Sunday, April 14, 2024

SVAMINI-YOGINI PARICHAYAMU


  

  చేతనులు ప్రపంచముతో అనుబంధమునేర్పరచుకుంటే మోహము.పరమేశ్వరితో అనుబంధమేర్పరచుకుంటే మోక్షము.కనుకనే,

 "మనసేవ మనుష్యాణాం కారణం బంధ-మోక్షకం" అన్నారు పెద్దలు.

 శ్రీదేవి ఖడ్గమాలలో తొమ్మిది ఆవరనలు ఉన్నాయి.

 అంచలంచలు లేనిమోక్షము చాలా కష్టము కనుక సాధకుడు అణిమ శక్తితో తన పయనమును ప్రారంభించి బిందువునకు చేరవలసి ఉంటుంది.

 ఇది స్థూలము నుండి సూక్ష్మ దిశగా పయనము.

 కారణము,

 బిందువు త్రికోణముగా తన విస్తరణను ప్రారంభించి త్రైలోక్య మోహన చక్రము వరకు విస్తరించి హద్దులను ఏఋపరచినది.

  తొమ్మిది విభాగములు ఒక్కొక్కచక్రేశ్వరి కొంతమంది యోగినులతో/సహాయక శక్తులతో నిండియుంటుంది.

 ఆనిర్ణీత చక్ర ప్రాంతమునకు అధికారిణి పరిపాలిని చక్రేశ్వరి.ఆమెను స్వామిని అనికూడా అంటారు.పరమేశ్వరి అంశయే స్వామిని.భగవతి.

 భగవతి/స్వామిని అధీనములో మరికొన్ని శక్తులు సాధకుని స్వామిని దగ్గరకు చేర్చుటకు సిద్ధముచేసి సహాయపడుతుంటాయి.

  మనకు అర్థమయ్యే విధముగా చెప్పుకోవాలంటే స్వామిని దగ్గరకు /భగవంతుని దగ్గరకు చేర్చగల "గురువులు" ఈ యోగినులు.

 అహం బ్రహ్మాస్మి అన్న విషయము అర్థముకావాలంటే జగమ్మిథ్య అన్నవిషయమును గ్రహించగలగాలి.

 గు కారో అంధకారస్య రు కారో తన్నివారనం.

 యోగినులు గురువులై చక్ర ఆవరనమును చైతన్యపరుస్తూ చక్రేశ్వరిని సైతము మూర్తీభవించిన చైతన్యముగా ప్రకాశింపచేస్తాయి.

1. మొదటి ఆవరనములోని గురువులు ప్రకట యోగినులు.చక్రేశ్వరి త్రైలోక్య మోహన.

 పేరులోనే ఉంది ఈ ఆవరనము స్థూలమునకు-ద్వంద్వములకు సంబంధించినది.సాధకుడు ఎటువంటి ప్రలోభములకు నవరసములకు,అరిషడ్వర్గములకు,మానవ వికారములకు బానిస కాని నాడే రెండవ చక్రములోనికి ప్రవేశించగలడు.

 

 


 2. రెండవ ఆవరనము సర్వ ఆశా పరిపూరకము.జ్ఞాన సంకేతము.పద్మపురేకుల వికసనము సంకేతము.ఇక్కడి గురువులు మానసికస్థితిని తెలియచేస్తూ గుప్త విద్యతో ప్రకాశిస్తుంటారు.చక్రేశ్వరి సర్వాశా పరిపూరక.ఆవిడ అనుమతితోనే సాధకుడు మూడవ ఆవరణములోనికి ప్రవేశించగలడు.

3.మూడవ ఆవరణమును సర్వ సంక్షోభణ చక్రము అంటారు.

