SAUNDARYA LAHARI-FALASRUTI

సౌందర్య లహరి-ఫలశృతి-108 పరమపావనమైన నీ పాదరజకణము పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము చెల్లియో-చెల్లకో-తెలిసియో-తె లియకో, దొర్లిన అక్షర లోపములను-పద, పాదలోపములను అమ్మవని నీతో నేనాడిన బొమ్మలాటలను భావ లోపములను, లెక్కలేని అపరాథములను కమ్మనైన కరుణతో, క్షమియించవమ్మా కమ్మనైన ఫలములతో, కటాక్షించవమ్మా నీవున్నావని అన్నా-లేవన్నా,నిన్ను గుర్తించలేకున్నా ఆర్ద్రత నిండిన మనసుతో" అమ్మా" అని పిలువగనే అర్హత ఉన్నను-లేకున్నను-అసలేమి కాము అనక, చిన్న పిల్లలమనుకొని నీ ఒడిలో కూర్చోనీయమ్మా సకలలోకరక్షిణి-శరణము నీవేనమ్మా,మా మానస విహారి-మహా సౌందర్య లహరి. ప్రియ మిత్రులారా! శ్రీమాత ఆశీర్వచనములతో-శ్రీమాతాస్వరూపులైన మీ అందరి ఆదరణతో-ఆలంబనతో ఈ రోజు 108 వ భాగమైన స్తోత్రఫలశృతిని మీముందు ఉంచగలుగుతున్నాను.అ తల్లి సంకల్పిత జ్ఞానయజ్ఞములోని విశేషములన్నియు తల్లి పలికించినవే.దొర్లిన దోషములకు నా అజ్ఞానము-అహంకారము కారణములు.క్షంతవ్యురాలను.పరమేశ్వరి ప్...