017

MAATA CHOOPINA BAATA

Image
 ఒక్కమాట  ********** మోమాటమే కానరాని మాటల చదరంగంలో పావులు యెన్నెన్నో పాపములు యెన్నెన్నో తిక్కదైన ఒక్కమాట సీతమ్మను మార్చినది లోకపావనిగా అక్కసైన ఒక్కమాట బాలుని మార్చినది ధృవతారగా పక్కమీది ఒక్కమాట భోగినే మార్చినది యోగివేమనగా కొంటెదైన ఒక్కమాట కొలుచుటనే కోరింది తులసీదాసుగా గట్టిదైన ఒక్కమాట గాంగేయుని చేసింది గౌరవనీయునిగా మక్కువైన ఒక్కమాట మాధవునే మార్చింది రథసారథిగా అవసానపు ఒక్కమాట అజామిళుని చేరింది అపూర్వ పుణ్యముగా తీయనైన ప్రతిమాట తెలుగును మెరిపిస్తుంది భూగోళపు వెలుగుగా.

TELUSUKOE.

Image
   తెలుసుకో ============= కోటీశ్వరులకు నీవు పోటీగా ఎదగాలని సాటిలేనిదంటు దాని మేటితనము చాటుకుంటూ అమెరికా అభివృద్ధిని ఆదర్శము అని అంటూ సలాం అంటూ దానికి నీవయ్యావు గులాము,. .............................. .............................. అందమైన నయాగరా జలపాతం పరుగు చూడు మంచుకొండ అంచున పొంచియున్న ప్రభలు చూడు కల్పనాచతురతగల శిల్పకళల గుహలు చూడు చారెడు కన్నుల తోడ తారల వన్నెలు చూడు అందమైన ప్రకృతికి నీవయ్యావు బందీవి .............................. ... ఐఫోను,ఐపాడు,ఐ మాక్సు ఈమెయిలు,ఈచాటు,ఈవెబ్‌ పెండ్రైవు మరియెన్నో కనుగొన్నది టాలెంటు సాంకేతిక సౌరభమా,సమకాలీన సహవాసమా నీ ఘనత చాటుతానంటూ అయ్యావు బంటువి .............................. .............. అన్నావు నువు బెస్తని,ఎదిగావు ఎవరెస్టని ఎటుచూసినా నీదేగా లేటెస్టు హాట్‌ న్యూసని నీ నీడగా ఉంటున్న నిజమును తెలిసికోలేక విజయాల మత్తులో మునిగావు నీవు చిత్తుచేసినానంటూ మారినావు తొత్తుగా .............................. .......... ఒకటి,రెండు,మూడు చేసి ఓడించాననుకోకు పరమాత్మను కనుగొనని పరిశోధన ఫలితమేమి అన్నింట ఉన్నది అది,ఆనందపు వెల్లువ అది ఆత్మయను రెల్ల...

MALUPU PILUPU

Image
మలుపు పిలుపు ************** చీకటి తిరిగే మలుపు వేకువరేఖల పిలుపు జననమనే మన మలుపు జననీజనకుల పిలుపు బడిబాటను మన మలుపు ఒడిదుడుకులనోర్చు పిలుపు కన్నకలల కథల మలుపు వన్నెలొలుకు వధువు పిలుపు అమ్మతనపు అసలు మలుపు కమ్మనైన ప్రతుల పిలుపు ఆ గొప్పతరము మలుపు (తాత....) ఆనందపు తెప్ప పిలుపు వయసులోని ప్రతి మలుపు వరుస విజయాల పిలుపు.

PAARAA USHAAR

Image
   పారా ఉషార్   **************   ఆరుగురొస్తరు చూడు   ఆటాడిస్తరు నిన్ను ఔర అనిపిస్తరు యాదుంచుకు నువ్వుంటే బాధించరు నిన్నంటి పారా ఉషార్ బిడ్డ పారా ఉషార్ ......... ఆహా అనిపిస్తడొకడు అక్కట్లే తెస్తడు సుమా ........ అరుపులు తెప్పిస్తడొకడు అలసటనే తెస్తడు సుమా .......... అన్నీ దాచేస్తడొకడు ఆనందం దోస్తడు సుమా ....... అందుకొంటానంటనొకడూ అట్టడుగుకు తోస్తడు సుమా ............ అదరగొట్టానంటనొకడు ఆపద చూపిస్తడు సుమా ............ అతలకుతలమవుతుంటడొకడు అగ్గిలోకి తోస్తడు సుమా .....పారా ఉషార్ ......... తొందర చేస్తుంటడొకడు ముందర కొస్తుంటడొకడు చిందులు వేస్తుంటడొకడు చీకట తోస్తుంటడొకడు ........ గట్టితనము లేకుంటే  మట్టికరిపిస్తరు బిడ్డ పారా ఉషార్..పారా ఉషార్

VAAHVAA-JIHVA

Image
వాహ్వా-జిహ్వా ************* నరములేని నాలుకవని , నరులకెంత చులకనమ్మా తలమానిక భాగమైన, తలలోని నాలుక...... జనులు..... మడతపెడితే నీకసలు, మరియాదేదంటారు మోహముగా కదిలావో, అహంకారము అంటారు అటు ఇటు ఆడావంటే,   అబద్ధానివంటారు బయటకు వచ్చావంటే, భద్రకాళివి అంటారు......కాని తెలుసుకుంటే. .. ఇలలోని జోలపాట, ఇలవేలుపు నీవమ్మా విందు భోజనాలలోన, ముందు పీట నీదమ్మా సరిగమలు దద్దరిల్ల, సహకారము నీవమ్మా సరస్వతీ కృపాకటాక్ష, స్థానమే నీవమ్మా పదునైన పండ్ల మధ్య, పదిలంగ ఉండగలవు ....పాపం అపనిందలా. .. రుచి బాగుందని అన్నావు కాని, లాగించమని అన్నావా మాట సాయమన్నవుగాని, లేసి మాటలు అనమన్నావా మాయదారి మనసు మాట, మరీ మరీ మన్నిస్తూ బుద్ధి గడ్డితిన్న జనులు, నిన్ను బద్ధ శత్రువు అంటారా సరిహద్దుల్లోనే సర్దుకునే నీ, సౌశీల్యపు సాకారము    కావాలి మాలోని సద్గుణాల  ప్రాకారము.

UPANAYANAMU

Image
  చిరంజీవి వటువునకు  వేద సముపార్జనా సంస్కారపు ఉపనయనమున  జన్మ కర్మ సంస్కార అద్వితీయ ద్విజునిగా  గురువైన నాన్న వాక్కు బ్రహ్మోపదేశముగా  అమ్మ చేతి ఆదిభిక్ష అక్షయ రక్షగ మారగ  గాయత్రీ మాతను గౌరవముగ ధరిస్తు  గాయత్రీ మంత్రమును వినయముగ జపిస్తు  మనోవాక్కాయ కర్మలను మంగళప్రదమొనరిస్తు  జ్ఞాన భిక్షాటనకై భిక్షాటన ప్రారంభిస్తు  అరిషడ్వరగములను అల్లంత దూరము చేస్తు  అతిథుల ఆశీర్వచనములను అల్లదిగో చేరువుగ రానిస్తు  పటుతర వటువుగా నీ పయనము సాగాలి  కన్నవారి కలలు సకలము సాకారము కావాలి      అనేక శుభాశీస్సులతో-కౌతా కుటుంబము..