Friday, January 26, 2018

NAANETI SETHU

  నానేటిసేతు
బుక్కెడు బువ్వకు నాను
దిక్కులు సూత్తుంటేను
చుక్కలనే తెస్తాను
ఓటెయ్-అంటడు దొర
..........
గుక్కెడు నీళ్ళకు నాను
తొక్కిసలాటలో పడితే
చెక్కులు ఇప్పిస్తా ఎంచక్కా
ఓటెయ్-అంటడు దొర
...........
బొక్కలన్నీ ఇరిగి నాను
బిక్కమొగముతో నుంటి
చక్కనైన ఇల్లు నీకు
ఓటెయ్-అంటడు దొర
............
అయ్యయ్యో పెయ్యేమో
సలసలమని కాగుతుంటే
కారు తెస్త,తోలుకెల్త
ఓటెయ్-అంటడు దొర
............
పాపాలలోకమున నాను
పాలుపోక కూసుంటే
కొలువిప్పిస్త గంద
ఓటెయ్-అంటడు దొర
..........
దొరతనము దిగివచ్చిన
ఓటెంత గనము మరి
బాంచెన్ నే మొక్కుతా
నా (హ) అక్కును తొక్కొద్దు దొర.
0 

Add a comment


    ISAYAJNAANI-SRI ILAYARAJA

     శతమానం భవతి.సహస్ర చిత్ర సంగీత సామ్రాట్
     రాగం-తాలం-పల్లవి
     అనురాగపు పల్లవమై
     కోటి కోటి రాగాలను
     మీటి మనల మురిపించగ
     తరలెనేమో తాన్సేను
     తానై జ్ఞానదేశికను
    ........
     శుభమయ ముఖ కమలమునకు
     శృతిలయలు మధుపములుగ
     వేణువులు అణువణువణువులుగ
     జాణ వీణలు మృదుపాణులుగ
     మువ్వలసడి చిరునవ్వులుగ
     శ్వాస కోశములు నాదస్వరముగ
     శాసనములు వ్రాయసాగె...ఆ బ్రహ్మ.
     జాణ వీణలు మృదుపాణులుగ
     మువ్వలసడి చిరునవ్వులుగ
     శ్వాసకోసములు నాదస్వరముగ
     శాసనములు వ్రాయసాగె..ఆ బ్రహ్మ.
     ............
     "పంచ ముఖ" రాగ సృష్టికర్తగా
      ప్రపంచ స్వర సంధాన కర్తగా
      చినతాయమ్మాళ్ రామస్వామికి
      అవతరించెను డానియల్ రసయ్య
      పన్నైపురం పులకించెనయ్య.
      .......
      కలివిడి కనపడి
      స్వరముల సరములు అతుకగ ముడిపడి
      అందపు పొందుగ మరందము చిందగ
      నాదములన్నీ విందులుచేయగ
      ........
      మిఠాయిగా మారెను గిటారు తాను
      రాజా బాజా కాజా చేరెను
      బాదుషా బాదుషా గళమైపోయెను
      సాక్షోఫోను స్నాక్సుగ మారెను
      హార్మొని చరెను హార్మోనియము
      .........
      జనని వరము జానపదము నీ జత చేర
      సాంప్రదాయ పద్ధతిని సంప్రదిస్తూనే
      పాశ్చాత్య పద్ధతికి పట్టం కట్టావు
      నీ బోణీ బాణీ చేరింది కన్నదాసను వాణి
      అందించింది ఆ రవళి నెహ్రూకి ఘన నివాళి.
      చిలుకగా వచ్చావు చిత్రరంగము లోకి
      చిత్రంగా నీ చిలుక చిటికలే వేసింది
      పాప్,జాజ్,ఫంక్ దిస్కో ఎన్నెన్నో కోయిలలు
      కూహు కూహు అంటు నీ ముందు గొంతులు సవరించాయి
      ............
       తూర్పు పడమర సంగీత కలయిక భావము
       రాయలు ఫిలు హార్మోనిక్ సింఫనీ ఆవిర్భావము
       ఆదికవివని మురిసింది ఆసియాఖండము
       శ్రీ త్యాగరాజును కొలిచావు
       శ్రీ యోహాన్ బాకును భజియించావు
       పేరుపెట్టలేని తేరుపై
       ఇరువురిని కూర్చుండ పెట్టావు
       ...........
       నీ కలము కళకళలాడింది
       నాడోడి తెండ్రల్ అంది
       నీ గళము గలగలలాడింది
       తెండ్రల్ వందు రంగులంది
       నథింగ్ బుట్ విండ్ అంటు
       నయగారాల రాగం అంది
       చల్లగాలి సాక్షిగా మీరు
       చల్లగా ఉండాలంది
       నాలుగు దిక్కుల శుభరవాలు
       నాలుగు జాతీయ గౌరవాలు
       అలరించే ఆ నందులు
       అందాల ఆనందులు
       ప్రతిష్ఠాత్మక పద్మభూషణము
       ప్రతిభ మధుర భాషణము
      ..............
       పావలాయి పాటలలో
       పదనిసల తోటలలో
       గాత్రములు అత్తరులు
       తంత్రులన్నీ తావులు
       బృందగళ చందనములు
       నవ్వులు జవ్వాజులు
       స్వరకుస్తీలు కస్తూరులు
       సంగతులు సాంబ్రాణులు
       అన్నీ కలిసి పన్నీరును
       మేళవించి పరిమళాలు
       మరెమ్న్నో మరులుగొలిపేలా
       మంగళ వాయిద్యాలుగ

       మోగుతూనే ఉండాలని ప్రార్థిస్తూ
       .........
       సరిగమలు పలుకలేని
       సంగతులు తెలియని
        ఒక  మూగ కలం పలుకులు