 సంక్షోభణము అనగా స్పందన.ఈచక్రములోని యోగినులు/గురువులు సాధకుని మనసులో ద్వంద్వ ప్రకృతి గురించి ఆలోచించేటట్లు చేస్తారు.వారి అనుగ్రహముతోనే సాధకుడు చక్రేశ్వరికి నమస్కరించి నాల్గవ ఆవరనము లోనికి ప్రవేశించగలుతాడు.సర్వ ద్వంద్వక్షయంకరీ నమో నమః

4.ఇప్పటివరకు మనము మూడు ఊహా చరస్రాకార రేఖలు,16 పద్మదళములు,ఎనిమిది పద్మదలములున్న మూడు ప్రాకారములను దాటి,

14 త్రికోణములున్న నాల్గవ ఆవరణములోనికి ప్రవేశిస్తున్నాము.ఇక్కడ నాడీమండలము/ప్రాణసక్తి యైన కుండలిని ఏ విధముగా పనిచేస్తుందో సాధకుడు గురువులైన యోగినుల ద్వారా తెలుసుకుని,తన శరీరమును అనుగుణముగా సంసిద్ధము చేసుకుని చక్రేశ్వరి అనుగ్రహముతో ఐదవ ఆవరనములోనికి ప్రవేశిస్తాడు.

5.ఐదవ ఆవరణములో బయటవైపునకు పది త్రికోణములు పది వాయువులను సూచిస్తూ ఉంటాయి.

 ఐదు ప్రధాన వాయువులు.మరొక ఐదు ఉపవాయువులు.మన శరీరము తన విధులను సవ్యముగా చేసుకోవాలంటే అనగా

 గాలి పీల్చటము,కనురెప్పవేయగలగటము,ఆవులింత,విసర్జనము మొదలగు పనులకు చైతన్యస్వరూపమైన పది శక్తులే ఆధారము.

 6.సాధకుడు ఆరవ ఆవరనము యైన సర్వరక్షాకర చక్రములోని ప్రవేశించి అక్కడనున్న పదిమంది యోగినుల ద్వార అగ్నితత్త్వమును తద్వారా తనలో జరుగుతున్న జీర్ణవ్యవస్థను తెలుసుకోగలుతాడు.

 7 ఏడవ ఆవరనము సర్వరోగహరము.ఇక్కడి శక్తులు ఎనిమిది కోణముల రూపములో సంకేతించబడినారు.వీరినే,

 శీతోష్ణములుగను,సుఖదుఃఖములుగను,త్రిగుణములుగను ఇచ్ఛ గను  భావిస్తారు.

 8.ఇప్పుడు సాధకుడు తన శరీరములోని పాపిట స్థానమును యోగినుల,చక్రేశ్వరి అనుగ్రహముతో చేరుకున్నాడు.ఈ ఎనిమిదవ ఆవరనమును సర్వ సిద్ధిప్రద  చక్రము అంటారు.ఇక్కడ పంచతన్మాత్రలు,మనసు,రాగద్వేషములు ఎనిమిది త్రికోణములుగా సంకేతించబడినవి.ఇక్కడి గురువులైన యోగినులు అతిరహస్యమైన అమ్మ తత్త్వమును సాధకునికి అనుభవములోని తెస్తూ,తొమ్మిదవ ప్రాకారమైన ,

9.బిందు స్వరూపమైన,ఏకాత్మకమైన,అవ్యక్త మహత్తును పరిచయము చేస్తారు.

 ఇంతకంటే కావలిసినది ఏముంది? అక్కడికిచేరాలంటే మనము భవబంధములనే మూటలను విడిచివేయగలగాలి.అరిషడ్వరగములను అల్లంతదూరములో ఉంచాలి.యోగినుల అనుగ్రహమునకు పాత్రులమై,చక్రేశ్వరి,మహా భట్టారికా పాదములను విడువకుండా పట్తుకోగలగాలి.

  శ్రీ మాత్రే నమః.

 


KHADGAMALA-PARICHAYAMU


 


 " తాదృశం ఖడ్గమాప్నోతి యేన హస్తస్థితేనవై

   అష్టాదశ మహాద్వీపం సమ్రాడ్భోక్తా భవిష్యతి"


   పరమేశ్వరుడు-పరమేశ్వరికి వివరించినది ఈ "ఖడ్గమాలా స్తోత్రము"

 ఖడ్గము అంటేస్తుతివచనములు.ఖడ్గమాల అంటే బిందు-తికోణములుగా ప్రకటింపబడిన పరమేశ్వ-పరమేశ్వరి ప్రస్తుత వచనముల హారము.

 మరొక అన్వయము ప్రకారము చేతనుని ఆవరించియున్న అమంగళములను/అజ్ఞానమును తొలగించి,స్వస్వరూపమును తెలియచేయు సాధనము.

