Thursday, November 16, 2023

KADAA TVAAMPASYAEYAM-05




 





  కదా  త్వాం పశ్యేయం-05

  *******************



   " జిహ్వ చిత్త శిరోంఘ్రి హస్త నయన శ్రోతైః అహం ప్రార్థితం



   నమామిభగవత్పాదం శంకరం లోక శంకరం."



 " మనస్తే  పాదాబ్జే

   నివసతు వచః స్తోత్ర ఫణితౌ 
   కరౌ చాభ్యర్చాయాం 

   శ్రుతిరపి కథాకర్ణనా విధౌ

   తవ ధ్యానే బుద్ధిః

    నయన యుగళే మూర్తి విభవం"

   మనమనోఫలకముపై ముద్రించుకుని ఈ నాటి బిల్వార్చనను ప్రారంభిద్దాము.

   మిత్రులారా శంకరయ్య లా పరమాత్మను ,



  (దూషిస్తూ బిల్వార్చన అంటుందేమిటి అన్న అనుమానము మీలో కలుగ వచ్చును.న-ఇతి,
 ఇది కాదు ఇదికాదు అన్న తత్త్వమును అర్థము చేసుకునే ప్రహసనములో అజ్ఞానినా మయా దోషాన్ అశేషాన్ అయినప్పటికిని ఆదిదేవుడు నా అపరాధములను మన్నించి,తన అక్కున చేర్చుకుంటాడన్న ఆశతో,) ఇంక థలోనికి వస్తే,



  వాడు( నా)పరవశుదే  అనుకుంటూ నడుస్తున్నాడు శంకరయ్య.

  వీడు (నా)పర- వశుడే అనుకుంటూ అనుసరిస్తున్నాడు శివయ్య.

  వారిరువురి పరవశమునకు భంగము కలిగిస్తూ,



  హరహర మహాదేవ్-హరహర మహాదేవ్

  శంభో శంకర-శంభో శంకర

  పాహిమాం-రక్షమాం అంటూ,

 స్తోత్ర వాక్కులు వారిని చుట్టుముట్టాయి.

 

   అంటే మనమిప్పుడున్నది ఆలయ ప్రాంగణములోనా,

 ఆలోచించకుండా వచ్చేసాను అనుకున్నాడు శంకరయ్య.

 ఆలోచించే తెచ్చాను అనుకున్నాడు శివయ్య.

  

   కిక్కిరిసి పోయింది ప్రాంగణము.ఇసుకవేస్తే రాలనంత జనం.మహాశివరాత్రి సందర్భముగా సాంస్కృతిక కార్యక్రమమట.

  ముందుకు పోలేడు-వెనుకకు మరలలేడు.చేసేది లేక వేదికవైపు చూస్తుండిపోయాడు శంకరయ్య.

 " కియద్వా  దాక్షిణ్యం  తవ 

     శివ

   మదాశచ కియతీ"

 అని వ్రాసిఉంది.

  నీ దయ పెద్దది-నా కోరిక అతి చిన్నది అని దాని అర్థమట. శంకరయ్య పక్కననున్న ఆయన ఎవరికో చెబుతున్నాడు.

 ఇటు శివయ్య తదేకంగా దానినే చూస్తున్నాడు తన్మయత్వం తో.

   ఇంతలో తెరను పక్కకు జరిపారు.

 సాక్షాత్తు శివస్వరూపముగా ఒక వ్యక్తి చిరునవ్వుతో నిలబడియున్నాడు.

  తన్మే మనః శివ సంకల్పమస్తు.

 చుట్టుముట్టేసారు ఎందరో అతనిని,గుట్టుగా పట్టుకోవాలని,తమమనసులలో గట్టిగా చుట్టుకోవాలని.

   తెర వెనుక నుండి

"త్వయైవ క్షంతవ్యం శివ మత్ అపరాథ సకలం" అంటూ అర్తిగా వినిపిస్తోంది.

  తమ పక్క నున్నవారిని జరుపుకుంటూ,

 మమ చేతః పుష్కర లక్షితో భవతి అంటూ,

 ఒక పళ్ళెం నిండా  నీళ్ళతో,దానిలో ఒకపద్మముతో శివుని దగ్గరకు వెళుతూ,  తన హృదయముగా భావించి, వచ్చి ఆ పద్మమునందు సుఖాసీనతనొందుము అను ప్రార్థిస్తున్నాడు. .

 ఇంతలో మరొకభక్తుడు,ఎక్కడ అక్కడికి స్వామి వెళ్ళిపోతాడో అనుకుంటూ  ముందుకు వచ్చి,

 "  దుర్గాతిప్రియ దేవ మామక మనో దుర్గే నివాసం కురు "

 స్వామి నాహృదయమును  చలించని గట్టి కోటగా 

 చేసి తెచ్చినాను.నీవు అమ్మతో వచ్చి దానిలో నివసింపుము అని వేడుకుంటున్నాడు తన హృదయముపై గలకోట నమూనాను సంకేతముగా చూపిస్తూ.

