Sunday, November 8, 2020

MEEDUSHTAMA SIVATAMA-INTRODUCTION

 


  మీడుష్టమ శివతమ-01

 *********************** ఇంత్రొ


   శివానుగ్రహము అర్థముకానిది.శివానుగ్రహము అద్భుతమైనది.అది అట్తడుగున నున్న వారిని గట్టిగా పట్టూంటుంది.కొత్తదనమును చూపిస్తున్నది.మత్తుకళ్ళను తెరిపిస్తున్నది.అదియే రుద్రచమకము చెబుతున్నట్లు కృష్టపచ్యంచమే-అకృష్తపచయంచమే అని నినదిస్తున్నది.ఊరికే పంతభూమియందు-బీడునేలయందు ఉన్నాడా పరమాత్మ.లేక బీడుభూములను పంటచేలగా మారుస్తున్నాడా అన్న సందేహము కనుక వస్తే ,రెండింటిలో ఉన్న సత్తే-చిత్తే-ఆనందమే సంస్కరనకు కంకణము కట్టుకొనుటయే "మీఢుష్టమ శివతమ" 


  ఆ చిదానందమునే "గిరిశంచ-అభిచాకశీ" అని మనము అనుకుంటే,నాకరమున కలముగా మారి కరుణవర్షమును కురిపించిన ఆ వర్షముకూడ అవధిలేనిది-మీడుష్టమ-దేనిని కురిపిస్తోంది అంతే శివ -శుభములను-శివతర-ఎక్కువ శుభములను-శివతమ-సంపూర్న శుభములను వర్షించదలచుకుంది.ఆ చిత్తు నేనే అందిస్తున్నానన్న భ్రమను కాసేపు కలిగిస్తూ,కాదుకాదనే తెలివిని మరికాసేపు కలిగిస్తూ,భ్రమలను తొలగిస్తూ,దాగుడుమూతలాడుతాడు.


   పెద్దలు "గిరిశంచ" అను పదమునకు మూడు అర్థములను మన అవగాహనా సౌలభ్యమునకు అందించారు.



1.గిరియందుండి శుభములను కలిగించేవాడు.

2.గిరులు-వేదములయందుండి మోదమును కలిగించువాడు.

3.ఇచ్చినమాటయందుండి అవధులులేని వరములను వర్షించువాడు.


   అందుకే ఆ పరమాత్మ "మీఢుష్తమ" వరములను వర్షించేవాడు.వాటికి అడ్డంకులను కలిగించేవాటిపై తన బాణములను వర్షించేవాడు."మీఢుష్టమ ఇషు"


 శివ అనగా శుభము-శివతర-ఎక్కువగా శుభములను కలిగించువాడు.శివతమ-పరిపూర్ణముగా శిభములను వర్షించువాడు.కనుక పరమాత్మ శివతమ మీఢుష్తమ.


    ఏవిధముగా కుమ్మరి తనదగ్గరనున్న మట్టి-సారెతో కుండ అను కొత్తరూపమును సృష్టిస్తూ,కుండలో మట్టిని పొదివి,తానుమాత్రము కుమ్మరిగా వాటికి దూరముగా ఉంటాడో ఆ వివరములను కుండ వంటి సాధకునికి తాను కుమ్మరియై సత్యసాక్షాత్కారమునకు వానితోపాటు మనలనుకూడ ఉద్యుక్తులను చేస్తున్నాడు తాను అదృశ్య-సాక్షాత్కారములను దాగుడుమూతలాడుతూ,ఇక్కద కదిలేదిప్రపంచం-కదలనిది పరమాత్మ.అంతే,


  కదిలేవి కథలు-కదిలించేది కరుణ.


  అణువు అణువు శివమే-అడుగు అడుగు శివమే.


   శివానుగ్రహముతో రేపు కలుసుకుందాము.


 .



1. 

