Friday, October 2, 2020
PRASEEDA MAMA SARVADAA-01
ప్రసీద మమ సర్వదా-01
మాతా శైలపుత్రీం నమోనమః
" వందేవాంఛిత లాభాయ చంద్రార్థకృత శేఖరం
వృషారూఢం శూలధరం శైలపుత్రీం యశస్వినీం'
వృషభవాహినియై(ధర్మమును అధిష్టించి) కుడిచేతిలో త్రిశూలమును-ఎడమచేతిలో పద్మమును ధరించి భక్త రక్షణచేయుతల్లికి నమస్కారములు.
సృష్టి-స్థితి-సంహార-తిరోధాన-అనుగ్రహమను పంచకృత్యములను చేయుతల్లి,తిరోధానము ముగిసిన తరువాత,అనుగ్రహమను ఐదయకృత్య విశేషమే నవదుర్గావిష్కారము.ఇందులో శైలపుత్రీ గా తల్లి ప్రథమ రూపమును ప్రకటించుకొనినది.
అమ్మ అవ్యాజ కరుణను నేనేమని వర్ణించగలను? తల్లి తన నిర్హేతుక కృపాకటాక్షమునకు నిదర్శనముగా మనతో తన నవదుర్గా అవతార విశేషములను తెలియచేస్తూ,ఎంతో ఓర్పుతో-నేర్పుతో మనందరి చేయి పట్టుకుని,నవనవోన్మేష మార్గమున మనలను నడిపించదలచినది.
మొట్తమొదట మనము ఆశ్వయుజ శుక్ల పాడ్యమి రోజున ఆదిపూజలందు తల్లి శైలపుత్రీ లీలా విశేషములను తెలుసుకొనే ప్రయత్నము చేద్దాము.
మూలపదార్థము కొత్తరూపమును ధరించు ప్రక్రియను మనము సృష్టికార్యముగా భావిస్తే,దక్షవాటికలో తన అవతారమును స్వఛ్చందముగా ముగించుకొనిన సతీదేవి,సతీదేవి గ్లానియైన ధర్మమును తిరిగి స్థాపించుటకు ,తన శక్తిని సమర్థవంతము చేయగల శివుని కూడి,శివశక్త్యైకరూపిణిగా పరిమాణమునొందు ప్రహసనములోని ప్రథమ ఘట్ట శైలపుత్రీదేవి.మిగిలిన ఎనిమిది దుర్గలలో మనకు పుత్రిక రూపము కానరాదు.స్థితి-గతులు రెండు తానైన తల్లి పుత్రిక అను స్థానమునుండి జరిగి,సత్యాన్వేషణకు సాధనమైన మూలాధారము వైపు (కుండలినిని జాగృతపరచుటకు) తన అడుగులను కదుపుచున్నది.
తల్లి అనవరతము చంద్రుని కదలికలను తన కనుసన్నలలో నుంచిన "ఋతుచక్ర స్వరూపిణి"త్రిమూర్తిశక్త్యాత్మిక.తల్లి తన పయనమనే నెపముతో నిస్త్రాణమైయున్న విశ్వ(స్థూల) మూలాధార చక్రము లోని కునలినిని జాగృతపరచుటకు సన్నధ్ధురాలవుతున్నది.
అమ్మకదా.అందుకే మన చేతిని కూడా పట్టుకుని,నవనవోన్మేషమైన నవదుర్గలను చూపించటానికి తీసుకువెళుతున్నది.
అసలు ఈ అమ్మ పేరు శైలపుత్రీ.అంటే పర్వతము యొక్క కుమార్తె.అంతేనా లేక అంతరార్థమేమైన ఉన్నదా అని మనలను మనము ప్రశ్నించుకుంటే అసలు తత్త్వము అర్థమవుతుంది.
