TIRUVEMBAVAY-05
తిరువెంబావాయ్-05
**************
"కృపాసముద్రం సుముఖం త్రినేత్రం
జటాధరం పార్వతీ వామభాగం
సదాశివం రుద్రం అనంతరూపం
చిదంబరేశం హృది భావయామి."
సందర్భము
**********
ద్రవిడ సంప్రదాయము వ్రతములో మనము దర్శిస్తున్న కన్యలను ఆచార్యులుగా భావిస్తుంది.అమోఘ తపసంపన్నుల వారి స్పర్శ ఆశీర్వాదముగా భావిస్తారు కనుక నిన్నటి పాశురములో నీవే వచ్చి మమ్ములను లెక్కించు అన్నారు.తిత్తిత్తు పేశవాయ్ అన్నది వాచ్యార్థము.దాగిన సత్యము అంతరార్థము పరమార్థమే.
ప్రస్తుత పాశురములో నిదురిస్తున్న చెలిని,ఏళాకుళలి-సుగంధభరిత కేశపాశము కలదానా అని ప్రస్తుతిస్తు,పడరీ మోసగత్తెవి,పొక్కంగళే పేశు-నీవు మాయమాటలు చెప్పావు అని ఆక్షేపిస్తున్నారు.
పాశురము
*******
మాలరియ నాం ముగనుం కాణా మాలై ఇనైనాం
పోలరివోం ఎన్రుళ్ళ పొక్కంగళే పేశుం
పాలూరు తేన్వాయ్ పడిరీ కడై తిరవాయ్
న్యాలమే విణ్ణె పిరవే అరివరియాన్
కోలముం నమ్మై యాట్ కొండరుళి కోడాట్టు
శీలముం పాడి శివనే శివనే ఎన్రు
ఓలం ఇడినుం ఉడరాయ్ ఉడరాయ్ కాణ్
ఏలా కుళలి పరిశేలో రెంబావాయ్.
నేటి నాయిక నారాయణుడు-నాలుగు ముఖముల బ్రహ్మ సైతము కనలేని స్వామిని దర్శించినాని చెలులకు చెప్పింది .అంతే కాదు ఆ కోలమును దివ్యమంగళ విగ్రహమును భూమి-ఆకాశము-మిగిలిన ప్రదేశము అంతా వెతికినను కనుగొనిన వారులేరు.అది విణ్ణోర్కల్ దేవతలకు సాధ్యము కాలేదు.అట్టి దుస్సాధ్యమును నేటి చెలి చాలా సాధారణ విషయముగా ఏమాత్రము తొటౄపాటు లేకుండా చెప్పింది.ఇది ఆరొపణ.ఆమె మాటలు పాలూరు తేన్వాయ్-పాలుతేనె కలగలిపిన మథురాతిమథురము.స్వామి దర్శన సంకీర్తనాభిలాషను చెలులలో పెంపొందించినవి.కనిక నిందిద్తున్న నారి రోషము తాత్కాలికమై నిష్క్రమించినది.
అంతలోనే విజ్ఞతతో ఓ సుగంధకేశిని,మథుర సంభాషిణి నీ కన్నులుతెరిచి,మేల్కొని మాతో వస్తే.స్వామి యొక్క దివ్య సుగుణ సంకీర్తనమును ,
"శివ శివ అనరాదా-శివనామము చేదా
శివపాదము మీద నీశిరసునుంచరాదా" ఆలపిస్తూ-ఆరాధిద్దాము అని అభ్యర్థిస్తున్నారు.
అంబే శివే దివ్య తిరువడిగళే శరణము.
ఏక బిల్వం శివార్పణం.

Comments
Post a Comment