    AVAKAAYA JAADI



    ఆహా! ఆవ రుచి, అనమా మైమరచి
    మాటవరసకునైనా..మనగలమా నిను విడిచి
    ఆరు రుచులతో చవులూరు ఆవకాయ
    అయినావమ్మ ఆబాలగోపాల శ్లాఘనీయ
    మామిడిపై దండెత్తి మరుమాటలేక చేసి
    ఉప్పుకారముల తగుపాళ్ళు చొప్పింప చేసి
    తగిన దినుసులు తైలము చెలిమి చేసి
    ఆవ ఘాటుతో వాటిని చాటుచేసి
    ఆవకాయ అను పేరుకు పెద్ద పీట వేసి
    ఉర్రూతలూగించు ఊరగాయ మన ఆవకాయ.
    పింగాణి జాడిలో సింగారముగా పోతపోసి
    వాసెన అను మేలిముసుగు సిగపైన వేసి
    విస్తరిలోని ఆథరువులను తోసివేసి
    వాసికెక్కినావమ్మా వైద్యునిగ ఆవకాయ
    బోసినవ్వుల పాపాయి పోటి ముసలివారితోటి
    దోసమెంచకు దొడ్డరుచికి నీకునీవే సాటి
    అగ్రతాంబూలముతో అభినందనలు కోటి
    ఆవకాయ !!!! నిన్ను పొగడ నేను ఏపాటి.

    SRI BALACHANDAR

     వందనాలు చంద్రయ్యా
    *******************************
     ఆబాలగోపాలము చందమామను రమ్మనగా
     మాబాలచందురుడు ఇలకే దిగివచ్చెనుగా

     అరుదైన ప్రతిభతో తన ఆరంగేట్రముతో
     పూవాసనలందించాడు పున్నాగమన్నన్

     చిత్రసీమ దర్శకులకు కొత్త కొత్త అర్థాలుగా
     నాశరహిత కీర్తులకు నాలుగుగోడలుగా

     ఆకలిమంటలను ఆర్పిన సర్వర్ సుందరముగా
     అంటరానితనము ఆర్పు రుద్రవీణ సూర్యంగా

     స్త్రీలు స్వతంత్రులన్న సిద్ధాంతపు అబద్ధముగా
     వింతవైన అంతులేని కథల నిలువుటద్దములా

     ఇంతుల ఆంతర్యాల తెరలు రాసిన కవితలా
     పవిత్ర ప్రవృత్తి గల మా ఊరి పతివ్రతలా

     అక్రమాలను అణచగలుగు మేజర్ చంద్ర కాంతులా
     సినిమా.టెలివిజను  నీ ఇంటికి రెండు గుమ్మాలుగా

     తారాగణమును అందించిన కమ్మనైన అమ్మలా
     రహమాను జయహోల కులుకు కోకిలమ్మలా

     ప్రతిభా ప్రశంసలకు నూట్రికి నూరుగా
     పద్మశ్రీ -,ఫాల్కే పలుకరించిన దర్శకత్వ దాదాగా
     కైలాసమే విలాసమన్న మా బాలచందురిడివి
     చిరంజీవివయ్యా నీవు చిత్రసీమలోన

    RATHA SAPTAMI

    " నమస్సవిత్రే జగదేక చక్షుసే
    జగత్ప్రసూతి స్థితి నాశహేతవే
    త్రయీమయాయ త్రిగుణాత్మ ధారిణే
    విరించి నారాయణ శంకరాత్మనే "
    రథ సప్తమి
    *********
    రథమునకు సప్తమికి కల సంబంధము ఏమిటి? అంతగొప్పదా ఆ రథము అను ప్రశ్నకనుక వేసుకుంటే అద్భుత సమాధానాలు ఆవిష్కరింప బడుతాయి.ఈ రథము చక్కతో నిర్మించినదికాని లోహములతో నిర్మించినది కాని మృచ్చకటకములో ముచ్చటించినట్లు మట్టితో నిర్మించినది కాని కాదు.ఏ విధముగా వేదములు అపౌరుషేయములో అదే విధముగా ,సమస్త జీవరాశుల మనోరథమునుతీర్చుటకు అనవరతము శ్రమించు కర్మసాక్షి రథము.అందరిని ఆదరించు అరదము.
    " యద్భావం తద్భవతి" ఆర్యోక్తి.ఎందరో మహానుభావులు తమతమదృక్కోణముల ద్వారా దర్శించి ,పరిశీలించి ప్రస్తుతించినారు.
    మానవ శరీరము రథమునకు సూక్ష్మ రూపము.జ్ఞానమే చక్రము.కామక్రోధాది అరిషడ్వరగములే ఆకులు.శుభేచ్చ-విచారణ-తను మనసి-సత్వాపత్తి-సంసక్తి-పదార్థభావన-తురీయము అను సప్తజ్ఞానభూమికలే ఏడుగుఱ్ఱాలు.మనసే పగ్గాలు.బుద్ధియే సారధి.హృదయమే పరమాత్మ ఆసనము.జీవుని ప్రయాణ సాధనము శరీరము. ఇదియే సూర్య రథము.
    స్థూలభావముగా గోచరించిన వారికి విశ్వమే ఒక రథము.కాలమే చక్రము.ఉత్పత్తి-స్థితి-పరిణామము-వృద్ధి-క్షయము-నాశనము ఆరు ఆకులు.దేవ- మానవ-వృక్ష-మృగ-పక్షి-కీటక-జలచరములు అశ్వములు.
    యోగ శాస్త్రకారులు శరీరమును రథముగా భావిస్తారు.వారి యోచన ప్రకారము కుండలిని శక్తి ఏకచక్రము.షట్చక్రాలు ఆరు ఆకులు.భూమి-నీరు-వాయువు-అగ్ని-ఆకాశము-మహత్తు-అహము ఏడుగుఱ్ఱాలు.చిదాత్మనే సూర్యుడు.
    సంఖ్యా శాస్త్రకారుల అభిప్రాయము ప్రకారము విశ్వము 360 డిగ్రీలు గల ఒక వృత్తము.సూర్యుడు ఒకరోజుకు ఒక డిగ్రీ చొప్పున పయనిస్తూ 360 రోజులలో వృత్త గమనాన్ని పూర్తిచేస్తాడు.మిగిలిన రోజుల లెక్కలే అధికమాసములుగా పరిగణింపబడుతాయి.
    అయితే ఈ రథసాక్షాత్కారమును పొందిన దివ్యులు ఈ విధముగా స్తుతించుచున్నారు.గంధర్వులు సంగీతముతో,అప్సరసలు నాట్యముతో,నాగులు రథ అలంకరణలతో,యక్షులు అంగ రక్షణతో,వాలిఖ్యాది మునులు ప్రస్తుతులతో,నిశాచరులు అనుసరిస్తూ భక్తోపచార-శక్తోపచారములను చేస్తూ తరిస్తున్నారట. ప్రత్యక్ష సాక్షి కి నిత్యార్చనలు నెనరులు.
    సూర్య రథము మూడుకోట్ల ఆరు లక్షల యోజనముల పొడవు,తొమ్మిది లక్షల యోజనముల వెడల్పు కలిగి,పన్నెండు నెలలలో,పన్నెండు రాశులలో ,మిత్ర-రవి-సూర్య-భగ-పూష-హిరణ గర్భ-మరీచి-ఆదిత్య-సవిత-అర్క-భాస్కర రూపములతో పయనిస్తు ఋతువుల ఋజు వర్తనమునకు ఋజువైనాడు ఆ పరమాత్మ. సప్త ఋషులే రథాస్వములని , అనూరుడు సారథి అయినప్పటికిని వెనుదిరిదిగి స్వామి కనుసన్నలను అనుసరి0చు ఉరుతర రథచోదకుడు.
    రథ విశిష్టత-సప్త సంఖ్య ప్రాముఖ్యత కొంచము కొంచము అవగతమగుచున్న సమయములో మాఘశుద్ధ పంచమి రథ సప్తమికదా.మాఘమాసము శ్లాఘనీయమేమో.ముమ్మాటికి.అఘము లేనిది.అంతే పాపము లేనిది మాఘ మాసము.ఈ సమయము తమ స్వామిని దక్షిణాయణ గ్రహణమునుండి విముక్తునిగా చూడాలనే భక్తితో ఉత్తర దిక్కుగా పయనింపచేస్తూ ప్రకాశింప చేస్తోంది.
    ధర్మము అనే ధ్వజముతో గాయత్రీమాతగ, గమనము చేయు రథము,సారథి యైన అనూరుడు,స్వామి సూర్య భగవానుడు సకల చరాచర జీవరాశుల సృష్టి-స్థితి-లయములకు కారణభూతుడై,తాను అనవరతము శ్రమిస్తున్నను,మనకు విశ్రాంతిని ఇచ్చుటకు రేయిగా మనకు కనుమరుగవుతున్న ఆ సూర్యభగవానుడు అదితి-కశ్యపులకు జన్మించిన రోజు కనుక పుట్టిన రోజు శుభాకాంక్షలతో,కుటుంబీకుడైన రోజనే వారిని గౌరవిస్తు విశ్వ కుటుంబీకునికి వినమ్ర ప్రణామములతో,యధాశక్తి స్మరిస్తూ-మీ సోదరి సుబ్బలక్ష్మి నిమ్మగడ్డ.
    సూర్యునికో చిన్ని దివ్వె.

