Thursday, September 7, 2017

PRADYUMNAE SRNKHALAADEVI


        ప్రద్యుమ్నే శృంఖలాదేవి

  " ప్రద్యుమ్నే వంగరాజ్యాయాం శృంఖల నామ భూషితే
    విశ్వ విమోహితే దేవి శృంఖల బంధనాశిని"

   వంగదేశములోని  ప్రద్యుమ్న నగరములో పడిన మాయా సతి పొట్ట భాగము "శృంఖలాదేవి" గా ఆరాధింపబడుతున్నడి.ఈ తల్లిని" శృంగలాదేవి","సిం హళాదేవి" అని కూడా ఆరాధిస్తారు.

  సిం హళ అనే శబ్దమునకు సంకెల -బాలెంత నడుము కట్టు అని కూడా వ్యవహారములో ఉంది.స్థలపురాణము ప్రకారము ఈ ప్రదేశములో ఋష్యశృంగ మహాముని అమ్మవారిని  పూజించి,కటాక్షమునకై తపమాచరించి ప్రసన్నురాలిని చేసుకొనెనట.ఇక్కడ మనకు "ఋష్యశృంగము" అను పెద్ద కొండ ఆ ముని గుర్తుగా మనకు దర్శనమిస్తుంది.అతడు అమ్మతో సహా కర్ణాటక లోని  శృంగేరీ పీఠమును దర్శించి తిరిగివచ్చి ఈ స్థలములో అమ్మ శక్తిని ప్రతిపాదితము చేశారట.భక్తానుగ్రహముతో తల్లి శృంగలాదేవి నామముతో ఆరాధింపబడుతుందట.

  ఇంకొక ఐతిహాసిక కథనము ప్రకారము ధర్మనిరతికై శ్రీకృష్ణపరమాత్మా రుక్మిణీమాతలను పరీక్షింపదలచి వారిని బండికాడికి కట్టి లాగమన్నాడట.లాగుతున్న సమయములో అమ్మవారికి దాహమువేయగా స్వామి   జలమును అందించినాడట.అమ్మ దప్పి తీర్చుకొను సమయమున దూర్వాస మహర్షి తన అనుమతిలేకుండా అమ్మ నీరు తాగినదని,స్వమ్మి జలమును ఇచ్చాడని వారికి 12 సంవత్సరములు ద్వారకానగర బహిష్కరణను శిక్షగా విధించాడట.ఆ సమయములో  అమ్మ రుక్మిణీదేవి ప్రద్యుమ్నుని ప్రసవించి నడికట్టుతో ప్రజలకు దర్శనమిచ్చిందట.ఆ తల్లినే విశ్వమాత శృంఖలాదేవి యని అమ్మతనమును కీర్తిస్తూ మాఘమాసములో తప్పెట్లతో తాళాలతో జాతర జరుపుకుంటారు కోయజాతి జనులు.

   రుక్మిణీమాత సుతుడైన ప్రద్యుమ్నుని గౌరవముగా ఆ క్షేత్రము ప్రద్యుమ్నే నామముతో పవిత్రమైనది.
   ఎవ్వరు బంధించలేని "విశృంఖలాదేవి" మాతృ వాత్సల్యముతో పచ్చి బాలెంత గా మనకొరకు నిత్య పథ్యమును చేస్తూ,"జగద్రక్షణా బాధ్యత" నడికట్టును తనకు తాను బిగించుకున్నది ఆ తల్లి.
  తన చాతుర్మాస యాత్రా సమయమున ఆదిశంకరాచార్యులవారు ఈ స్థలమందలి పంచభూత పవిత్రప్రకంపనలను గుర్తించి ప్రశంసించారట.

  గుడి రూపురేఖలు నేడు మారినను తన నడికట్టు ఒడి లాలన ఏ మాత్రము మారని ఆ శృంఖలాదేవి మనలను భవబంధ విముక్తులను చేయుగాక.

     శ్రీ మాత్రే నమ:

KAAMAAKSHI KAAMCHIKAPURE

   కామాక్షి కాంచికాపురి
  ***************************

  "పుష్పేషు జాజి పురుషేషు విష్ణు
   నారీషు రంభ  నగరేషు కంచి"  ఆర్యోక్తి.

  మాయాసతి వీపు భాగము పడిన ప్రదేశము కామాక్షి దేవిగా భక్తుల  కల్పతరువైనది.అయ్యవారు  ఏకామబరేశ్వరుడు.ఏకామ్రేశ్వరుడు అను కూడా పిలుస్తారు.అమ్మవారి సైకత లింగ పరమేశ్వరిని మామిడిచెట్టుక్రింద్ అ నిలిపి తపమాచరించి
పతిగా పొందినది.పంచభూతాత్మిక క్షేత్రముగా ప్రసిద్ధిచెందినది కంచీపురము.