 అయోమయముగా చూస్తున్నాడు శంకరయ్య.

 ఆనందముగాచూస్తున్నాడు శివయ్య. 

  ఇంతలో వారిద్దరిని వెనుకకు జరుపుకుంటూ,కదిలే సరస్సు-కదలనికోట రెండు కావు స్వామి నీ స్థానములు.సరసులో నీవుంటే భక్తులను ఎలా చేరుతావు.కాదని కోటలో ఉంటే

భక్తులు నిన్నెలా చేరగలరు."?

 అందులకు బాగా ఆలోచించి నేను నా హృదయమును గుడారముచేసి నీ నివాసమునకై తెచ్చాను.నువ్వెక్కడ ఉండాలంటే అక్కడ ఉండవచ్చును.అక్కడి నుండి మరొక చోటికిసులభముగా పోవచ్చును అంటూ తన గుండెలపై నున్న గుడారపు నమూనాను చూపిస్తూ 

" స్మరారే  మత్ చేతః స్ఫుటపటకుటీం"

 అంటూ అభ్యర్థిస్తోంది ఆదిదేవుని.ఆహ్వానిస్తోంది అంతర్యామిని.

   ఇంతలో గిరిజమాటలకు వంతపాడుతూ,మరొక భక్తుడు నిజమే స్వామి.కాని గుడారములలో నుండి అటు-ఇటుతిరిగే సమయములో మనము ఎవరైనా గృహస్తుల  భిక్షను స్వీకరించాలికదా.ఆ భిక్షాటన సమయములో ఇదిగో అంటూ తన చేతిలో గంతులేస్తున్న ఒక చిన్న కోతిపిల్లను చూపిస్తూ,

 " కపాలిన్  భిక్షో మే హృదయకపిం అత్యంత చపలం" అంటూ ,దానిని గంతులు వేయనీయకుండా ఆపుతూ,స్వామి చేతిలో పెట్టేందుకు తొందరపడుతున్నాడు.

 మహాదేవుడు మహదానందముతో నలుగురిని మార్చి-మార్చి చూస్తున్నాడు.

 ఎవరి మాట వింటాడో-ఎవరిని కాదంటాడో అందరి మనసులలో ఒక్కటే ఉత్కంఠత.

 చూశావా శంకరయ్య.వాడి వేషాలు.అందరిని వశపరచుకుని-అమాయకముగానటిస్తూ..

  ఆగవయ్యా శివయ్యా-మధ్యలో నువ్వొకడివి.

 మాట్లాడుకోవటానికి సమయం-సందర్భం లేవు.

 కాస్సేప్పాగు-మాట్లాడుకోవచ్చులే అన్నాడు అసహనముగా.

 చిదానందరూపా-శివోహం శిబోహం


 డమరుక నాదం మారుమ్రోగుతోంది.

శివయ్యను వెనుకకు తోసేసి ఒక వేటకాడు ముందుకు వచ్చాడు.

 ఓ  ఆదికిరాతక!

 "కరోమి త్వత్పూజాం" అంటూ గుంపుగుంపులు చుట్టుముట్టుతున్నారు.

 వేటగాడిని వెనుకకు నెట్టివేసి,అంబా సమేతముగా దర్శనమిస్తున్నాడు స్వామి.

 " కమర్థందాస్యేహం"అంటూ మరికొన్ని గుంపులు చుట్టుముట్టాయి.

 స్వామి తన దర్శన సౌభాగ్యములను బహుముఖములుచేస్తున్నాడు.

  భక్తులు తమమనో భావములను బహుముఖములుగా సమర్పిస్తున్నారు

 చూస్తూకొందరు-స్తోత్రము చేస్తూ మరికొందరు-ఆహ్వానిస్తూ ఇంకొందరు-ఆశీర్వదించమని ప్రార్థిస్తూ మరికొందరు ......ఒకటే కోలాహలము..

 స్వామి గరళకంఠునిగా దర్శనమిస్తున్నాడు.

    వెంటనే ఒక భక్తుడు 

 కింపక్వ జంబూఫలం అనుకుంటూ బుట్టనిండా నేరేడుపళ్ళతో స్వామిని సమీపిస్తున్నాడు.

  స్వామి ఆశీర్వదిస్తున్నాడు అందరిని.

 తెరను కప్పేశారు నిర్వాహకులు.

  శంకరయ్య మనసులోని తెరలను విప్పేస్తున్నాడు నీలకంఠుడు.

  కదిలేవి కథలు-కదుపుతున్నది కరుణ

  'తన్మై మనః శివ సంకల్పమస్తు

     వాచే మమశివపంచాక్షరస్తు

     మనసే మమ శివభావాత్మ మస్తు".

    పాహిమాం పరమేశ్వరా.

    (ఏక బిల్వం  శివార్పణం) 





  

  











  

  

 


  

  






  

  

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...