    SRI TANIKELLA DASABHARANI

    శ్రీ తనికెళ్ళ భరణిగారికి నమస్కృతులతో.
    నీలోన శివుడు గలడు-----దాగి
    నెనరు దీవించగలడు.
    1."ఎందరో మహానుభావులు" నిన్ను, అందరిలో ఒకరిగా
    అందించాడు వందనీయ రామలింగేశ్వరుడు.
    2."నక్షత్రము" నీవని,"నక్షత్ర దర్శనము"ను చేయిస్తావని
    "దశ భరణి" అని నామకరణమును చేశాడు ఆ నాగాభరణుడు.
    3.మిక్కుటమగు ప్రేమతో చిక్కులను విడదీస్తు
    "కుక్కుటేశ్వరుడు" దాగి "కొక్కొరోకో" అన్నాడు.
    4."శ్రీ రాళ్ళబండి" రూపములో రాళ్ళుతాకు బాట అను
    "గ్రహణము" విడిపించాడు అనుగ్రహము కలవాడు.
    5."స్త్రీ దుస్తుల దర్జీ" గా "పరికిణి" నువు కుడుతున్నప్పుడు
    సున్నితపు సూదియైనాడు ఆ బూదిపూతలవాడు.
    6."శివ" అని వినబడగానే శుభములు అందించుటకు
    ఘంటము తాను ఐనాడు కంట మంటలున్నవాడు.
    7."అర్థనారీశ్వరపు ఒద్దిక" అను "మిథునము" నకు
    తోడై నడిపించాడు నిన్ను ఆ మూడుకన్నుల వాడు.
    8."గార్దభ అండమును"కోరు మాయను మర్దింపచేసి
    ఆర్ద్రత నిలిపాడు నీలో "ఆట కదరా శివా" అని అంటూ
    9."యాస" ఉన్న బాసలో "శభాష్ శంకరా" అనబడ్తివి
    నీ రంధిని మార్చేసిండు గమ్మున ఆ నిధనపతి.
    10."చల్ చల్ గుర్రం" అనే చంచలమైన మనసుకు
    మంచి బాట వేస్తున్నడు ఆ మంచుకొండ దేవుడు.
    11.పసిడి మనసు, పసివయసులోనే ముసలివైన నీతో
    "త్వమేవాహం" అంటున్నాడురా ఓ తనికెళ్ళ భరణి.
    12.కామేశ్వరి పతి వాడు,కామితార్థమీయ గలడు
    కదలకుండ ఉంటాడు కరుణను కురిపిస్తాడు.
    శతమానం భవతి- శుభం భూయాత్.. ****

