BATUKAMMA-2026
బతుకమ్మ-2026
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో
బంగారు గౌరమ్మ ఉయ్యాలో
రాగి తాంబాళం లో ఉయ్యాలో
భోగభాగ్యాలమ్మ ఉయ్యాలో
పసిడి తల్లి తాను ఉయ్యాలో
పసుపుముద్దగ మారి ఉయ్యాలో
గుమ్మడాకు మీద ఉయ్యాలో
గుట్టుగ కూసుంది ఉయ్యాలో 11బ11
మా అక్కలొచ్చారు ఉయ్యాలో
సక్కంగ నవ్వింది ఉయ్యాలో
మా అత్తలొచ్చారు ఉయ్యాలో
సిత్తుగ మెరిసింది ఉయ్యాలో
మా అన్నలొచ్చారు ఉయ్యాలో
పూలన్నీ తెచ్చారు ఉయ్యాలో 11బ11
గుమ్మాడి పువ్వులు ఉయ్యాలో
గునుగు పూవులమ్మ ఉయ్యాలో
తామర పువ్వులు ఉయ్యాలో
తంగేడు పూలమ్మ ఉయ్యాలో
చామంతి వరుసలు ఉయ్యాలో
బంతిపూల సరులు ఉయ్యాలో
బతుకమ్మ మెచ్చంగ ఉయ్యాలో
సీత జడకుచ్చులు ఉయ్యాలో
తీరొక్క పువ్వులు ఉయ్యాలో
పేరిచినారు సూడు ఉయ్యాలో
పులకించిపోయింది ఉయ్యాలో
పూలబుట్టబొమ్మ ఉయ్యాలో 11బ11
చేడెల చేతితో ఉయ్యాలో
చేయి కలిపిందమ్మ ఉయ్యాలో
అడుగులు కదుపుతు ఉయ్యాలో
ఆడిపాడెనమ్మ ఉయ్యాలో
మురిసిపోయిందమ్మ ఉయ్యాలో
ముంగిట సింగిడి ఉయ్యాలో 11బ11
సత్తుపిండి చేరె ఉయ్యాలో
మలీద నేనంటు ఉయ్యాలో
పక్కనే తానంటు ఉయ్యాలో
శిల్పక్క చేరింది ఉయ్యాలో
ఊరువాడ కలిసి ఉయ్యాలో
ఊరేగించగాను ఉయ్యాలో
మళ్లీ వస్తానంటు ఉయ్యాలో
నీళ్ళవాయినాలు ఉయ్యాలో
మళ్ళీ వస్తుందంటు ఉయ్యాలో
నీళ్ళ వాయినాలు ఉయ్యాలో 11బ11
తోడు-నీడ అంటు ఉయ్యాలో
వీడలేను అంటు ఉయ్యాలో
సెలవివ్వమంటూనే ఉయ్యాలో
సెరువులోనికి జారె ఉయ్యాలో
సెరువులోనికి జారె ఉయ్యాలో
సెరువులోనికి జారె ఉయ్యాలో
సెరువులోనికి జారె ఉయ్యాలో.

Comments
Post a Comment