  "అయోధ్యా మధురా మాయా కాశి కాంచి అవంతికా" అను భారత దేశములోగల సప్త మోక్ష పురములలో ఒకటి.ఆద్వైత విద్యకు ఆధారస్థానము.పూర్వకాలములోని అలంకారికులు లాక్షణికులు తమ రచనలను ప్రమాణీకరణకు కంచికి పంపి వారి ఇంటిముఖము పట్టెడివారు కనుక కథ కంచికి మనము ఇంటికి అను నానుడి.ఎందరో కవులు చరిత్రకారులు విదేశీ యాత్రికులు(పాహియాను) కాంచీ వైభమును గురించి ప్రస్తావించిరి.
 " క" కారము సృష్టికి" మ" కారము పోషణకు ప్రతీకలుగా గుర్తిస్తారు.కామాక్షి విలాసము అను గ్రంధము ప్రకారము అమ్మ శక్తిని మన్మథుని యందు ఆవహింపచేస్తుందట.   ..ఇతిహాసకథల ప్రకారము అమ్మ భీకర రూపముతో రాత్రులందు నగరసంచారము చేయుచుండెడిదని,ప్రజలు భయభ్రాంతులయ్యేవారని ,ఆ సమయమున ఆదిశంకరాచార్యుల వారు గర్భగుడికి ఎదురుగా శ్రీచక్రమును ప్రతిష్ఠించారట.రాత్రులందు నగరసంచారమును ఆపివేయమని వేడుకున్నారట.అప్పటీనుండి అమ్మవారి ఉత్సవ సమయములలో ఆదిశంకరులవారి అనుమతితోనే ఊరేగింపు జరుగుతుందట.భక్త పరాధీనత అంటే ఇదేనేమో.
  మరొక ప్రచారములోనున్న ఆనందిలభట్టు కథ.వారు నిరంతరము అమ్మధ్యాన సమాధిలో రాకాశశిబింబమును దర్శించుచు తరియించేవారట.ఒక అమావాస్య రోజున ధ్యానభగ్నుడైన ఆనందిల భట్టు ఆదేశరాజుగారితో ఆనాడు పూర్ణిమ తిథి అని చెప్పినాడట.అమ్మ భక్తానుగ్రహమేమో తనచేతి కంకణమును నింగికి విసిరి ఆ తల్లి పసిడి కాంతులను పండించినడట.
    కామాక్షి అమ్మవారు శాంతి సౌభాగ్యములను ప్రసాదిస్తూ పద్మాసనములో ప్రకాశిస్తూ ఉంటుంది.పాశము అంకుశము చెరకువిల్లు పూలగుత్తులు ,పూలగుత్తులచేతి దగ్గర ప్రణవనాదముచేయుచున్న చిలుక గల కామాక్షీ మాత మనలను కరుణించును గాక.

    శ్రీ మాత్రే నమ: . 

LANKAAYAAM SAANKAREEDEVI.

  1.లంకాయాం శాంకరీదేవి-కామాక్షి కంచికాపురి.
    **************************************************

   సంస్కృతములో శ్రీ అంటే భవ్యమైనది.లంక అంటే తేజస్సుగల భూమి లేక ద్వీపము.జలావృత భూభాగము లంక.ఇక్కడ పడిన మాయాసతి మొలభాగము శాంకరీదేవిగా ప్రకాశించుచున్నది.త్రికోణేశ్వరుడు అయ్యవారు.దక్షిణసముద్రతీరముననున్నది.ఇక్కడ పార్వతీదేవి శివలింగము లోపల కొలువై భక్తులకు దర్శనమిస్తారు.స్థపురాణ కథలను బట్టి ఒకసారి ఆదిశేషునిలో వాయుడేవునిలో అహము ప్రవేశించి విపరీత పరిస్థితులకు దారితీసెను.దాని పర్యవసానముగా శివుడు దక్షిణతీరమును కైలాసముగావించ దలచెను.
 
 శివుని ఆన గాన అమ్మవారి మదిలో లంకలో ఒక అపురూప సుందర భవనమును నిర్మింపచేసుకుని  సకుటుంబముగా నివసింపదలచెను.ఆమె ముచ్చట తీర్చుటకు శివుడు విశ్వకర్మచే పరమాద్భుత భవనము నిర్మింపబడేను.గృహప్రవేశ పౌరోహిత్య అవకాశము రావణుని వరించినది.భవనసౌందర్యమునకు మోహితుడైన రావణుడు పూజానంతరము ఆ భవనమును దక్షిణగా కోరెను,(ధర్మముకాదని తెలిసియు)కరుణాంతరంగ అందులకు అంగీకరించి రావణుడు ధర్మము తప్పనంత కాలము ఊండుటకు అంగీకరించెను.సీతాపహరణ సమయమున అమ్మమాటలు పెడచెవిన పెట్టిన రావణుని విడిచి తిరిగి విభీషణ పట్తాభిషేకానంతరము ప్రసన్నురాలై లంకను ప్రవేశించి మనలను పరిపాలిస్తున్న అమ్మ పాదాలను శరణువేడుదాము.

     శ్రీ మాత్రే నమ:

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...