    SRI TANIKELLA BHARANI

      విశిష్ట వినయ విద్వత్తుకు మోకరిల్లుతూ
      *******************************
    నిత్య కళ్యాణమైన
    ఆ,సత్యలోకమునందు
    దివ్యసుతుని కోరె వాణి
    చతురతతో చతుర్ముఖుడు చేసినాడు వీణ్ణి
    ........................
    గణనాథుని కనికట్టుతో
    ఘనత కట్టబెట్టగా
    సరసిజాక్షి,సరస్వతి
    సరసను కూర్చుండబెట్టుకుని
    సారస్వతామృతమును వరుసగ తినబెట్టెనేమొ
    ..............
    ఆనందపు ఆలినిగని,సుతు
    దరిచేరె, విరించి నాడు
    గారపు ఆలింగనతో
    వేదసారము గ్రహియించె వీడు
    ..........
    అపహరణము నేరమనుచు
    మందలించె అమ్మ నాడు
    భవతరణము అనుచు *మాటల నాంది*
    వేసినాడు నాడే చూడు.
    ..........
    వీని కులుకు పలుకు నేర్వ తన
    చిలుకనంపె చదువులమ్మ,దాని
    *అభినయనము*ను దోచె
    వినయముగా...ఒద్దికగా
    ..........
    వల్లమాలిన వలపుతో నీ
    నీ దరిచేరింది వాణి వల్లకి
    నిను గెలుచుట వల్లకాక,మోసింది
    నీ సాహిత్యపు పల్లకి
    ...........
    క్షీర,నీర నీతి చేరిన ఆ హంసను
    ఏమార్చి నీ ప్రశంసగా మార్చావు
    ..............
    నీ అల్లరి భరించలేక నిను
    చల్లని కొండకు పంపగా
    *శభాష్..శంకరా*అని ఆనందివై
    ఆ నందిని ఏమార్చావు
    ........
    గురుతెరిగి గరుడుడు రయముగా
    పరుగులిడె
    .......
    ఇవి..నీ..లిపి..పరిహాసములా
    చిలిపి దరహాసములా
    రమణీయ కవీంద్ర
    తనికెళ్ల భరణీంద్ర
    ............
    ఈ అమృతానంద విభావరి
    కొనసాగనీ మరీ..మరీ

    BHOOTALA SVARGAMU-01

     కేరళ(లో)కేరింతలు  మొదటి భాగము
    *******************************************
     పంచామృత ధారలలో,పంచభూత సంగమములో, పంచేంద్రియ పరిష్వంగమును
    అనుభవించిన వారిదే భాగ్యము.చూడని వారికి సున్నాలు కాకూడదనే నా ఈ చిన్ని ప్రయత్నము."సర్వేంద్రియాణాం నయనం ప్రధానం".దాని వినయమేగా నాకందించ గలిగినది సౌందర్య నిధానము."కన కన రుచి(కాంతి)రా అన్నట్లు అన్నివయసుల వారి మనసులను కొల్లగొట్టినది కేరళ కుట్టి.
    అమ్మా అవనీ నేలతల్లీ అని ఎన్నిసార్లు పిలిచినా తనివితీరదెందుకో..
     బాపూ గీతలా బాపురే అనిపించే మెలికల కులుకులతో,బండరాయిని కాను నేను,నిండుమనసున్న నీ అండను అనిపించే ఘాట్రోడ్లు కంటికి ఇంపుగా వంపులతో మురిపిస్తుంటే,చిరుగాలుల సవ్వడులు వీనులకు విందును చేస్తూ పయనిస్తున్నప్పుడు ఆనందడోలికలను ఊగిస్తుంటే,లెక్కలేనన్ని సుందర పుష్పాల సువాసనలతో పిలాగాలి తెమ్మెరలు అల్లరిచేస్తుంటే చర్మము తన ధర్మముగా నిక్కపొడిచి చూస్తుంటే,ముక్కు మనమదిలో పదిలముగా చెక్కుతోంది.చిన్నబుచ్చుకుందపుడు చిత్రాల నాలుక (నాలుగు) తనను వెనుకకు పడేసి గోలచేస్తున్నయని.అది గుర్తించిన ఆ నేల "నాలుకా నీకు నాపై అలుకా"వద్దమ్మా అంటూ "ఆచార్య దేవో భవ"అంటూ అక్షరాస్యతను సాధించిన నేర్పుతోనే 
    "అతిధి దేవో భవ" అంటూ అమృత భాండమై,నాలుకను పంచేంద్రియ ఏలికను చేసింది అబ్బురపు కొబ్బరిబోండం.
       పంచేంద్రియములతో పాటు పరవళ్ళ పరుగు కొనసాగుతుంది.

    BHOOTALA SVARGAMU-02

     కేరళ కరింతలు-2
     సంస్కారపు ఆకారము ఓంకారముగా,"భోజ్యేషు మాతగా'గా అందాల తనఒడిలో,అక్షయపాత్రనుంచుకుని ,పసందైన పాకశాకాలను,పళ్ళ పాయసాలను,మధురసాలను సిద్ధము చేసి,చక్కని సెలయేరులు మనపక్కగ మక్కువను కురిపిస్తుంటే,చల్లని చిరుగాలులు వీవనలు వీస్తుంటే,"మన గడపనున్నవారి కడుపు నింపమంటు"భారత భాగ్య విధాతను తలచుకుంటు,విందును-కనువిందును అందిస్తుంటే,ఆకలి చిరునామా అదృశ్యమైపోదా?వందలాది వందనాలు చిందులేస్తూ ముందుకురావా పోటీపడి[మూల్యము గురించి ఆలోచించి చిన్నబుచ్చకండి ఆ కన్నతల్లి ప్రేమను).
       "శశకముతో సిం హమే జంటకడితే"అంతే ఇదేమేమో అంటూ {ఆకారము కాదు ముఖ్యం-అందులోని ఆ కారం}ఆకుపచ్చ ముత్యాల హారాల్లా,ఆలంబనగా నిలువెత్తు సంస్కారానికి ప్రతీకలుగా నింగినితాకేలానున మహావృక్షాలను చేసుకుని అందాలొలకపోసే మిరియాలతీగలను చూడగానే చిన్న పెద్ద తేడాలు చిన్నాభిన్నమైపోతాయి.
       చూశారుగదండీ "అశ్విన్ టీ స్టాల్"బాషా ఇరానీ టీకి బాదుషాలము మేమంటూ తేయాకు మడులగడుల హడావిడులు.నీవెక్కడుంతే మేమక్కడంటూ పరిమళపు పలుకులతో మనలను పరవశింపచేయు సుగంధాల తోటలు .ఏ జన్మబంధమో మీతో మాది అని మోదముతో సేదతీర్చే తేనీరు.

