RISHI UPAMANYU KRUTA ARTHANAAREESVARA ASHTAKAMU.
అర్థనారీశ్వర అష్టకము.ఋషి ఉపమన్యు కృతము. ***************************************** 1.నల్లని మొయిలుకాంతి నాతల్లి కచము ఎర్రని మెరుపు కాంతి శివ జటాజూటము గిరినేలు నా తల్లి-ఉర్వినేలు నా తండ్రి అర్థనారీశ్వరమై నన్ను ఆశీర్వదించు. 2.రత్నకుండల కాంతితో అమ్మ కర్ణములు సర్పభూషణ కాంతితో స్వామి కర్ణములు శివ నామము ప్రీతి-శివా నామము ప్రీతి అర్థనారీశ్వరమై నన్ను ఆశీర్వదించు. 3.మందార మాలలతో మా తల్లి గళము కపాలమాలలతో స్వామి మంగళము దివ్య వస్త్రము దాల్చి-దిక్కులను దాల్చి అర్థ నారీశ్వరమై నన్ను ఆశీర్వదించు. 4.పద్మార్చనతో నున్నది మాతల్లి పాదము సర్పసేవితమైన సాంబశివ పాదము చంద్ర ప్రకాశముతో-చంద్రాభరణముతో అర్థనారీశ్వరమై నన్ను ఆశీర్వదించు. 5.అద్భుత ప్రదర్శనము మా తల్లి లాస్యము ఆసన్న ప్రళయము మా తండ్రి తాండవము సరిసంఖ్య కనులతో-బేసి కన్నులతో అర్థనారీశ్వరమై నన్ను ఆశీర్వదించు. 6.నీలి కలువల కాంతి అమ్మ నయనములు వికసిత కలువలు మా అయ్య నేత్రములు జగ...