RUDRAASHTAKAMU.

శ్రీ రుద్రాష్టకము.(గోస్వామి తులసిదాస విరచితము) **************************************************** నమస్తే పరబ్రహ్మమీశాన దేవ వేదస్వరూపమైనావు మము బ్రోవ గణాలెన్నో కొలువ గుణాతీత నిన్ను చిదాకాశవాసా నన్ను భజియింపనిమ్ము ............... ఊర్థ్వ ముఖుడైన ఈశానుడు సృష్టి-స్థి-లయ-తిరోధానము-అనుగ్రహము (పుట్టుట-పెరుగుట-లీనమగుట-జగతిని దాచుట-తిరిగిప్రకటించుట) అను ఐదు పనులను నిరంతరముచేయుచు,మనలను అనుగ్రహించుచుండును.ప్రమథ గణములచే కొలువబడు గుణరహితుడైన పరమేశుడు ,భజించుటకు నన్ను అనుగ్రహించును గాక. ఓంకార-నిరాకారములైన దేవ త్రిగుణాలపై నున్న స్థితి నీవుకావ కరమందు శూలంబు కరుణించ రమ్ము సంసారమును దాట నిన్ను భజియింపనిమ్ము. సత్వ-రజ-తమో గుణములను దాటి ఉన్న నాల్గవ స్థితి చిదానందమైన శంభుడు,తనచేతి యందలి శూలముబు కృపాకారిగా మార్చి,సంసారబంధములను తెంపి,భజన అనే నావలో ఒడ్డును చేరుటకు అనుగ్రహించును గాక. చల్లందనమును-తెల్లదనమైన దేవ ఉన్మత్తగంగనుద్ధరించినది నీవు కావ కోటిసూర్య ప్రభాకాంతులను విరజిమ్ము బాలేందుమౌళి నన్ను భజియింప నిమ్ము. ...