    BHOOTALA SVARGAMU-03

       కేరళ కేరింతలు-3
    _
     సదాచారపాలన-సత్ప్రవర్తన ఉచ్చ్వాస-నిశ్వాసములుగా గల ఊయల కేరళ.పాండితీ ప్రకర్షకు,విజ్ఞాన విజయాలకు పట్టముగట్టే లక్షణము ఇక్కడి జగములోనే కాదు గజములలోను గోచరిస్తుంది.భర్తృహరి "సుభాషిత  త్రిశతి" తెలుగుచేసిన పాండితీ ప్రకర్ష రాజాదణను "గజారాహోణ"గా మార్చి పైడిపల్లి  లక్ష్మణకవికి "ఏనుగు లక్ష్మణకవి"గా నామకరణము కావించి,లబ్ధప్రతిష్ఠను ప్రసాదించినవి.చిన్నారులు కౌతాలు.శ్రీమను తమ ప్రతిభా పాటవములతో "పదముల రాణి"ని మెప్పించుటెరింగి వారిచే
    "గజారోహణమే" కాదండోయ్ వనప్రదక్షిణము చేయించాయి మలయాళ మత్తగజములు.(పెద్దలు మొహమాట  పడతారని  కాని వారూ ధన్యులే సుమండీ) మరిన్నీ!!! మంచిని సాధించాలని మరీ మరీ దీవించాయి.
           "కళల పరిమళమే కేరళ" అనకుండా  ఉండగలమా! "కథాకళి"కలరి" ప్రదర్శనలనుచూశాక.నిర్జీవమైపోతున్న మనకళాప్రదర్శనలను పునరుద్ధరించాలని అనుకోకుండా ఉండగలమా.అవి ప్రదర్శనలు కావండీ" ప్రతిభా పురస్కారలకు ఆదర్శములు."
      మదర్పిత చందన తాంబులాదులు స్వీకరించి,మమ్మానంద పరచమని(డబ్బు కడితేనే) మంగళ హారతులతో,మల్లెల మాలలతో మనసారా ఆహ్వానించింది వైల్డ్ హోటలు సిబ్బంది.స్వాగత పానీయాలుగా సాటిలేని నారికేళ జలాలందిందించి.గలగలల సరిగమలతో వెనుతిరుగు జలాల
    అందాలు మన మనసులను గతములోని మధురానుభూతుల దగ్గరికి తీసుకెళుతుంతే -అదిగో.తుళ్ళిపడే అలలతో పోటీపడుతు పరవశిస్తున్న ప్రయాణీకుల గళములు,
      "పచ్చ పచ్చని తోటల్లోన చందమామ
       పండువెన్నెల జాడల్లోన చందమామ
       వచ్చె వచ్చె అలలతోన చందమామ
       పసిడిపడవ పయనములోన చందమామ
       మిసిమినవ్వుల పువ్వులమ్మ చందమామ
       నచ్చి వచ్చేసాడమ్మచందమామ
      ఆనందాల నిచ్చెన వేస్తు చందమామ"


    BHOOTALA SVARAGAMU-01

       కేరళ కేరింతలు-4

     వెనుకకు తిరుగు సరస్సుజలాల బలమేమో,మనసు వెనుకకు వెనుకకు పరుగిడుతుంటే దానిని  బంధించుటకు బుద్ధి బయలుదేరింది.వెంటనే..నేను ఇక్కడకు ఎలా రాగలిగాను?అవధులులేని నా ఆనందానికి కారకులెవరు?కళకళల కేరళ తలుపు తాళాన్ని నాకోసం తీసిందెవరు? అద్భుత ఆనందాల పల్లకీలో నేను కూర్చుంటే మోసిన బోయీలెవరు?మాకు కనువిప్పును కలిగించి మా అందరిమెప్పును శాలువగా కప్పుకున్న మేధావులెవరు?నాలో ప్రశ్నల పరంపరలు
    జవాబులను వెతికి...తల్లితండ్రులకు అద్భుత అనుభూతులనిచ్చిన వారిని(మనసులోనైన)మెచ్చుకోకుండా ఉండలేకపోయాను.వారికి వేయింతల ఆనందం కలగాలని...అది
    పుత్రొత్సాహమో,పౌత్రోత్సాహమో,నిత్యోత్సాహము కావాలని భగవంతుని ప్రార్థించాను.మనవరాళ్ళు,మనవడు అడుగడుగునా కనిపెట్టుకుని కంటిపాపలా చూసుకుంటేనే కదా ఇదిసాధ్యం.వియ్యమునొందిన నెయ్యము ఆత్మబంధువై కొత్త ఇంధనమును ఇస్తేనే గదా
    నేను కేరళ సౌధమున(సుధలుగలది)విహారముగావించినది.మందులే విందైన నాముందు అందాలసందడి చేయించిన ప్రతివారికి(వయసులో చిన్న-మనసులో మిన్న)మనసా,వచసా,శిరసా అంజలిస్తూ,మధురానుభూతులను మధించి,వ్యయ ప్రయాసలకు ఓర్చి మమ్మానందింప చేసిన ప్రతి ఒక్కరికి ,ఇంతై,ఇంతింతై,ఎంతెంతోగా ఆనందాలు చేరాలని ఆశిస్తూ,ఆశీర్వదిస్తూ......కొండంత చూసి గోరంత తెలిపిన
         భవదీయురాలు.


    MAHA GANAPATIM MANASAA SMARAAMI

      మహా గణపతిం మనసా స్మరామి
        ********************************
      నలుగురి మేలును కోరి,నలుగు ముద్దతో గౌరి,
      పరమ శివుని స్మరియిస్తూ,"వరపుత్రుని" చేసినది.

      సమరమైన చేయగలుగు సామర్థ్యపు కాపరి,
      కర్తవ్యము శుభకర " కరివదనుని" చేసినది.

      తల్లిని,తండ్రిని భక్తితో చుట్టిన బాలుని వైఖరి,
      అగణిత వాత్సల్యముతో "గణనాథుని" చేసినది.

      అహంకరించు అసురునిపై మోగించిన యుద్ధభేరి,
      "ఏకదంతుని," "మూషిక వాహనుని" చేసింది.

      మేరు పలకపై దంతపు ఘంటపు వ్రాత
      మహా కావ్య నాటకాది ప్రియునిగా కీర్తించినది

      పార్వతీ పరమేశ్వర పరిపూర్ణత్వము
      విఘ్నములను తొలగించు వినాయకుని  చేసినది.