MEEDUSHATAMA SIVATAMA-11

 


  మీడుష్టమ శివతమ-11

  **********************


  న రుద్రో రుద్రమర్చయేత్-  రుద్రుడు కానివాడు రుద్రుని అర్చించలేడు.అనుసరించలేడు.అనుభవించలేడు.


   సాధకునీనుగ్రహమును నేనేమని వర్ణించగలను? సాక్షాత్తు రుద్రుని గుర్తించి-సాంభాషించి-సమర్థవంతమగుచున్నాడు.సందేహములుత్పన్నమవుతున్నవి-అవి రుద్రుని దయతో సందేశములుగా రూపుదిద్దుకుంటున్నవి.


  సాధకుడు సుమనస్కుడైన రుద్రుని స్మరించాడో లేదో సాక్షాత్కరించాడు సమందహాసముతో.


    ఎగతాళిచేయించుకోవటము ఒక లీలేకదా.


    ఏమిటయ్యా రుడ్రా నాతో ఈ దాగుడు -మూతలు? అడిగినదేతడవుగా అనుగ్రహించానంటావు.అందుకునే లోపున హరించివేస్తావు?నువ్వున్నప్పుడు అంతా అర్థమయినటే ఉంటుంది.నాతెలివి మొత్తం నీతోపాటుగా తీసుకళ్ళిపోతావు ఏమితెలియనట్లు.కనుకనే కదా! వ్యర్థము మాత్రమే నాకు గోచరిస్తూ,నన్ను పరిహసిస్తున్నది?నువ్వు పక్కా మోసగాడివిలే.


    ఉలకలేదు-పలుకలేదు రుద్రుడు.ప్రసన్నతతో చూస్తున్నాడు.


  ఎక్కడుందయ్యా నీ అనుగ్రహము? ఉంటే అది నన్ను పక్కదారిలోనికి నెట్టివేస్తుందా? చెట్టు చిటారికొమ్మనెక్కాననుకున్న నన్ను పట్టుకుని లోయలోకి నెట్టివేస్తుందా? అంటు సందిగ్ధములో పడిన సాధకుడు ఆ సాక్షాత్కారమును.

   సన్నగా నవ్వాడు.సంస్కరించాలనుకున్నాడు వాడికి గమ్మత్తుగా ఒక ఆలోచనను చిగురింపచేసాడు .


   రుద్రా నేను ఏది అడిగినా -ఎన్నిసార్లు అడిగినా-ఎన్నింటిని అడిగినా అనుగ్రహించటమే మన ఒప్పందము కదా.అంతే అంతే అన్నాడు అమాయకముగా రుద్రుడు.


  ఇది ఆత్మ-ఇది ఆత్మకాదు అనే వివేకము నాతో స్థిరముగా నుండుటలేదు.అది నాతో స్థిరముగా నాతో ఉండి నన్ను ఇది ఆతమ-ఇది శాశ్వతము-ఇది ఆత్మకాదు కనుక అనాత్మ.ఇది తాత్కాలికము నిత్యము కాదు అని నన్ను హెచ్చరిస్తూ ఉండాలి.నీ టక్కరితనమును విడిచి,దానిని నాదగ్గరనే ఉంచు.


  సంవితశ్చమే-సంవితశ్చమే  అంతేనా చాల అని రుద్రుడు అడుగగానే కాదు కాదు నాదగ్గర నున్న ఆ వివేకమును నేను ఇతరులకు అందించి సహాయపడగలగాలి.వారి తికమకలను తొలగించవేయాలి.నువ్విచ్చిన వరమును నీతో తీసుకుని వెళ్ళకుండా నేను నిన్ను అనుసరిస్తాను-అనుగమిస్తాను.అంతే.


   తన్మయత్వములో మునిగాడు సాధకుడు-తథాస్తు తథాస్తు అంటూ తరలినాడు రుద్రుడు.


  మళ్ళీ యథాప్రకారమే-కథతరంగముల ప్రకాశమే.


  అణువు అణువు శివమే-అడుగు అడుగు శివమే.


    సర్వం శివమయం జగం.

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...