Posts

Showing posts from March 13, 2021

TIRUVEMBAVAY-10

తిరువెంబావాయ్-10  *****************  పాదాళం ఏళినుంకేళ్ శొర్కళియు పాదమలర్  పోదార్ పునైముడియం ఎల్లా పొరుల్ ముడివే  పేదై ఒరుప్పాల్ తిరుమేని ఒన్రల్లన్  వేదముదల్ విణ్ణోరం మణ్ణుం తుదితాళం  ఓద ఉళవ ఒరుతోళన్ తొండరుళున్  కోదిల్ కులత్తరంతన్ కోయిర్ పిణ్పిళ్ళైగళ్  ఏదవన్ ఊర్ ఏదవన్ పేర్ ఉట్రార్ అయళార్  ఏదవనై పాడుం పరిశేలో రెంబావాయ్.  విశ్వరూపాయ పోట్రి  ***************     తిరు మాణిక్యవాచగరు స్వామిని అరూపా-బహురూపా అంటు సంకీర్తిస్తూ స్వామి మన మీది అనుగ్రహముతో అర్థనారీశ్వరమై-మీనాక్షి-సుందరేశనుగా దర్శన భాగ్యమును ప్రసాదించిన వైనమును మహదానందకారకము.  స్వామి వ్యాపకత్వమును-స్వామి నివాస స్థలమును-స్వామి నామమును-స్వామి కుటుంబమును అపరిమితములు.అనితర సాధ్యములు.కనుకనే చెలులు ఈ విధముగా స్వామి వైభవమును మననము చేసుకొనుచున్నారు.  పాదాళం-పాతాళము,  కిందనున్న ఏడులోకముల,   అతల-సుతల-రసాతల  మొదలగువాటి కింద కిందకు వెళ్ళి వెతికినను,దేనిని? పాదమలర్ శొర్కళియ-స్వామి పాదపద్మములను వెతికినను కనపడలేదు.  అప్పుడు వారు,పోదుల్ పునై పునై-ఇంకా ఇంకా ...