      అపహాస్యము చేసిన ఆ చంద్రుని తిక్క కుదిరి,
      "భాద్రపద శుద్ధ చవితి" బహుళ ప్రాచుర్యము పొందినది.
       .................
      మట్టి ముద్దలో దప్పిక తీర్చు జలము,
      జలములో దాగినది జ్వలనము అగు అనలము,
      అనలమునకు సహాయము అనువైన అనిలము,
      అనిలముపై ఆధారము సకల ప్రాణి జీవనము,
      అలలతో ఆడునది ఆ పున్నమి ఆకాశము,
      స్థూల,సూక్ష్మ తత్వముతో-భక్త సులభ వశత్వముతో,
      పంచ భూతాత్మకముగా మా మంచిని కోరుచున్న,
      మట్టి ముద్దతో ముద్దుగా మమేకమైనది నీ రూపు నేడు.
       ........................

      ప్రణవ స్వరూపుడా ప్రణామములు మా అయ్యా,
      పత్రిపూజలు అందుకొని పచ్చదనమును ఈయవయ్యా,

      ఆవిరికుడుము ఆరగించి ఆరోగ్యమును ఈయవయ్యా,
      బిడ్డలగు మా దరిచేరు అడ్డంకులు తొక్కవయ్యా,

      మూషిక వాహనుడవై సామూహిక పూజలు అందుకోవయ్యా,
      " ఓంకార మూర్తి " మంచికి "శ్రీకారము " చుట్టవయ్యా.

      ఉత్సవాలు ప్రోత్సహించు-ఉత్త పూజలైనా సహించు,
      కాని పనులు క్షమించు-కానుకలు అనుగ్రహించు,
      వినతులు స్వీకరించు- వినుతులు స్వీకరించు,
      పదిదినములు అందముగ పందిళ్ళలో పరవశించు,
      పదికాలాలు నిండుగా ప్రతివారిని దీవించు.

       పంపిచేస్తామయ్యా కనుల సొంపైన వేడుకగా,
       మళ్ళీ మళ్లీ రమ్మంటూ కన్నీళ్ళ వీడ్కోలుగా,
       మనసులోనే పూజిస్తూ-మళ్లీ సంవత్సరానికై,
       మజ్జారే అనిపించే నిమజ్జనాలతో

        అంతదాక,

      దురాశకు  ప్రతిరూపమన్న నీలాపనిందను
         " దూరముచేసి",
     చింత లేని చిన్ని ఎలుకగా  మారి నేను
      " గం గణపతయే  నమ:" అంటు నీ చెంతనే  ఉండనీ.



                  వినాయక చవితి శుభాకాంక్షలు.


    VIJAYA UGADI

    ఉగాది
    అనాదిగా ఆదిదైన అందమైన ఉగాది
    జయము జయము జయ మమ్మా విజయనామ ఉగాది
    అంగ రంగ వైభవముగా రంగవల్లులేసి
    మిడి మిడి తలపులు వదిలి మామిడులను కట్టి
    అభ్యంతరమును బాపే అభ్యంగానమాడుదాము
    నూతన విలువల కూడిన కొత్త వలువలనే కట్టి
    బంధు మిత్రులందరితో సందడి చేస్తుండగా
    … వచ్చిన ఆ ఉగాది తల్లికి
    జలధారలు జలాజాక్షిని జలకములాడించగా
    కోనసీమ పచ్చకోక ముచ్చట తీర్చింది
    వరమై పరవశమై గళ సరమాయెను కోయిల స్వరం
    తూరుపు కిరణము తల్లికి హారతులీయగ సాగె
    తృష్ణ తీర్చి కృష్ణానది మృష్టాన్నము లందించగా
    చల్లలైన పిల్లగాలి మెల్లగ డోలికనూపె
    ప్రవాసాంధ్ర హృదయాలను తన నివాసము చెయదలచివచ్చి
    …ఆ తల్లి ఉగాది పచ్చడి గురించి ఇలా అంది
    ఇది మమకారపు శ్రీకారము అని కారం అంటున్నది
    మెప్పులు ఉప్పొంగాలని ఉప్పు చెప్పు చున్నది
    ప్రీతిగా ఉండాలంటూ తీపి ప్రయాత్నిస్తున్నది
    వలపు తలపు పిలుపుకై పులుపు చూస్తున్నది
    చిగురు పొగరు అణచమని వగరు మనలను అంటున్నది
    విజ్ఞానం చేదు* అని చేదు బోధిస్తున్నది (చేదు* = తోడుకోవడం )
    అరిశాద్వార్గాముల నణచ అమరెను షడ్రు చులు
    అరమరికలు లేక ఆరు రుచులను విందాము
    అని చెప్పెను అంత
    హాయిని గొలిపే ఆ సాయం సంధ్య యందు ఇది
    మా నవ వసంతమా లేక మానవ వసంతమా అని
    సందియమున నేనుండగా అందముగానపుడు
    పంచాంగ శ్రవణము ప్రపంచ భ్రమణమును తెలిపే
    స్వర్ణ కన్య నలరించు పూర్ణకుంభ మందుకొనగ
    మీన మేష మెంచకురా కానీయర పనులను
    వృషభ పౌరుషమును నేర్చి కృషి చేస్తూ నీవు
    మహారాజులా బ్రతకమని మృగరాజు అంటున్నది
    కొండెతో కొండెములను కాటు వేయ వృశ్చికము
    కర్కశ ముగ కసాయిని కడతేర్చును కర్కాటకము
    పతితుల పాలించగ ఇల ప్రతి మనసు ధనసు కాగా
    శ్రీకరములు నికరములు అని మకరము కరమెత్తె చూడు
    ఆధునికతో మైధునమై అద్యంత సుధా మధురమై
    పన్నెండు రాశులు మన వెన్నండగ నుండగ
    తడ బడక అడుగులను వడి వడిగా వేస్తూ
    స్వచ్చ మైన పచ్చ దనపు అచ్చ తెలుగు పండుగ చేద్దాము
    శుభం భూయాత్
    నిమ్మగడ్డ సుబ్బలక్ష్మి
    03. 21. 2013