కొంచము తార్కికముగా ఆలోచిస్తే శైలపుత్రీమాత భూతత్త్వముగా ఆవిష్కరింపబడినది.ఓర్పునకు సాటిలేనిది.పర్వతములు భూమిని తమ స్థావరముగా చేసుకొని, ఊర్థ్వముఖముగా ఎదుగుతయి.అది వాటి నైజము.పర్వత ఊర్థ్వ విస్తరణను గమనిస్తే,స్థూలము నుండి సూక్ష్మము వైపు చేరుతున్నట్లుంటాయి. మధ్యలో ఎన్నో చ్పెట్ల చదరముగా,కొన్నిచోట్ల త్రికోనముగా,మరికొన్ని చోట్ల స్థూపములాగ వివిధాకృతులతో విరాజిల్లుచుంటాయి.కొంత ఎత్తులో గులకరాళ్ళతో,మరికొంత ఎత్తులో గండ శిలలతో ,వివిధ పరిమాణములతో-వివిధ పరిణామములో ,విభేదములను సంధించుకుంటూ,సమన్వయపరచుకుంటూ, స్వస్వరూపమును సాక్షాత్కరింపచేస్తూ,శిఖరాగ్రమున సూటిగా స్పష్టతను ప్రకటిస్తూ,దానినలంకరించిన కేతనమై కేరింతలు కొడుతుంది.కేరింతల కేతనము క్రిందనున్నవారికి సైతము స్పష్టముగా గోచరిస్తుంది.దానికి కారణము అన్ని అడ్దంకులను అధిగమించి అధిస్ఠించిన అసలు తత్త్వము.క్రింద స్థూలరూపముగా పరవతభాగము మనకు అతిదగ్గరగా నున్నను దానిని కప్పివేసిన దుమ్ము-ధూళి,మలినముల వలన అది స్వస్వరూపమును చూపలేని అశక్తురాలు.శిఖరాగ్రము దూరముననున్న అది ఏ దోషములు తాకలేని స్వయంప్రకాశిని.
ఆ స్వయంప్రకాశమే శైలపుత్రీ.మన ప్రయాణములో అడ్డుపడు దుష్టశక్తులను నిర్మూలించుటకు అంకుశము(పట్టుదల)జ్ఞానమను (సామర్థ్యము) అను పద్మమును చేతబట్టుకొని,అమ్మ ఏ విధముగా ధర్మమను ఎద్దునెక్కి,సాగుచున్నదో,అదేవిధముగా అమ్మచేతిని పట్టుకుని,ధర్మమార్గములో అమ్మ చేతిని వీడక నడుస్తుంటే అంతా ఆనందమయమే.అలుపెక్కడుంటుంది?
పుట్టినింటిని వీడి మెట్టినింటికి చేరుట అమ్మ సంకల్పము
విషయవాసనలను వీడి విభవమును చేరుట మనసంకల్పము.
అమ్మ చెంతనున్న మనకు అన్యచింతనలేల?
అమ్మ దయతో మన ప్రయాణము కొనసాగుతుంది.
అమ్మ దివ్యచరణములే శరణము.
Subscribe to:
Posts (Atom)
TANOTU NAH SIVAH SIVAM-18
తనోతు నః శివః శివం-17 ******************* " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...
-
వందనం =========== అంబ వందనం జగదంబ వందనం సంబరాన కొలువుతీరె శక్తి వందనం భవతారిణి భగవతి భక్తి వందనం. పారిజాత అర్చనల పాదములకు వందనం పాప...
-
శార్దూలము... మాతంగి వర్ణన. ఊతం భద్ర సుభద్ర రుద్రరమణీమ్ ఉచ్చిష్ట చండాలినీమ్ భాతిమ్ రోహిత వస్త్ర సంపుటికరీమ్ ...
-
విబుధజనుల వలన విన్నంత-కన్నంత-తెలియపరచు ప్రయత్నము.తప్పులను సవరించి మరింత సుసంపన్నము చేయగలరని ప్రార్థిస్తూ, శివతాండవ స్తుతి భావము. ****...