Posts

Showing posts from October, 2026

BATUKAMMA-2026

Image
   బతుకమ్మ-2026  బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో  బంగారు గౌరమ్మ ఉయ్యాలో  రాగి తాంబాళం లో ఉయ్యాలో  భోగభాగ్యాలమ్మ ఉయ్యాలో  పసిడి తల్లి తాను ఉయ్యాలో  పసుపుముద్దగ మారి ఉయ్యాలో  గుమ్మడాకు మీద ఉయ్యాలో  గుట్టుగ కూసుంది ఉయ్యాలో 11బ11  మా అక్కలొచ్చారు ఉయ్యాలో  సక్కంగ నవ్వింది ఉయ్యాలో  మా అత్తలొచ్చారు ఉయ్యాలో  సిత్తుగ మెరిసింది ఉయ్యాలో  మా అన్నలొచ్చారు ఉయ్యాలో  పూలన్నీ తెచ్చారు ఉయ్యాలో 11బ11   గుమ్మాడి పువ్వులు ఉయ్యాలో   గునుగు పూవులమ్మ ఉయ్యాలో   తామర పువ్వులు ఉయ్యాలో   తంగేడు పూలమ్మ ఉయ్యాలో   చామంతి వరుసలు ఉయ్యాలో   బంతిపూల సరులు ఉయ్యాలో   బతుకమ్మ మెచ్చంగ ఉయ్యాలో   సీత జడకుచ్చులు ఉయ్యాలో   తీరొక్క పువ్వులు ఉయ్యాలో   పేరిచినారు సూడు ఉయ్యాలో   పులకించిపోయింది ఉయ్యాలో   పూలబుట్టబొమ్మ ఉయ్యాలో 11బ11   చేడెల చేతితో ఉయ్యాలో   చేయి కలిపిందమ్మ ఉయ్యాలో   అడుగులు కదుపుతు ఉయ్యాలో   ఆడిపాడెనమ్మ ఉయ్యాలో   మురిసిపోయిందమ్మ ఉయ్యాలో   ముంగిట సింగిడి ఉయ్య...