    ARU RUTUVULU

    (ఆ) రుతువులు
    చిత్రాలనుచూపించగచైత్రంకదలివచ్చింది 
    ఉగాదితోపాటుమనకుశ్రీరామునితెచ్చింది
    సఖ్యతగాఉండాలనివైశాఖంవచ్చింది
    అప్పన్నదయతోఅక్షయ త్రుతీయనుతెచ్చింది
    శ్రేష్ఠతచాటగ నేననిజేష్ఠం కదలివచ్చింది
    పటిష్ఠత,ప్రతిష్ఠలనుపెంచేమామిడినితెచ్చింది
    ఆషామాషీదానినినేకానంటూఆషాఢం వచ్చింది
    ఉషారైనతద్దినోములనుముద్దుగానుతెచ్చింది
    ప్రణవముతనదేనంటూశ్రావణమువచ్చింది
    శ్రీకృష్ణుని,వరలక్ష్మిని తీసుకునివచ్చింది
    శుభప్రధమైననవ్యభాద్రపదమువచ్చింది
    ఇభవక్త్రుండైనదివ్యగణనాధునితెచ్చింది
    ఆశీర్వచనములతోఆశ్వయుజమువచ్చింది
    అసురశక్తినిఅణచివేసేఆదిశక్తినితెచ్చింది
    సమస్యలనుతొలగించినఅమావాస్యవచ్చింది
    ఇదిచీకటికాదనిఅమవస్యముతెచ్చింది
    కీర్తినివ్యాపింపచేయుకార్తీకమువచ్చింది
    పాపాలనుతొలగించేదీపాలనుతెచ్చింది
    మార్గముచూపిస్తానంటూమార్గశిరమువచ్చింది
    తిరుపావనస్మరణతోతిరుమలేశునిచ్చింది
    పుష్యరాగకాంతులతోపుష్యమాసము వచ్చింది
    కర్షకులకుసంక్రాంతినికానుకగాతెచ్చింది
    అఘరహితులుకండనుచుమాఘంవచ్చేసింది
    శుభకరుడౌదినకరుని, శంభునితెచ్చింది
    సద్గుణశాలినిఇదిగోఅనిఫాల్గుణంవచ్చింది
    దుర్గుణహోళిక నణచిరంగులకేళినితెచ్చింది
    నిక్షేపంగామనలనుఉంచగసాక్షీభూతములై
    మరలమరలవస్తాయిమధురిమలనుతెస్తాయి
    లక్షణంగాకాలాన్నిఆక్షేపించనీయకుండా
    లక్ష్య మనే గాలముతోనిక్షిప్తముచేసుకో

    AMMA MAMATA-08

    అమ్మ మన అందరికీ అత్యంత ప్రత్యేకము,అవుతుంది మనతో అమ్మ మమేకము,
    చిట్టిపొట్టి నడకలతో,చిలుకతల్లి పలుకులతో
    అమ్మకు మన ఆరాధన అనవరతము తెలుపుదాము
    ఆకారము మాదైనా దాని శ్రీకారము అమ్మ
    విరిబాలలు మేమైతే పరిమళములు అమ్మ
    పెదవివంపు అమ్మ ఐతే పదము తీపి అమ్మ
    కీర్తి శిఖరము యెక్కించే ప్రేమమూర్తి అమ్మ మిమ్ము నుతించ
    పూలదండలెందుకమ్మ కైదండలుండగ
    బహుమతులెందుకమ్మ సన్నుతులు ఉండగ
    ఆశయాలు,ఆశీసుల అండతో ఆచరణగా మారితే
    అవధిలేని ఆనందం భువిని పొంగిపొరిలితే
    అమ్మ పులకరిస్తుంది,ఆనందం పలకరిస్తుంది.

    OKKA MAATA


    తిక్కదైన ఒక్కమాట
    సీతమ్మను మార్చినది
    లోకపావనిగా
    అక్కసైన ఒక్కమాట
    బాలుని మార్చినది
    ధృవతారగా
    పక్కమీది ఒక్కమాట
    భోగినే మార్చినది
    యోగివేమనగా
    కొంటెదైన ఒక్కమాట
    కొలుచుటనే కోరింది
    తులసీదాసుగా
    గట్టిదైన ఒక్కమాట
    గాంగేయుని చేసింది
    గౌరవనీయునిగా
    మక్కువైన ఒక్కమాట
    మాధవునే మార్చింది
    రథసారథిగా
    అవసానపు ఒక్కమాట
    అజామిళుని చేరింది
    అపూర్వ పుణ్యముగా
    తీయనైన ప్రతిమాట
    తెలుగును మెరిపిస్తుంది
    భూగోళపు వెలుగుగా.

    TELUSUKO

    తెలుసుకో
    =============
    కోటీశ్వరులకు నీవు పోటీగా ఎదగాలని
    సాటిలేనిదంటు దాని మేటితనము చాటుకుంటూ
    అమెరికా అభివృద్ధిని ఆదర్శము అని అంటూ
    సలాం అంటూ దానికి నీవయ్యావు గులాము,.
    ............................................................
    అందమైన నయాగరా జలపాతం పరుగు చూడు
    మంచుకొండ అంచున పొంచియున్న ప్రభలు చూడు
    కల్పనాచతురతగల శిల్పకళల గుహలు చూడు
    చారెడు కన్నుల తోడ తారల వన్నెలు చూడు
    అందమైన ప్రకృతికి నీవయ్యావు బందీవి
    .................................
    ఐఫోను,ఐపాడు,ఐ మాక్సు
    ఈమెయిలు,ఈచాటు,ఈవెబ్‌
    పెండ్రైవు మరియెన్నో కనుగొన్నది టాలెంటు
    సాంకేతిక సౌరభమా,సమకాలీన సహవాసమా నీ
    ఘనత చాటుతానంటూ అయ్యావు బంటువి
    ............................................
    అన్నావు నువు బెస్తని,ఎదిగావు ఎవరెస్టని
    ఎటుచూసినా నీదేగా లేటెస్టు హాట్‌ న్యూసని
    నీ నీడగా ఉంటున్న నిజమును తెలిసికోలేక
    విజయాల మత్తులో మునిగావు నీవు
    చిత్తుచేసినానంటూ మారినావు తొత్తుగా
    ........................................
    ఒకటి,రెండు,మూడు చేసి ఓడించాననుకోకు
    పరమాత్మను కనుగొనని పరిశోధన ఫలితమేమి
    అన్నింట ఉన్నది అది,ఆనందపు వెల్లువ అది
    ఆత్మయను రెల్లు అది,అజ్ణానపు చెల్లు అది
    తెలుసుకో,తెలుసుకో,తెలివిగా మసలుకో.

