MAATA CHOOPINA BAATA
ఒక్కమాట
**********
మోమాటమే కానరాని
మాటల చదరంగంలో
పావులు యెన్నెన్నో
పాపములు యెన్నెన్నో
తిక్కదైన ఒక్కమాట
సీతమ్మను మార్చినది
లోకపావనిగా
అక్కసైన ఒక్కమాట
బాలుని మార్చినది
ధృవతారగా
పక్కమీది ఒక్కమాట
భోగినే మార్చినది
యోగివేమనగా
కొంటెదైన ఒక్కమాట
కొలుచుటనే కోరింది
తులసీదాసుగా
గట్టిదైన ఒక్కమాట
గాంగేయుని చేసింది
గౌరవనీయునిగా
మక్కువైన ఒక్కమాట
మాధవునే మార్చింది
రథసారథిగా
అవసానపు ఒక్కమాట
అజామిళుని చేరింది
అపూర్వ పుణ్యముగా
తీయనైన ప్రతిమాట
తెలుగును మెరిపిస్తుంది
Comments
Post a Comment