Posts

Showing posts from October 12, 2026

AMBAVANDANAM-02

Image
    అంబ వందనము-02   ***************  " అక్షస్రక్ పరశుం గదేషు కులిశం పద్మం ధనుః కుండికాం    దండం శక్తిం అసించ చర్మ జలజం ఘంటాం సురాభాజనం    శూలం పాశ సుదర్శనేన దధతీం హస్తైః ప్రసన్నాననం    సేవే సైరిభ మర్దినీం ఇహ మహాలక్ష్మీం సరోజస్థితాం.         జపమాల-గొడ్డలి-గద-బాణము-వజ్రాయుధము-తామరపువ్వు-ధనుస్సు-కమండలము-యమదండము-శక్తి అనే ఆయుధము-ఖడ్గము-డాలు-శంఖము-గంట-అమృతకలశము-త్రిశూలము-పాశము-సుదర్శనమును ధరించి,ప్రసన్న వదనముతో,పద్మాసన స్థిత యైన మహాలక్ష్మిని సేవించుచున్నాము.(మహిషాసురిని మర్దించిన) క్షీణే పుణ్యం...పుణ్యము యొక్క హెచ్చు-తగ్గుల లెక్కలే కూడికల-తీసివేతలే జీవుల కర్మఫలితములు అని తెలియచేయు దివ్యచరితములే దేవికథలు-కథనములు.సూత్రధారియైన ఆ జగన్మాత ఎన్నో పాత్రలను/ఎందరో పాత్రధారులను కల్పించి కామితార్థములను అనుగ్రహిస్తుంది. త్రిమూర్తులు మాత్రమే కాదు శ్రీ లలితా సహస్ర రహస్యనామ స్తోత్రములో నుతింపబడినట్లు,తల్లి "దేవర్షి గణ సంఘాత స్తూయమానాత్మ వైభవా" ఆ పరాత్పరి అనిశము, బ్రహ్మాదులను దేవతల చేతను,నారదాది దేవర్షుల చేతను,వశిష్టాది ఋషుల చేతను ఆది...