Sunday, February 7, 2021

TIRUVEMBAAVAAY/ SIVANOMU




 



  తిరు ఎం పావై


  *************




   తిరు-శ్రీకరము-శుభకరము-పవిత్రము-ప్రపన్న ప్రసన్నము-పరమార్థ ప్రదాయకము ఇలా ఎన్నెన్నో అర్థములను పెద్దలు సమన్వయపరిచినారు.




 


  పావై -పాహిమాం-వ్రతము-అనుసరణీయము-అవ్యాజ అనుగ్రహము-అసమాన అదృష్టము-పరమము-పరమార్థము ఇలా ఎన్నెన్నో విధములుగా పెద్దలు సమన్వయపరిచినారు.




 అయితే మనకు ఇక్కడ ఒక చిన్న సందేహము వస్తుంది.ఈ పావై/వ్రతములో ఆరాధ్యనీయమైనది ఏది? అది సాకారమా? నిరాకారమా? సగుణమా? నిర్గుణమా? నామ రూప సాధ్యమా? అసాధ్యమా? కాల పరిమితి కలదా?లేనిదా? ఆ చిత్-శక్తి స్తోత్రములు పరిమితములా? అపరిమితములా? అంటూ ఎన్నెన్నో సందేహములు మన మనసులో తారాడుతుంటాయి.




  తిరుమాణిక్య వాచగరు చే ఆలాపింపబడి-ఆదిదేవునిచే వ్రాయబడిన తమిళవేదమైన "తిరు వాచగము" తిరు శివ పావై అని గాని /తిరు శంకర పావై అని గాని/తిరు సాంబ పావై అని గాని పేరు పెట్టవచ్చును.కాని ఎం అని ప్రశంసించేటట్లు ఎం అను చిద్రూప సామీప్య-సాంగత్య-సారూప-సాయుజ్యమునందుటకు ఏక హృదయమైన అనేక నామరూపములు ఒక చోట చేరి,ఒక్కటే ఒక్కటైన బృహత్తును సంకీర్తనమార్గములో స్వానుభవముతో సాక్షాత్కరింపచేస్తున్నది.




  తమిళవేదమైన తిరువాచగములోని ఏడవప్రకరణములోని 20 పాశురములు మరియును తిరుపళ్ళి ఎళుచ్చి లోని పది పరమాద్భుత స్తోత్రములు మహదేవుని అనుగ్రహప్రదమైన మార్గళి వ్రతమును సుసంపన్నము చేయుచున్నవి.మునుపు ఎందరో ఆచరించినారు.ప్రస్తుతము ఆచరిస్తున్నారు.భవిష్యత్తులో కూడ ఆచరిస్తారు.




  దీనిలో వ్రతముచేయుచున్నవారును పరమహంసలే.మన కొరకు తాము పరస్పర సంభాషణములను చేస్తు-పరమాత్మ పరమదయతో ప్రకటితమైన పలురూపములను ప్రస్తుతిస్తు-ఒక ప్రదేశములో మెట్ల స్వరూపముగావేరొక చోట లింగ స్వరూపముగా-మరొక చోట ఆకాశ/నాట్య స్వరూపముగా ,నామ రూపములు మాత్రమే కాదు/నానా రూపములు


 వేద స్వరూపము


 జ్యోతి స్వరూపము


 లింగ స్వరూపము


 శూలి స్వరూపము


 కొలను స్వరూపము


 కమల స్వరూపము


 కలువ స్వరూపము


 భ్రమర స్వరూపము ఇలా తెలియచేస్తు,


  తమ పాదపద్మములను సేవించుటకు మన కోసము మన ఊరికి వచ్చినాడు తల్లితో కూడి తాను మనలను తరియిం

పచేయగా.మనలను ఆశీర్వదించి(అరుళల్) అనుగ్రహించుట తప్ప ఇందులో అన్య ప్రయోజనములేదు.




చెలులారా! జ్ఞానమనే కొలనుగా స్వామి తల్లితో ప్రకటితమైనాడు.అందులో ధ్యానమనే మునకలు వేసి (పుక్కి) తందరుళ వందరుళం తనకు తానే విచ్చేసిన సత్-చిత్తును ,అరుణగిరిలో తానుండి సందర్శించి,సంభాషించి-సంకీర్తించి,మనలను సంస్కరించుటకు సన్నధ్ధుడైన తిరుమాణిక్యవాచగరునకు పరమాత్మకు

 సభక్తిపూర్వక వణక్కంగళ్/నమస్కారములతో.





 తిరు చిట్రంబలం పోట్రి




  

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...