Posts

Showing posts from October 13, 2026

AMBA VANDANAM-04

Image
    అంబ వందనం-04   *************  " కాలాభ్రాభాం కటాక్షై అరికుల భయదాం మౌలి బద్ధేందురేఖాం    శంఖం చక్ర కృపాణం త్రిశిఖమపి కరైః ఉద్వహంతీం త్రినేత్రాం    సింహస్కంధాధిరూఢం త్రిభువనం అఖిలం తేజసాపూరయంతీం    ధ్యాయేత్ దుర్గాం జయాభ్యాం త్రిదశపరివృతాం సేవితాం సిద్ధికామైః"         నల్లనిమేఘము వంటి శరీరకాంతిని కలిగి,శత్రువులకు భయమును కలిగించి కంటిచూపుతో,శంఖము-చక్రము-ఖడ్గము-త్రిసూలమును ఆయుధములుగా ధరించి,నుదుటిపై చంద్రవంకను ధరించి,దేవతలందరిచే సేవింపబడుతూ,త్రినయని  సింహమును అధిష్టించి,ఇష్టకామ్యసిద్ధి ప్రదాయినిగా జయ అను నామముతో,జయజయ ధ్వానములతో ముల్లోకములను తన తేజముతో ప్రకాశింపచేస్తున్న దుర్గామాతను నేను సేవించుచున్నాను.             ఒకసారి గంగాతీరమునందు సకలదేవతలు శరణార్థులై, " నమోదేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః   నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాస్మతాం"         అని ప్రార్థించుచుండగా, " భావనామాత్ర సంతుష్ట హృదయ" యైన భవాని గంగా జలములలో స్నానమాచరించుటకు అటుగా పోవుచు,వారిని చ...