JANULAMADILOE JAIJAI TELANGAANA
జనుల మదిని కొలువైన-జై జై తెలంగాణ **************************************** స్వాతంత్రం వచ్చింది చక్కని భారత దేశానికి ఐనా పరతంత్రమే, నైజాంకి చిక్కిన "తెలంగాణా"కి తల్లిదైన్య కారణము,ఖాసిం రజ్వీ సైన్యము అరాచరికపు రూపమైన "రజాకార్ల" వైనము తెలంగాణా జిల్లాలను తొక్కేసిన ఫలితమేగ "నీ బాంచెన్ దొర" అనే చితికిన బతుకులు "దళితులు" అని వెలివేసిన మూగవైన గళములు వేదనే మిగిలిన "ఆదివాస"జనములు దిక్కులు దద్దరిల్లేలా "పెద్దరికపు" గుర్రులు బిక్కుబిక్కుమనేలా "పేదరికపు"గురుతులు దేవుళ్ళాడినగాని సోదినైన గానరాదు పరేషాను!పరేషాను! ఏడుందిరా మన "షాను"? (శ్రీ జమలాపురము కేశవరావు) పొద్దుపొడుపు సూరీడల్లే చెడ్దతనమును అడ్దగించ "సాయుధ పోరాటానికి" ఆయుధమైనాడు అందరిని కలిపి ఒక్క తాటిపై నడపగ "నడిమింటి సూరీడు"గా "తెలంగాణా సర్దారు" కొరుకుడుపడనిది ఐనా కొనసాగించిండుగా ఉరకమంటు సైన్యానికి ప్రాణం పోసిండుగా కొమరం (భీం) పులులై,కోతెరిగిన కొడవళ్ళై కొండా లక్ష్మణ్ బాపూజి,కాళోజి,కొండపల్లి,దాశరథి రావి నారాయణర...