SAUMDARYA LAHARI-96
సౌందర్య లహరి-కంచు ప్రాకారము పరమపావనమైన నీపాదరజ కణము పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము ఇనుప ప్రాకారమును ఇనుమడించు కాంతితో సుగంధ పుష్ప తావులు-సుమధుర ఫల తరువులు వృక్షములకు జలమునీయ అసంఖ్యాక కూపములు పక్షుల కూజిత రవములు ఎన్నో శుభలక్షణములు హంసలు-నెమళ్ళు,సీతాకోక చిలుకలు ప్రశాంత వాతావరణపు సొగసు పులకరింతలు హరిణీ సమూహముల బిత్తరిగంతులతో,హరిణేక్షణ కంచు ప్రాకారము అచ్చెరువులో ముంచెత్తుచున్న వేళ నీ మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా మానస విహారి! ఓ సౌందర్య లహరి. అతి ఎత్తైన కంచులోహ ప్రాకారములు అమ్మ అపారకృపావీక్షణమునకు నిలువెత్తు నిదర్శనములు.పనస-శింశుప-దేవదారు- లవంగ-పాటల-దాడిమి-చందన మొదలైన అచ్చమైన పచ్చదనపు వృక్షాల( అసలు ఎండుటాకు కానరాదు) హరిత ప్రకాశము జగన్మాత స్థితికారకత్వము ,వాటి సుమనోహర పరిమళము వ్యాపించిన ఆశ్రిత వాత్సల్యమేమో .పరాత్పరికి ప్రణామములు చేస్తున్నవా అన్నట్లు చిలుకల-గోరువంకల మైత్రి,పావురముల ప్రశాంతత-రాజ హంసల రమణీయత పరుగుతీస్తున్న కాలమును సూచిస్తూ పరుగులు తీస...