NAH PRAYACHCHAMTI SAUKHYAM-13

నః ప్రయచ్చంతి సౌఖ్యం-13. నః ప్రయచ్చంతిసౌఖ్యం.-07 ************************ " ప్రళయ పయోధి జలే కేశవ ద్రుతవానసి వేదం విహిత వహిత్ర కరిత్రమఖేదం కేశవాద్రుత మీనశరీర జయజగదీశ హరే" చేపరూపమును దాల్చి చేవతో సొమకుని నుంది వేదోధ్ధరణను గావించిన కేశవ నమస్కారములు. భవసారమున పడి బయటకు రాలేని మాపై నీ కరుణాజాలమును విసిరి కడతేర్చు గొప్ప జాలరి వైన శివా ప్రణామములు. నమో ప్రతరణేభ్యో ఉత్తరణేభ్యశ్చవ నమో నమః. స్వామిని దర్శించిన సత్యవ్రతుడెంత ధన్యుడో స్వామికి మత్స్య నైవేద్యమును సమర్పించిన ఆదిపత్త నయనారు అంతే మహనీయుడు. చిన చేపను-పెద్ద చేప,చిన మాయను-పెనుమాయ ఇది స్వాహా-అది స్వాహా అని అంటున్నాడు పెద్దజాలరి మనకు ఒక జాలరి కథ చెబుతూ, విషయవాసనలనే ప్రవాహములో పడి,వల పట్టుకొని యున్నమాయ అనే ఆపదను గుర్తించలేని మనలను రక్షించుస్వామికి నమస్కారములు..శివోహం. భ గవంతుడు-భక్తుడు ఇద్దరు జాలరులే జలము-జలచరము-జాలరి ఈశ్వరచైతన్యమే. " ఓం నిషాదేభ్యశ్చవ నమోనమః". చేపలను సమూహముగ పట్టి చంపునట్టి ని...