Monday, July 12, 2021

0005

 


 ధ్యాయేత్  ఈప్సిత సిధ్ధయేత్-05

 ******************************


 పార్కులో నేను-నా స్నేహితురాలు-వాళ్ల అమ్మగారు బెంచీమీద కూర్చుని ఉన్నాము.


  బయట జనించిన సందేహము లోనికి పోయి పరిష్కారమును చూపనంటుంది.లోపలనున్న చైతన్యము బయటకు వచ్చి (నన్ను )సమాధానపరచుటకు రానంటున్నది.


    హెచ్చుతగ్గుల ఇంద్రియముల గారడీల గురించి పెద్దవారు-అనుభవజ్ఞులైన ఆంటీని అడిగి నన్ను నేను సమాధానపరచుకుందా మనుకుంటు,


   మౌనాన్ని భంగము చేస్తు మనసు విప్పేసాను.


     ఫక్కున నవ్వింది  నా స్నేగితురాలు.పురాతన భావముల నా చెలి దర్శనశక్తి-శ్రవణ సక్తి అంటు చొప్పదంటు ప్రశ్నలను చొప్పిస్తు,నువ్వు తికమకపడుతు అమ్మను తికమక పడుతున్నావు అంది పరిహాసముగా.


  ముమ్మాటికి నమ్మనుగాక నమ్మను.


  దర్శనశక్తి-అన్న నీ ప్రశ్నకు సమాధానమును కెమెరా అను వస్తువుతో ఎప్పుడో సృష్టించబడినది.అది దృశ్యమును చూస్తుంది తన తెరపై బంధించి ఉంచుతుంది.అదియును నీవు కోరుకొన్న విధానములో.


   శబ్దశక్తి అంటావా తేప్ రికార్డర్.నువ్వు చెప్పిన శబ్దమును వింటుంది.తనలో భద్రపరచుకుంటుంది.


  ఎ.సి-హీటర్ అనే యంత్రములు నీ శరీరమునకు కావలిసిన నీకు నచ్చిన-నువ్వు మెచ్చిన స్పర్శను అందిస్తూనే ఉన్నాయిగా.


   మిగతావాటి పనికూడా అంతే అంది అతిశయముగా.


   నచ్చచెప్పుకోలేని-పూర్తిగా నచ్చని సమాధానముతో నేను ఆంటీ వైపు అదోమాదిరిగా చూసాను.కుదురులేని సమాధానమునకు నుదురు చిట్లించుకొని అవుననలేని/కాదనలేని తనముతో.. కొంతసేపు ఆగి,


    తననుతాను సంబాళించుకుని,

 చూడమ్మా.అంటూ, ఒక నాణెమును తీసి చూపుతు ,


    ఏ విధముగా నాణెము రెండు వైపుల రెండు విభిన్న ముద్రలను కలిగియుందో,


  అదే విధముగా మనము చర్చించుకుంటున్న విషయమును ,

 యాంత్రిక పరముగా పరిగణిస్తే ఒక సమాధానము,

 ఇంద్రియ పరముగా పరిగణిస్తే వేరొక సమాధానమును అన్వయించుకోవచ్చును.


 .......


 యాంత్రిక పరముగా నీ స్నేహితురాలు చెప్పినది సత్యమే అయినప్పటికిని,వాటిలో విద్యుత్తు/బాటరీ అనే అంతర్లీనశక్తి సహకరిస్తున్నంతవరకే కదా.

 

విస్తుబోయి చూస్తున్నది నా స్నేహితురాలు.

   అంతర్లీనసక్తి సహాయ నిరాకరణ చేస్తే అవి కీలుబొమ్మలేకదా.

  గంభీరముగా అంతే మనము నాణెము ఒకవైపును మాత్రమే చూస్తున్నాము కాని,

 మరొక వైపున దాగిన చిత్రమును గమనించుటలేదు.


  కెమెరా చిత్రమును చూస్తుంది.తన తెరపై బంధిస్తుంది.మనము కనుక తీసివేయమంటే వెంటనే తొలగిస్తుంది.


  ఎందుకంటే దానికి ఆ చిత్రముపై ఎటువంటి రాగద్వేషములు లేవు.దాని గుణదోషములతో అసలే పనిలేదు.


  శ్రవణశక్తియును అంతే.దానికి శబ్దము శ్రాయమా/కీచుగా ఉందా/బొంగురా 

 స్తుతిస్తున్నదా/ద్వేషిస్తున్నదా మొదలగు వాటితో సంబంధములేదు.తొలగించు అనగానే వెంటనే అమలుపరుస్తుంది.


   కాని మనము చూస్తున్నదానిని/వింటున్నదాని అదే విధముగా ఏ వికారమును-విషాదమును పొందకుండా తీసివేయగలమా?


   అరిషడ్వర్గములు మనలను ఆడిస్తూ,వాటి గుణదోషములను గుర్తుచేస్తూ,మనచే మోయలేనిబరువును మోయిస్తుంటుంది.తలచుకొని తలచుకొని తలక్రిందులు చేస్తుంటుంది.

 మనలోని ఇంద్రియములు మనలను కప్పగంతులేస్తూ  తప్పుదారిపట్టిస్తున్నాయా...


 యంత్రములు గుణదోషములతో ముడిపడ్

అక యుంటే-ఇంద్రియములు వాటిని విడలేక ంబుధ్ధిమాటను వినక నేను మనసు చెప్పినట్లు మోయవలసిన పనిలేని దానిని మోస్తున్నానా  అంటూ ఆలోచనలో పడ్డాను.దానిని మొస్తూ వారితో కలిసి, ఇంటికి బయలుదేరిన నన్ను,మనలను సర్వేశ్వరు అనుగ్రహించుగాక.


  సర్వం పరమేశ్వర పాదారవిందార్పణమస్తు.


   కరుణ కొనసాగుతుంది.


    


TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...