Posts

Showing posts from December 19, 2025

TIRUVEMBAVAY-05

Image
    తిరువెంబావాయ్-05   **************  "కృపాసముద్రం సుముఖం త్రినేత్రం   జటాధరం పార్వతీ వామభాగం   సదాశివం రుద్రం అనంతరూపం   చిదంబరేశం హృది భావయామి."  సందర్భము  **********   ద్రవిడ సంప్రదాయము  వ్రతములో మనము దర్శిస్తున్న కన్యలను ఆచార్యులుగా భావిస్తుంది.అమోఘ తపసంపన్నుల వారి స్పర్శ ఆశీర్వాదముగా భావిస్తారు కనుక నిన్నటి పాశురములో నీవే వచ్చి మమ్ములను లెక్కించు అన్నారు.తిత్తిత్తు పేశవాయ్ అన్నది వాచ్యార్థము.దాగిన సత్యము అంతరార్థము పరమార్థమే.   ప్రస్తుత పాశురములో నిదురిస్తున్న చెలిని,ఏళాకుళలి-సుగంధభరిత కేశపాశము కలదానా అని ప్రస్తుతిస్తు,పడరీ మోసగత్తెవి,పొక్కంగళే పేశు-నీవు మాయమాటలు చెప్పావు అని ఆక్షేపిస్తున్నారు.   పాశురము   *******  మాలరియ నాం ముగనుం కాణా మాలై ఇనైనాం  పోలరివోం ఎన్రుళ్ళ పొక్కంగళే పేశుం  పాలూరు తేన్వాయ్ పడిరీ కడై తిరవాయ్  న్యాలమే విణ్ణె పిరవే అరివరియాన్  కోలముం నమ్మై యాట్ కొండరుళి కోడాట్టు  శీలముం పాడి శివనే శివనే ఎన్రు  ఓలం ఇడినుం ఉడరాయ్ ఉడరాయ్ కాణ్  ఏలా కుళలి పరిశేలో రెంబావ...