Friday, January 26, 2018

SNEHAMU-01



"స్నేహము" అంటే ?
***********************
కంటికి కనిపించాలా-కబురులెన్నో చెప్పాలా
కనురెప్ప చెబుతుందా కంటితో స్నేహము అని
కాపాడుటయేకాదా కలకాలపు స్నేహము
చేతలు చాటించాలా-చప్పట్లే కొట్టాలా
చేతులు చెబుతాయా వెతలతో స్నేహము అని
చేయూతనిచ్చుటయేకాదా చేతనైన స్నేహము
నింగి పొంగిపోతుందా-నేల మేలమాడుతుందా
ఋతువులు చెబుతాయా గతులతో స్నేహము అని
వసివాడని స్థితికాదా వసుధైక స్నేహము
ప్రగల్భాలు పలకాలా-ప్రతిజ్ఞలే చేయాలా
ప్రజ్ఞా పాటవము చెబుతోందా ప్రతిఒక్కరితో స్నేహము అని
పరిశోధనల ఫలితమేగా పదిలమైన స్నేహము
దుర్భరము అంటాయా - ఆర్భాటము చేస్తాయా
అవయవాలు చెబుతాయా రోగులతో స్నేహము అని
అమరి పనిచేయుటగా అద్భుతమైన స్నేహము
భాషలు చెప్పలేని భావమేగా స్నేహము
భావము వివరించలేని అనుభవమేగా స్నేహము
విశ్వాసపు శ్వాసయైన విశ్వమేగ స్నేహము.
స్నేహమా-జోహార్లు.

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...