తిరువెంబావాయ్-17
**************
శంగనవన్ పాల్ తిశై మగన్ పాల్
ఎంగుం ఇలాదరోర్ ఇంబం నం పాలదన్
కొంగుం కరుణ్ కుళలి నందమ్మాఇ కోదాట్టి
ఇంగనం ఇల్లంగళ్ ఓరుం ఎళుంది అరుళి
శంగమల పొట్పాదం తందరళుం సేవగనై
అంగణ్ అరసై అడియోగళ్ కారమాదై
నంగళ్ పెరుమానై పాడి నలంతి కళల్
పంగయపూం పునల్ పాయిందాడేలోరెంబావాయ్.
అరుణగిరిస్వామియే పోట్రి
**********************
ఓ చెలి,
ఆడేలో రెంబావాయ్-నీవు మేల్కొని వస్తే కేరింతలు కొడుతు ఆడుకుందాము.
ఎక్కడ ఆడుకుందాము అంటే,
పంగయు పూం పునల్-పద్మములు వికసించి ప్రకాశించుచున్న మడుగులో,
పునల్ పాయింద్-మడులోనికి ప్రవేశించి,
కేరింతలతో ఆడుకుందాము.
ఆ వికసిత పద్మములు దేనికి సంకేతము?
జ్ఞాన తపోధములు. అంతే కాదు అవి మనందరిని పాలించుచున్న స్వామి నేత్రములు. మన స్వామి శెన్ కణ్-చెన్ను కన్నులు-అందమైన కన్నులు కల స్వామి.పుండరీకాక్షుడు.
అంతే కాదు-స్వామి పాదములు కూడ
శంగమలై పొట్పాదము-శెణ్ కమలై-అందమైన కమలముల వంటి పాదపద్మములు. రా చెలి స్వామిని కీర్తిద్దాము.ఏ విధముగా అంటే,
అవన్ పాల్-మన రక్షకుడు,తన పుండరీక నేత్రములతో కరుణామృతమును వర్షించుచు మనలను రక్షించుచున్నాడు.
అంతే కాక స్వామి మనలనే కాదు,
తిశై ముగన్-నాలుగు దిశలను,దిక్కులన్నింటిని కూడ పాలించుచున్నాడు.
మనలను-దిక్కులనే పాలించుట కాదు సుమా!
స్వామి దేవర్గళ్ పాల్-ముక్కోటి దేవతలకు కూడ రక్షకుడు.
మడుగులో ఆడేటటప్పుడు స్వామిని,
నంగల్-మా అందరి
పెరుమానె-సంరక్షకుడా అంటు,
నలంతి కళల్-పరమ సంతోషముతో కీర్తిద్దాము.
దానికి ఒక కారణమున్నది.
స్వామి,
తందరుళం-తనకు తానుగా మనమీది అవ్యాజ దయతో,మనము సేవించుకొనుటకు తన,
సంగమలర్ పొట్పాదం-అతి సుందరములు,ఆర్తిని తొలగించునవి అగు పాదములను మనము సేవించుటకు అనుగ్రహించుచున్నాడు.
మనము ఎంతటి భాగ్యవంతులమో చెలి.
ఎందులకంటే మనపై,
స్వామి నేత్రములు కరుణామృతమును వర్షించుచున్నవి.
మధుర మకరందమును వెదజల్లుచున్నవి.
స్వామి కరుణ అసంభవములను సైతము సంభవములుగా మార్చుచున్నది.
కనుకనే కద చెలి,అంగణ్ అరసై-
బ్రహ్మ-విష్ణు సైతము కనుగొనలేని స్వామి పాదపద్మములు మనము సేవించు కొనుటకు అనుగ్రహించుచున్నవి. ఈ మడుగులో మునిగి స్వామి పాదసేవనము చేసుకుంటు,సంకీర్తిస్తు తరించుదాము చెలి.
అంబే శివే తిరువడిగలే శరణం.