    SITRAALU SOODARO


    ఆ గాంధార కుమారులను ఆకలి కబళించుట
    ..................
    ఆ పాంచాలికి వరముగా చేలములు అందించుట
    అభిమానముతో సుధామ కుచేలునిగా మిగులుట
    ..................
    ఖాండవమును దహించమని అగ్నిని ఆదేశించుట
    అగ్ని భయము లక్క ఇల్లు పాండవులను తరలించుట
    ...............
    రక్కసుడని అక్కసుతో గాలి తీసివేయుట(వృతాసురుడు)
    వెదురుకు గాలినిడి వేణువుగా మలచుట
    .................
    అలసట తీర్చగ వేల్పుల తులసిని చెట్టుగ చేయుట
    ముద్దు ముద్దు చష్టలతో మద్దులను మన్నించుట (నలకూబరులు)
    ..................
    సూర్యుడిని తరలించి కర్ణుని సృష్త్టించుట
    సూర్యుడిని మరలించి సైంధవుని వధించుట
    ........................
    చేతివేలి చక్రముతో ఉత్తరను మాతను చేయుట
    చేతివేలి సంజ్ణ్లతో జరాసంధుని అంతము ..........
    తప్పులను లెక్కించి తలనే ఖండించుట (శిశుపాలుని)
    మా లెక్కలేని తప్పులను మక్కువతో మన్నించుట
    .............
    నిజమేమో...కాదేమో...నైజమేమో...అవునేమో
    మనో నేత్రాలు తెరిచి నీ సిత్రాలను సూడనీ.
    LikeShow more reactions
    Comment

    MUTTEMULU

    ...........లు
    ముత్తెము నేనౌతానని నవ్వింది స్వాతిచుక్క
    సత్తువనిస్తానంటు నవ్వింది కూరచుక్క
    .....................
    రేయంతా మురుస్తూ నవ్వింది రేచుక్క
    చీకటితరిమేశానంటు నవ్వింది వేగుచుక్క
    ............
    నమ్మకమును సృష్టిస్తూ నవ్వింది దిష్టిచుక్క
    కళ్ళుదించి పరవశిస్తూ నవ్వింది పెళ్ళిచుక్క
    .....................
    అంగవైకల్యముచూసి నవ్వింది పోలియోచుక్క
    దప్పికను తరిమేస్తూ నవ్వింది నీటిచుక్క
    ....................
    కలవరమును కలిగిస్తూ నవ్వింది తోకచుక్క
    నవతరపు సారథిగా నవ్వింది రాధ చక్కనిచుక్క
    ఇంతలో.............
    వింతలు చూపిస్తానంటూ ఎంతో ఎదిగింది ఒకచుక్క
    ...................
    తళుకుబెళుకు తారలు తహతహలాడుచుండగా
    ............................
    ఏలికను చూపింది వేలిమీదిచుక్క.

    JAI BOLO GANESH



    జై.బోలో.గణేష్.మహరాజకి.జై
    అభివందనం..గణపతి
    ఆదిపూజ్య.....గణపతి
    ఇక్షుదండ....గణపతి
    ఈశపుత్ర......గణపతి
    ఉత్సవరూప...గణపతి
    ఊహాతీత.....గణపతి
    ఋషిపూజ్య...గణపతి
    ఎలుకవాహన..గణపతి
    ఏకదంత......గణపతి
    ఐశ్వర్య......గణపతి
    ఒద్దికైన.....గణపతి
    ఓంకార.......గణపతి
    ఔదుంబర.....గణపతి
    అంబాసుత......గణపతి
    దు:ఖహర.....గణపతి
    ..............ఈ
    స్వరార్చనను గైకొనరా
    సర్వార్చనగా.గణపతి
    ...............
    కలుషహర....గణపతి
    ఖలవిదూర..గణపతి
    గణనాయక...గణపతి
    ఘన వరముల.గణపతి
    జ్ఞానదాత..గణపతి
    ........
    చవితిపూజ్య.గణపతి
    చత్రధర...గణపతి
    జయమునీయ...గణపతి
    ఝషరూప....గనపతి
    విజ్ఞానము......గనపతి
    .........
    టంకపు.ఓ.గణపతి
    హఠయోగప్రియ.గణపతి
    డమరుహస్త..గణపతి
    ఢంకా.నాద.గణపతి
    ప్రణవరూప....గణపతి
    ..............
    తరియించగ..గనపతి
    రథారూఢ..గనపతి హ..గణపతి 
    దయారూప..గణపతి
    ధర్మతేజ..గణపతి
    నగపౌత్ర.గణపతి
    ............
    పండితశుభ.గణపతి
    ఫలదాయక..గణపతి
    బతుకునీయ..గణపతి
    భద్రతీయ..గణపతి
    మధురహాస.గణపతి
    ...........
    యతిసేవ్య.గణపతి
    రక్షకుడు.గణపతి
    లక్ష్మీపతి..గణపతి
    వక్రతుండ.గణపతి
    శత్రుహర..గణపతి
    షణ్ముఖ సోదర.గణపతి
    సకలము.శ్రీ.గణపతి
    హరిద్రా..గణపతి
    కళలధారి..గణపతి
    క్షమాహృదయ.గణపతి
    ఱాతి..రూప.గణపతి
    ............నీ
    అవ్యాజ కరుణయే..ఈ
    వ్యంజనముల.హారతి
    అక్షర.పూజలందుకొని
    అక్షయ.వరములను
    అందీయర..గణపతి
    వందనములు.గణపతి.
    .........
    సర్వేజనా.సుఖినో.భవంతు.

    TANOTU NAH SIVAH SIVAM-18

        తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...