Saturday, November 9, 2024

TANOTU NAH SIVAH SIVAM-09



 

 


      తనోతు నః శివః శివం-09

     *******************

 " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తియే

   జగతః పితరం  వందే పార్వతీపరమేశ్వరౌ."



    పరమాత్మ తనతాండవమును మరింత ప్రకాశవంతమే కాక పరిమళభరితము గావింపనున్నాడనుటకు సంకేతముగా ప్రసూనమాలలు-ప్రసూనమాలాధారణముచేసిన  అశేషదేవతా పాదనమస్కారములు-అదేఅదనుగా వారి ప్రసూనములలోని పుప్పొడి స్వామి పాదపీఠమునకు అభిషేకమై-అలంకారమై-ఆత్మార్పణమై ఆనందించబోవుచున్నదేమో అనిర్వచనీయముగా.

     "పర చిదంబర నటం హృది భజ."

             జగదంబ 

 " పంచమీ పంచభూతేశి పంచసంఖ్యోపచారిణి"

     అమ్మ పంచభూతేశి.పంచభూతములకు ఈశ్వరి.పంచభూతములుగా ప్రకటితమైన పంచమి స్వామిని పంచసంఖ్యలతో పాదసేవనము చేయాలని తలచినది.

 " దివ్"  అను ధాతువునకు ప్రకాశము/తేజము అని భావము.అమ్మ తన ప్రకాశమును కొన్ని ప్రత్యేక ఉపాధులలో నిక్షిప్తముచేసి "లేఖ/దేవత/దేవుడు" అంటూ పేరు పెట్టినది.వారికి తమ తండ్రిని చూపించి-సేవింపచేయాలనుకున్నది.పరిమళభరిత ప్రసూనముల మాలలను వారిచే  ధరింపచేసినది.

          అవి సాధారణమైన పూలమాలలు కావు.

  పంచసంఖ్యలు కలిగినవి.ఆశ్చర్యపోకండి.అబద్ధముకాదు.

 పంచభూతములు తమ శక్తులను పంచతన్మాత్రలుగా ప్రకటింపచేసుకొనినవి..

 1. ఆకాశము-శబ్దము-కుసుమము తన మకరందముతో తుమ్మెదఝుంకారమును శబ్దముగా అందించగలుగుతున్నది.

 2.వాయువు-స్పర్శనము-కుసుమము  మృదుత్వమును స్పర్శగా మనకు అందిస్తున్నది.

 3.అగ్ని- జ్వలనము/ప్రకాశము-        కుసుమము  వికసిస్తూ  సుందరమైన రూపమును చైతన్యముగా--పొందుతోంది.

 4,జలము-కుసుమము జలమును ద్వారా వికసిత దళశోభితగా (రసము/శక్తి)మారుతున్నది.

  5.భూమి-కుసుమము భూమి ద్వారా పరిమళమును సంతరించుకుని  ఐదు సంఖ్యలతో 
 పరమేశ్వరుని సేవించుకొనుటకు పయనమైనది.

   స్వామి పాదపీఠమును సేవించుకొనుటకు అశేష 

    దేవతాసమూహము విచ్చేసియున్నారు

.    స్వామి అమ్మ తలపునకు ఆనందములో తలమునకలై 
    తాండవించుచున్నాడు.

   పరమేశ్వర పాదమెక్కడ దొరుకుతుంది పట్టుకుందామంటే.

  దేవతలు స్వామికి పాదనమస్కారము చేసుకుందామని తలలు  వంచారు.

        సదాశివపాదము,

            పతంజలి దర్శించిన,

 " సదంచిత-ముదంచిత-నికుంచిత పదం-ఝలఝలం చలిత మంజుకటకం
   పతంజలి దృగంజన మనంజనం -అచంచలపదం-జనన భంజనకరం."

  స్వామి పాదములు ఎందరెందరినో మువ్వలుగా అనుగ్రహించినవి.వారు,

   అనవరత ప్రణవనాదమును ఝలఝలం శబ్దముగా ప్రకటింపచేస్తున్నాయి.

   దేవతలకు పాదనమస్కారమునకు వీలులేకున్నది.

     ఇది ఒక లీల.

 ఎందరో సత్పురుషులు పట్టుకుని సంస్తుతిస్తున్న సదంచిత పాదమది.

 ఎందరికో ముదమును అందించుచున్న  పాదమది.

 వారు క్షణకాలము స్వామి పాదమును వీడియుండలేరు
.

  మంజుకటకములుగా మువ్వల పట్టీలుగా మారిన మహనీయులు                  వారు

 ఓం నమశ్శివాయ-నర్తించుస్వామి అని ప్రార్థిస్తూనే ఉంటారు.అనవరత స్వామి నర్తనాభిలాషులు.వారు కదులుతూ స్వామిని తాందవింపచేస్తూనే ఉంటారు.

  వారికి తెలుసు స్వామి నర్తన /తాండవ దర్శనము జనన భంజనకరమని.
  మళ్ళీ పుట్టవలసిన అవసరమును కలుగనీయదని.
   స్వామి తాండవము పతంజలి కన్నులకు కాటుక గా మారి జ్ఞానదృష్టిని ప్రసాదించినది.

   స్వామి తాండవ దర్శనము దేవతలకు ముదంచితమే.ఆనందదాయకమే.

   కిందకు-మీదకు-పక్కలకు నర్తిస్తున్న మహాదేవ నాట్యపాదము అచంచల/శాశ్వత సాయుజ్యమును ప్రసాదించునునది .చంచల స్థితిలో నున్న పాదము అచంచలస్థితిని అనుగ్రహించుటయే అద్భుతము.
   కనుకనే,
  "శివ పాదము మీద నీ శిరము నుంచరాదా" అన్నరు శ్రీదేవులపల్లి.
    స్వామి స్థిరముగా పాదమునందనీయక (దేవతలకు_)నర్తిస్తున్నాడు.ఆ నర్తనము స్వామికి మురెపము-వారికి ముదంచితము.  అంతర్లీనమైన కరుణ అచంచలపదవిని అనుగ్రహిస్తున్నది.వారికి.
      హరహర మహాదేవ

    ప్రసూనము-అప్పుడే పుట్టినది.(ప్రసవము-జననము) అప్పుడే పుట్టిన ప్రసూనము తన శబ్ద-స్పర్శ-రూప-రస-గంధాదులు ఏకీకృతమైన పుప్పొడిగా మార్చి స్వామి పాదపీఠమున చేరినవి.(విషయవాసనలను విడిచివేసిన వివరమది)

   అమ్మ ,

   సహస్రశీర్ష వదనా-సహస్రాక్షి సహస్రపాత్

     స్వామి

   సహస్రలోచన ప్రభ్యుత్యశేష  లేఖ శేఖరుడు.

        అంతేకాదు

   కిశోర చంద్రశేఖరుడు మాత్రమేకాదు
                        ఇప్పుడు చకోరబంధుశేఖరుడు.

  స్వామి తన తాండవముతో మనలకు ఆపాద-మస్తక దర్శనమును 
  అనుగ్రహించబోతున్నాడు.స్వామికరుణ అనే అంజనమును మన కన్నులకు అలదుకుని స్వామి 
   తాండవమును దర్శించి-తరించుదాము.  

    కదిలేది  ప్రపంచము-కదలనిది పరమాత్మ

    భజశివమేవ నిరంతరం

       ఏకబిల్వం  శివార్పణం. 

 

 





TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...