CHIDAANAMDAROOPAA-TIRUNAVUKKARASAARU
చిదానందరూపా-తిరునవుక్కరసారు.6 కలయనుకొందునా నిటలాక్షుడు కలడనుకొందునా కలవరమనుకొందునా కటాక్షించిన వరమనుకొందునా మనసులోని చీకట్లను తరిమేసే మరుల్ నీకియారు అచంచల భక్తులలో అతనికెవరు సాటిరారు వ్యాధి దరిచేరి అప్పారును రాజధిక్కారిగ మార్చినది కఠిన శిక్షరూపమై బండతో పాటుగ కడలిలో ముంచినది తేవారములే నాయనారును కడతేర్చే పరిహారములైనవి పశ్చాత్తాప పల్లవ గుణభారవీహారముగా మార్చినది తిరువాయుమూరుకు తిరిపెమెత్తువాడు రమ్మనుట వాగీశనాయనారు ముక్తికి వ్యాధియే కారణమగుట చిత్రముగాక ఏమిటిది చిదానందుని లీలలు గాక చిత్తముచేయు శివోహం జపంబు నా చింతలు తీర్చుగాక. మరుల్ నీకియారు అనగా చీకట్లను పారద్రోలేవాడు.భావి సూచకముగా తండ్రి సార్థక నామధేయుడవుతాడని ఆ పేరును పెట్టారేమో.తల్లితండ్రులను కోల్పోయిన బాలుని అక్క తిలకవతి తల్లియై సాకింది.తిలకవతి శివభక్తురాలు.తమ్ముడు శివుని నమ్మకపోయినా శివ వైభవములను నిరంతరము చెబుతుండేది.మరుల్ నీకియారు శివ దూషణ చేస్తూ మూర్ఖ వాదనలను చేసేవాడు.ఇలా వుండగా శూలవ్యాధి...