Saturday, April 28, 2018

SAUNDARYA LAHARI-FALASRUTI

 సౌందర్య లహరి-ఫలశృతి-108

 పరమపావనమైన  నీ పాదరజకణము
 పతిత పాలకమైన  పరమాత్మ స్వరూపము

 చెల్లియో-చెల్లకో-తెలిసియో-తెలియకో, దొర్లిన
 అక్షర లోపములను-పద, పాదలోపములను

 అమ్మవని నీతో నేనాడిన బొమ్మలాటలను
 భావ లోపములను,  లెక్కలేని అపరాథములను

 కమ్మనైన కరుణతో, క్షమియించవమ్మా
 కమ్మనైన ఫలములతో, కటాక్షించవమ్మా

 నీవున్నావని అన్నా-లేవన్నా,నిన్ను గుర్తించలేకున్నా
 ఆర్ద్రత నిండిన మనసుతో" అమ్మా" అని పిలువగనే

 అర్హత ఉన్నను-లేకున్నను-అసలేమి కాము అనక,
 చిన్న పిల్లలమనుకొని నీ ఒడిలో కూర్చోనీయమ్మా

 సకలలోకరక్షిణి-శరణము నీవేనమ్మా,మా
 మానస విహారి-మహా సౌందర్య లహరి.


 ప్రియ మిత్రులారా!

  శ్రీమాత ఆశీర్వచనములతో-శ్రీమాతాస్వరూపులైన  మీ అందరి ఆదరణతో-ఆలంబనతో ఈ రోజు 108 వ భాగమైన  స్తోత్రఫలశృతిని మీముందు  ఉంచగలుగుతున్నాను.అ తల్లి సంకల్పిత జ్ఞానయజ్ఞములోని విశేషములన్నియు తల్లి పలికించినవే.దొర్లిన దోషములకు నా అజ్ఞానము-అహంకారము కారణములు.క్షంతవ్యురాలను.పరమేశ్వరి ప్రసాదమైన ఈ సౌందర్యలహరి మనందరి మనసులలో సౌందర్య కెరటములను ఉవ్వెత్తుగా ఎగురవైచి తల్లి ముఖారవిందమను జాబిలిని వీక్షించుచుండునట్లు చేయునుగాక.చల్లని తన అమృతకిరణములతో మనలను కంటికి రెప్పయై ఆ కరుణామయి కాపాడును గాక.

  చివరికి ప్రస్తావించుచున్నను ఇది చిన్న విషయము కాదు.ఈ పవిత్ర యజ్ఞవాటిక నిర్వాహకులు-సభ్యులు -మిత్రులు పెద్దమనసుతో నన్ను అనుమతించినందులకు-నా భావములను ప్రోత్సహించుచున్నందులకు శతకోటి వందనములుమరియు ధన్యవాదములు.

     స్వస్తి-శుభం భూయాత్.

    సోదరి-నిమ్మగడ్డ సుబ్బలక్ష్మి.


No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...