ADITYAHRDAYAM-SLOKAM-18

ఆదిత్యహృదయం-శ్లోకము-18 ************************ ప్రార్థన ******* " జయతు జయతు సూర్యం సప్తలోకైకదీపం హిరణ సమిత పాప ద్వేష దుఃఖస్య నాశం అరుణ కిరణ గమ్యం ఆదిం ఆదిత్యమూర్తిం సకలభువనవంద్యం భాస్కరం తం నమామి." పూర్వరంగము *********** "మమయోనిః మహత్బ్రహ్మ తస్మిన్ గర్భం దదామ్యహం సంభవః సర్వభూతానాం-అంటూ , ఇక్కడ యోని శబ్దము మూలకారణముగా అన్వయించుకోవాలి. ఇది స్థూల విశ్వరచనకు మూలకారణము పరమాత్మ. ఆ పరమాత్మ సూక్ష్మముగా , "సర్వద్వారేషు దేహేస్మిన్ ప్రకాశం ఉపజాయతే-ఇది ఉపాధికి సంకేతము అన్న భగవద్గీతా సారమును తెలియచేసిన అగస్త్యభగవానుడు,త్రిగుణముల ప్రభావమును ప్రస్తుత శ్లోకములో వివరిస్తున్నారు. ఒకవిధముగా చెప్పాలంటే పరమాత్మ "విఘ్నేశ్వర " కరుణావిశేషములే ప్రస్తుత శ్లోకము. శ్లోకము ****** " తమోఘ్నాయ-హిమఘ్నాయ-శత్రుఘ్నాయ-అమితాత్మనే కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః" శ్లోక భావమును గ్రహించుటకు సహ...