 ఒకే తత్త్వమును వివరించు రెండు విధములైన అనుగ్రహములు 

1.శ్రీ చక్రము

2.దేవీ ఖడ్గమాల

 ఒకటి రేఖా యంత్రము.రెండవది మాలా మంత్రము.మహా మాలా మంత్రము.

 స్థూలముగామనచుట్తు-సూక్ష్మముగా లోగుట్టు తానే నిండిన చైతన్యమే ఆ దేవీ.

 స్తోత్ర సంకల్పములో "మమఖడ్గ సిద్ధ్యర్థే"అని సాధకుడు తల్లి అనుగ్రహమనే ఆయుధమును సాధనముగా అభ్యర్థిస్తూ,మూలాధారము నుండి బిందువు వరకు ఒక్కొక్క మాయ అనే మూటను విడిచిపెడుతూ తల్లి ఒడిని చేరగలుగుతాడు.

 ఈ పయనములో తొమ్మిది ఆవరణములను దాటవలసి వస్తుంది.

 ప్రతి ఆవరణములోను చక్రేశ్వరి ఇతర సహాయక శక్తులతో సాధకునికి సహాయపడుతుంటుంది.

 మొదటి మూడు చక్రములపయనమునందు సాధకుడు ద్వంద్వభావముతోనే ఉంటాడు.నేను వేరు-నీవు వేరు,

 ఈ ఉపాధియే నేను అని భ్రమపడుతూ,దానిలో దాగిన నిత్యచైతన్యమును విస్మరించి యుంటాడు.

  సాధకునికి కనువిప్పు కలిగించుటకై తల్లి అనుగ్రహముతో మనము ముందు ఈ తొమ్మిది ఆవరనములు మన శరీరములో ఏ విధముగానున్నాయో,మనలను ఏ విధముగా శక్తివంతులను చేస్తున్నాయో తెలుసుకునే ప్రయత్నము చేద్దాము.

 అణిమాడిభిరావృతాం అహమిత్యేవ విభావయేత్ భవాని

 హ్రీంకారాసన గర్భితానలశిఖగా ప్రజ్వరిల్లుతున్న పరమేశ్వరి తన తేజస్సును వివిధ కిరణములుగా /సహాయక శక్తులుగానిర్ణీత ప్రదేశములలో నుంచి,దిశానిర్దేశముచేయిస్తున్నది.సంకోచ-వ్యాకోచములు రెండును సమయపాలనలే.

 1.మొదటి చక్రము స్థూలజగత్తులోని చర్మచక్షువులు గమనించగల అష్టసిద్ధులు-సప్త మాతృకలు-ముద్రా శక్తులను కూడి ఉంటుంది.

  హద్దును సూచించు విధముగా చతురస్రాకారములో ఉంటుంది.అవియే మనలో దాగిన నవరసములు,అరిషడ్వర్గములు చక్రములు.

 2.మొదటి ఆవరణములోని శక్తులు సాధకుడు రెండవ ఆవరణము లోనికి ప్రవేశించుటకు సహాయపడతాయి.ఇక్కడ పంచభూతములు-పంచేంద్రియములు-మనస్సును పనిచేస్తుంటాయి.

3.మూడవ ఆవరనములో మన మాట-నడక-విసర్జనశక్తి-ఆదానము-ప్రదానము,ఆనందము,ఉపేక్షతో కర్మేంద్రియములు పనిచేస్తుంతాయి

4 నాల్గవ ఆవరనములో ప్రాణసక్తి యైన కుండలిని ఉంటుంది.నాడీ వ్యవస్థను వివరిస్తుంది 

5.ఐదవ ఆవరనము పదివాయువుల ప్రాధాన్యమును వివరిస్తుంది.ఈ పదివాయువులు పనిచేయకుంటే జీవ వ్యవస్థ శూన్యమై పోతుంది.

6.ఆరవ ఆవరనము వివిధ అగ్నులతో నిండి జీర్ణప్రక్రియను నిర్వహిస్తుంటుంది.

7 .ఏడవ ఆవరనము శీతోష్ణ సుఖదుఃఖములతో పాటుగా త్రిగుణాత్మకమై ఉంటుంది.

8.ఎనిమిదవ ఆవరణము పంచతన్మాత్ర-రాగద్వేషములను కలిగియుంటుంది.

9.అవ్యక్తము-మహత్తుతో నిండి యుంటుంది.

 ఈ 

 

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...